పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-716-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దురిత వినాశక పదపం
రుహ! భవత్కీర్తి తీర్థణచయ బాహ్యాం
సేక ధూత కల్మష
పురుషులు ధరమీఁదఁ దీర్థభూతులు గారే?

టీకా:

దురిత = పాపములను; వినాశక = నాశనము చేసేటటువంటి; పద = పాదములు అనెడి; పంకరుహము = పద్మములు కలవాడ; భవత్ = నీ యొక్క; కీర్తి = కీర్తి అనెడి; తీర్థ = నీటి; కణ = కణముల; చయ = సమూహముచే; బాహ్య = బయటలను; అంతర = లోపలను; సేక = తడపబడుటవలన; ధూత = పోగొట్టబడిన; కల్మష = కల్మషములు గల; పురుషులు = మానవులు; ధర = భూమి; మీదన్ = పైన; తీర్థభూతులు = తీర్థములు తామైన వారు; కారే = కారా ఏమి, అగుదురు.

భావము:

పాపాలను నాశనం చేసే పాదపద్మాలు కలవాడా! నీ కీర్తి అనే జలకణాలతో లోపలి, బయటి మాలిన్యాన్ని తొలగించుకొన్నవారే ఈ లోకంలో ప్రవిత్రులు కదా!