పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : ** రుద్రోపదిష్టమైన యోగాదేశ విష్ణు స్తోత్రము (సర్వసిద్ధి ప్రదం)

  1
పంకజనాభాయ సంకర్షణాయ శాం-
తాయ విశ్వప్రబోధాయ భూత
సూక్ష్మేంద్రియాత్మనే సూక్ష్మాయ వాసుదే-
వాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వి
కారాయ కర్మవిస్తారకాయక్షేత్ర-
పా; లాయ త్రైలోక్యపాలకాయ
సోమరూపాయ తేజోబలాఢ్యాయ స్వ-
యం జ్యోతిషే దురన్త్యాయ కర్మ

  2
సాధనాయ పురాపురుషాయ యజ్ఞ
రేతసే జీవతృప్తాయ పృథ్విరూప
కాయ లోకాయ నభసే న్తకాయ విశ్వ
యోయే విష్ణవే జిష్ణవే మోస్తు.

  3
స్వర్గాపవర్గ సుద్వారాయ సర్వ ర-
సాత్మనే పరమహంసాయ ధర్మ
పాలాయ సద్ధిత లరూపకాయ కృ-
ష్ణాయ ధర్మాత్మనే ర్వశక్తి
యుక్తాయ ఘన సాంఖ్య యోగీశ్వరాయ హి-
ణ్య వీర్యాయ రుద్రాయ శిష్ట
నాథాయ దుష్ట వినాశాయ శూన్య ప్ర-
వృత్తాయ కర్మణే మృత్యవే వి

  4
రాట్ఛరీరాయ నిఖిల ధర్మాయ వాగ్వి
భూతయే నివృత్తాయ సత్పుణ్య భూరి
ర్చ సేఖిల ధర్మదేహాయ చాత్మ
నే నిరుద్ధాయ నిభృతాత్మనే నమోస్తు.

  5
ర్వ సత్త్వాయ దేవాయ న్నియామ
కాయ బహిరన్తరాత్మనే కారణాత్మ
నే సమస్తార్థ లిఙ్గాయ నిర్గుణాయ
వేధసే జితాత్మక సాధవే నమోస్తు.

  6
అని మఱియుఁ "బ్రద్యుమ్నుండవును నంతరాత్మవును సమస్త శేష కారణుండవును చాతుర్హోత్రరూపుండవును నంతకుండవును సర్వజ్ఞుండవును జ్ఞానక్రియారూపుండవును నంతఃకరణవాసివియును నైన నీకు నమస్కరింతు"నని.

  7
ఘా! దేవ! భవత్పద
రుహ సందర్శనేచ్ఛ ఱలిన మాకున్
విను వైష్ణవ సత్కృతమై
యెయు భవద్దర్దర్శనంబు నీవె మహాత్మా!

  8
అది యెట్టి దనిన.

  9
ఘ! సకలేంద్రియగుణాం
మును భక్తప్రియంబు లదశ్యామం
బును సౌందర్య సమగ్రము
నుపమమును నిఖిల మంగళావహ మగుచున్.

  10
మఱియును.

  11
ళికులోపమ లసలక శోభిత మగు-
మృతాంశు రేఖానిభాననమును
మకర్ణ దివ్య భూషా ప్రభా కలితంబు-
సుందర భ్రూనాస సురుచిరంబు
లలిత కుంద కుట్మల సన్నిభద్విజ-
పూరిత స్నిగ్ధ కపోల యుగము
ద్మ పలాశ శోన లోచనంబును-
మందస్మితాపాంగ సుందరమును

  12
స్మితాలోక సతత ప్రన్న ముఖముఁ
గంబు సుందర రుచిర మంళ గళంబు
హామణి కుండలప్రభాపూ కలిత
చారు మృగరాజ సన్నిభ స్కంధ యుతము.

  13
వెండియు, శంఖ చక్ర గదా పద్మ కలితాయత బాహు చతుష్టయంబును, వైజయంతీ వనమాలికా కౌస్తుభమణి శ్రీవిరాజితంబును, నిత్యానపాయిని యయిన యిందిరాసుందరీరత్న పరిస్పందంబునం దనరి తిరస్కృత నికషోపలం బైన వక్షస్థ్సలంబును, యుచ్ఛ్వాస నిశ్శ్వాసంబులం జంచలంబులైన వళిత్రయ రుచిర ప్రకాశమాన దళోదరంబును, పూర్వ వినిర్గత నిఖిల విశ్వంబునుం బ్రవిష్టంబుఁజేయురీతి నొందు సలిలావర్త సన్నిభ గంభీర నాభివివరంబును, పంకజ కింజల్క విభాసిత దుకూలనిబద్ధ కనక మేఖలా కలాప శోభితశ్యామ పృథు నితంబ బింబంబును, నీలకదళీస్తంభరుచి రోరు యుగళంబును, సమచారు జంఘంబును, నిమ్నజాను యుగళంబును, బద్మపత్ర భాసుర పాదద్వయంబును, మదీయాంతరంగ తమోనివారక నిర్మల చంద్రశకల సన్నిభనఖంబును, గిరీట కుండల గ్రైవేయహార కేయూర వలయ ముద్రికా మణినూపురాది వివిధ భూషణ భూషితంబును, నిరస్త సమస్త నతజన సాధ్వసంబును, భక్తజన మనోహరంబును, సర్వ మంగళాకరంబును నైన భగవద్దివ్య రూపంబుఁ దామస జన సన్మార్గ ప్రదర్శకుండవైన నీవు మాకుం జూపి మమ్ముఁ గృతార్థులం జేయు” మని వెండియు నిట్లనియె.

  14
త్మకుఁ బరిశుద్ధి ర్థించు వారికి-
ధ్యేయ వస్తువు భవద్దివ్యమూర్తి;
యంచిత స్వర్గరాజ్యాభిషిక్తున కైన-
మధిక స్పృహణీయముఁడ వీవు;
ద్భక్తియుత భక్త న సులభుండవు-
దుష్టాత్ములకుఁ గడు దుర్లభుండ;
వాత్మదర్శనులకు రయ గమ్యుండవు-
నై యర్థి విలసిల్లు నఘచరిత!

  15
యిట్టి నిఖిల దురారాధ్యు నీశు నిన్ను
నెఱయ సుజనుల కైన వర్ణింపరాదు;
ఱల నెవ్వఁడు పూజించు వాఁడు విడువఁ
జాలునే? పద్మదళనేత్ర! చ్చరిత్ర!

  16
సిన భక్తియోగమున నే భవదీయపదాబ్జ మొందఁగా
యముఁ గోరువాఁడు చటులాగ్రహ భీషణ వీర్యశౌర్య త
ర్జములచే ననూనగతి ర్వజగంబులు సంహరించు న
య్యనుపముఁడైన కాలునిభయంబును బొందఁడు సుమ్ము కావునన్.

  17
ట్టి నీ పాదమూలంబు లెవ్వఁడేని
బొంది ధన్యాత్ముఁడౌ నట్టి పుణ్యుఁ డొండు
నము లోపలఁ గోరునే ఱచియైన?
వ్యయానంద! గోవింద! రి! ముకుంద!

  18
రి! నీ భక్తులతోడను
నిరుపమగతిఁ జెలిమిచేయు నిమిషార్ధముతో
రిగాదు మోక్ష మనిన న
చిశుభ మగు మర్త్య సుఖముఁ జెప్పఁగ నేలా.

  19
దురిత వినాశక పదపం
రుహ! భవత్కీర్తి తీర్థణచయ బాహ్యాం
సేక ధూత కల్మష
పురుషులు ధరమీఁదఁ దీర్థభూతులు గారే?

  20
అట్టి భూతదయా సమేతులును రాగాది విరహిత చిత్తులును నార్జవాది గుణ యుక్తులును నయిన భాగవత జనుల సంగంబు మాకుం గలుగఁ జేయుము; ఇదియ మ మ్మనుగ్రహించుట"యని వెండియు నిట్లనియె.

  21
సిజనాభ! సత్పురుష సంగసమంచిత భక్తి యోగ వి
స్ఫుణ ననుగ్రహింపబడి శుద్ధము నొందినవాని చిత్తమ
స్థి బహిరంగముం గనదు; చెందదు భూరితమస్స్వరూప సం
ణ గుహం జిరంబు గనఁజాలు భవన్మహనీయ తత్త్వమున్.

  22
అది యెట్టి దనిన.

  23
రయంగ నేమిటి యందు నీ విశ్వంబు-
విదితమై యుండు? నీ విశ్వమందు
నేది ప్రకాశించు? నెప్పుడు నట్టి స్వ-
యంజ్యోతి నిత్యంబు వ్యయంబు
నాకాశమును బోలి విరళ వ్యాపక-
గు నాత్మతత్త్వంబు ధిక మహిమ
మరు పరబ్రహ్మ గు నని పల్కి యి-
ట్లనియె నవిక్రియుండైన వాఁడు

  24
నెవ్వఁ డాతఁడు దనయందు నెపుడు నాత్మ
కార్యకరణ సమర్థంబు గాని భేద
బుద్ధి జనకంబు నాఁదగు భూరిమాయఁ
జేసి విశ్వంబు సత్యంబుగా సృజించె.

  25
రలఁమరలఁ బెక్కుమాఱు లీ విశ్వంబు
నన వృద్ధి విలయ సంగతులను
నందఁ జేయుచుండు ట్టి యీశ్వరుఁడవై
నరు నిన్ను నాత్మ త్త్వముగను.

  26
తెలియుదు” మని వెండియు నిట్లనియె “యోగపరాయణు లగువారు శ్రద్ధా సమన్వితులై క్రియాకలాపంబుల నంతఃకరణోపలక్షితం బయిన భవదీయ రూపంబు యజింతురు; వారు వేదాగమతత్త్వ జ్ఞానులు; నీ వాద్యుండవును ననాదియు నద్వితీయుండవును మాయాశక్తి యుక్తుండవును నై విలసిల్లు చుండుదు; వట్టి మాయాశక్తి చేత.

  27
తురాత్మ! సత్త్వరస్తమోగుణములు-
రుస జనించెను; వానివలన
హదహంకార తన్మాత్ర నభోమరు-
ల జలావని ముని సుపర్వ
భూతగణాత్మక స్ఫురణ నీ విశ్వంబు-
భిన్న రూపమున నుత్పన్న మయ్యె;
దేవ! యీ గతి భవదీయ మాయను జేసి-
రూఢిఁ జతుర్విధ రూపమైన

  28
పురము నాత్మాంశమునఁ జెందు పురుషుఁ డింద్రి
ములచే విషయ సుఖము నుభవించు;
హిని మధుమక్షికాకృత ధువుఁ బోలి
తనిఁ బురవర్తి యగు జీవుఁ డండ్రు మఱియు.

  29
ఇట్టి జగత్సర్జకుండవైన నీవు.

  30
భూగణంబుల చేతనె
భూగణంబు లను మేఘపుంజంబుల ని
ర్ధూముగఁ జేయు ననిలుని
భాతిని జరియింపఁ జేసి పౌరుష మొప్పన్.

  31
రూఢిఁ దత్తత్క్రియాలబ్ధ రూపుడవును
సుమహితస్ఫురదమిత తేజుఁడవుఁ జండ
వేగుఁడవు నయి ఘన భుజా విపుల మహిమ
విశ్వసంహార మర్థిఁగావింతు వీశ!

  32
అది యెట్లనిన.

  33
తి కర్తవ్య విచారక
తిచేఁ దగ నెప్పుడుం బ్రత్తంబును సం
చి విషయ లాలసము నూ
ర్జి లోభము నైన యట్టి సృష్టి గడంకన్.

  34
ప్రమత్తుండ వగుచుఁ బద్మాక్ష! నీవు
మ్రింగుదువు చాల నాఁకట మ్రేఁగు చుండి
నాలుకలు గ్రోయు భూరిపన్నగము వాతఁ
డిన యెలుకను భక్షించు గిది ననఘ!

  35
నిశము నస్మదీయగురుఁడైన సరోరుహ సంభవుండు న
మ్మనువులు నాత్మసంశయము మాని భజించు భవత్పదాబ్జముల్
మున నిల్పి యుష్మదవమాన మహావ్యధఁ జెందునట్టి స
జ్జనుఁడు పరిత్యజించునె? భుజంగమతల్పక! భక్తకల్పకా!

  36
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత చతుర్థ స్కంధ అంతర్గత రుద్రోపదిష్టమైన యోగాదేశ విష్ణు స్తోత్రము (సర్వసిద్ధి ప్రదం)