పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

 •  
 •  
 •  

4-712-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

త్మకుఁ బరిశుద్ధి ర్థించు వారికి-
ధ్యేయ వస్తువు భవద్దివ్యమూర్తి;
యంచిత స్వర్గరాజ్యాభిషిక్తున కైన-
మధిక స్పృహణీయముఁడ వీవు;
ద్భక్తియుత భక్త న సులభుండవు-
దుష్టాత్ములకుఁ గడు దుర్లభుండ;
వాత్మదర్శనులకు రయ గమ్యుండవు-
నై యర్థి విలసిల్లు నఘచరిత!

4-712.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

యిట్టి నిఖిల దురారాధ్యు నీశు నిన్ను
నెఱయ సుజనుల కైన వర్ణింపరాదు;
ఱల నెవ్వఁడు పూజించు వాఁడు విడువఁ
జాలునే? పద్మదళనేత్ర! చ్ఛరిత్ర!

టీకా:

ఆత్మ = ఆత్మ; కున = కి; పరిశుద్ధిన్ = స్వచ్ఛతను; అర్థించు = కోరెడి; వారు = వారు; కిన్ = కి; ధ్యేయ = ధ్యానింపదగిన; వస్తువు = వస్తువు; భవత్ = నీ యొక్క; దివ్య = దివ్యమైన; మూర్తిన్ = స్వరూపము; అంచిత = గౌరవప్రదమైన; స్వర్గ = స్వర్గమున; రాజ్య = రాజ్యమునకు; అభిషిక్తున్ = పట్టముగట్టబడినవాని; కైనన్ = అయినను; సమ = మిక్కిలి; అధిక = అధికమైన; స్పృహణీయతముడవు = కోరదగినవారిలో అత్యుత్తముడవు {స్పృహణీయుడు - స్పృహణీయతరుడు - స్పృహణీయతముడు}; ఈవు = నీవు; సత్ = సత్యమైన; భక్తి = భక్తి; యుత = కలిగుండెడి; జన = వారికి; సులభుండవు = సుళువుగాలభించువాడవు; దుష్ట = చెడ్డ; ఆత్ముల్ = మనసుకలవారల; కున్ = కు; కడు = మిక్కిలి; దుర్లభుండవు = కష్టసాధ్యుడవు; ఆత్మదర్శనుల్ = తత్త్వదర్శనులకు; అరయన్ = విచారించిన; గమ్యుండవు = లక్ష్యము యైనవాడవు; ఐ = అయ్యి; = అర్థిన్ = కోరి; విలసిల్లుదు = విరాజిల్లెదవు; అనఘ = పుణ్య; చరిత = నడవడికకలవాడ.
ఇట్టి = ఇటువంటి; నిఖిల = సమస్తమైనవారికి; దురారాధ్యున్ = ఆరాధించుటకు కష్టమైనవాని; ఈశున్ = భగవంతుని; నిన్నున్ = నిన్ను; నెఱయన్ = నిండుగా; సుజనుల్ = దేవతలు; కైనన్ = కి అయినను; వర్ణింపరాదు = స్తుతింపజాలరు; వఱలన్ = వర్తించి; ఎవ్వడు = ఎవరైతే; పూజించు = సేవించునో; వాడు = వాడు; విడువన్ = విడుచుట; పద్మదళనేత్ర = నారాయణ {పద్మదళనేత్రుడు - పదమ్మమురేకులవంటి కన్నులు కలవాడు, విష్ణువు}; సచ్చరిత్ర = మంచి కథలుకలవాడ; చాలునే = చేయగలుగునా.

భావము:

“కమలాక్షా! సచ్చరిత్రా! ఆత్మ పరిశుద్ధిని కోరే వారికి నీ దివ్యమూర్తి ధ్యానింపదగింది. స్వర్గాధిపతికైనా నీవు కోరదగినవాడవే. నీవు భక్తులకు సులభుడవు. దుష్టులకు దుర్లభుడవు. ఆత్మ దర్శనులు నిన్ను పొందగలరు. నీవు దురారాధ్యుడవు. నిన్ను సజ్జనులు కూడ వర్ణింపలేరు. నిన్ను పూజించువాడు నిన్ను విడువలేడు.