పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-729-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రమత్తుండ వగుచుఁ బద్మాక్ష! నీవు
మ్రింగుదువు చాల నాఁకట మ్రేఁగు చుండి
నాలుకలు గ్రోయు భూరిపన్నగము వాతఁ
డిన యెలుకను భక్షించు గిది ననఘ!

టీకా:

అప్రమత్తుండవు = ఏమరుపాటు లేని వాడవు; అగుచున్ = అవుతూ; పద్మాక్ష = నారాయణా; నీవున్ = నీవు; మ్రింగుదువు = లయింప చేసుకొనెదవు; చాలన్ = చాలా; ఆకటన్ = ఆకలితో; మ్రేగుచుండి = వేగుతుండి; నాలుకలున్ = నాలుకలను; క్రోయు = చాచుచు నుండెడి; భూరి = అతిపెద్ద; పన్నగము = పాము; వాతన్ = నోట; పడిన = పడ్డ; ఎలుకనున్ = ఎలుకని; భక్షించు = మింగెడి; పగిదిన్ = వలె; అనఘ = పుణ్యుడ.

భావము:

కమలాక్షా! అధికమైన ఆకలితో నాలుకలు చాస్తున్న పాము తన నోట బడిన ఎలుకను తిన్నట్లు నీవు మెలకువతో (ఈ సృష్టిని) మ్రింగుతావు.