పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-718-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సిజనాభ! సత్పురుష సంగసమంచిత భక్తి యోగ వి
స్ఫుణ ననుగ్రహింపబడి శుద్ధము నొందినవాని చిత్తమ
స్థి బహిరంగముం గనదు; చెందదు భూరితమస్స్వరూప సం
ణ గుహం జిరంబు గనఁజాలు భవన్మహనీయ తత్త్వమున్.

టీకా:

సరసిజనాభ = విష్ణుమూర్తి {సరసిజ నాభుడు - సరసిజము (పద్మము) నాభి (బొడ్డు)న కలవాడు, విష్ణువు}; సత్ = మంచి; పురుష = వారి; సంగమ = సాంగత్యము వలన; సమంచిత = చక్కగా కలిగిన; భక్తియోగ = భక్తియోగము; విస్ఫురణన్ = విస్తరించుట; అనుగ్రహింపబడి = ఇవ్వబడి; శుద్ధమున్ = శుద్ధి చేయబడుటను; ఒందిన = పొందిన; వాని = వాని యొక్క; చిత్తమున్ = మనసు; అస్థిర = చంచలమైన; బహిరంగమున్ = బయటి ప్రపంచమును; కనదున్ = చూడదు; చెందదున్ = చెందదు; భూరి = అత్యధికమైన; తమస్ = తమోగుణ, చీకటి; స్వరూప = రూపము గల; సంసరణ = సంసారము యనెడి; గుహన్ = గుహను; చిరంబున్ = స్థిరముగ; కనజాలున్ = చూడగలుగును; భవత్ = నీ యొక్క; మహనీయ = గొప్ప; తత్త్వమున్ = తత్త్వమును.

భావము:

“పద్మనాభా! సత్పురుషుల స్నేహం వల్ల సంప్రాప్తమైన భక్తియోగం చేత పరిశుద్ధు డైనవాని మనస్సు అస్థిరాలైన బాహ్య విషయాలలో చిక్కుకొనదు. తమోరూపమైన సంసార గుహలో ప్రవేశించదు. అది స్వరూపాన్ని చక్కగా తెలుసుకోగలదు.