పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-722-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తెలియుదు” మని వెండియు నిట్లనియె “యోగపరాయణు లగువారు శ్రద్ధా సమన్వితులై క్రియాకలాపంబుల నంతఃకరణోపలక్షితం బయిన భవదీయ రూపంబు యజింతురు; వారు వేదాగమతత్త్వ జ్ఞానులు; నీ వాద్యుండవును ననాదియు నద్వితీయుండవును మాయాశక్తి యుక్తుండవును నై విలసిల్లు చుండుదు; వట్టి మాయాశక్తి చేత.

టీకా:

తెలియుదుము = తెలిసికొంటిమి; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; యోగ = యోగమునందు; పరాయణులు = నిష్ఠకలవారు; అగు = అయిన; వారు = వారు; శ్రద్ధా = శ్రద్ధ; సమన్వితులు = కలిగిన వారు; ఐ = అయ్యి; క్రియ = తమ పనులను; కలాపంబులన్ = చేసెడి విధానములలో; అంతఃకరణ = మనసుచే; ఉపలక్షితంబున్ = గమనింపబడినది; అయిన = అయిన; భవదీయ = నీ యొక్క; రూపంబున్ = రూపమును; యజింతురు = పూజింతురు; వారు = వారు; వేద = వేదములు; ఆగమ = ఆగమశాస్త్రములు; తత్త్వ = తత్త్వశాస్త్రములు యందు; జ్ఞానులు = విజ్ఞానము కలవారు; నీవున్ = నీవు; ఆద్యుండవునున్ = మొట్టమొదటి వాడవు; అనాదియున్ = పుర్వమునుండి యున్న వాడవు; అద్వితీయుండవును = సాటిలేని వాడవు; మాయాశక్తియుక్తుండవును = మాయ అనెడి శక్తి కలవాడవు; ఐ = అయ్యి; విలసిల్లుచుండుదువు = ప్రకాశించు చుందువు; అట్టి = అటువంటి; మాయా = మాయ యొక్క; శక్తి = శక్తి; చేత = వలన.

భావము:

అని తెలుసుకున్నాము” అని ఇంకా ఇలా అన్నాడు. “యోగనిష్ఠ కలవారు శ్రద్ధతో తమ పనులను ఆచరిస్తూ నీ రూపాన్ని మనస్సులో భావిస్తూ పూజిస్తారు. వారు వేద తత్త్వజ్ఞానులు. నీవు ఆద్యుడవు. అద్వితీయుడవై మాయాశక్తితో కూడి విలసిల్లుతూ ఉంటావు. అటువంటి మాయాశక్తి చేత….