పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-717-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి భూతదయా సమేతులును రాగాది విరహిత చిత్తులును నార్జవాది గుణ యుక్తులును నయిన భాగవత జనుల సంగంబు మాకుం గలుగఁ జేయుము; ఇదియ మ మ్మనుగ్రహించుట" యని వెండియు నిట్లనియె.

టీకా:

అట్టి = అటువంటి; భూత = జీవుల ఎడ; దయా = కృప; సమేతులు = కలిగి యుండు వారు; రాగ = రాగద్వేషములు; ఆది = మొదలైనవి; విరహిత = బొత్తిగ లేని; చిత్తులున్ = మనసులు కల వారు; ఆర్జవ = ఋజువర్తన, సూటిగా నడచుట; ఆది = మొదలగు; గుణ = సుగుణములు; యుక్తులున్ = కలవారు; అయిన = అయినట్టి; భాగవత = భాగవతులు అయిన; జనులన్ = వారి; సంగంబున్ = సాంగత్యము; మాకున్ = మాకు; కలుగన్ = కలుగునట్లు; చేయుము = చేయుము; ఇదియ = ఇదే; మమ్మున్ = మమ్ములను; అనుగ్రహించుట = అనుగ్రహించుట; అనిన్ = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ప్రాణులపట్ల దయకలవాళ్ళు, రాగద్వేషాలు లేని మనస్సు కలవాళ్ళు, కపటం లేనివాళ్ళు అయిన అటువంటి సద్భక్తుల సహవాసాన్ని మాకు కలుగచెయ్యి. ఇదే మమ్ములను అనుగ్రహించడం” అని ఇంకా ఇలా అన్నాడు.