పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-702.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సాధనాయ పురాపురుషాయ యజ్ఞ
రేతసే జీవతృప్తాయ పృథ్విరూప
కాయ లోకాయ నభసే న్తకాయ విశ్వ
యోయే విష్ణవే జిష్ణవే మోస్తు.

టీకా:

పంకజనాభాయ = హరి {పంకజనాభుడు - పద్మము నాభిన కలవాడు, విష్ణువు}; సంకర్షణాయ = హరి {సంకర్షణుడు - చతుర్వ్యూహములలోని సంకర్షణుడు, అహంకారమునకు అధిష్టాత, విష్ణువు}; శాంతాయ = హరి {శాంతుడు - శాంతముకలవాడు, విష్ణువు}; విశ్వప్రభోధాయ = హరి {విశ్వప్రభోధాయ - జగతికి చైతన్యము కలిగించువాడు, విష్ణువు}; భూతసూక్ష్మేంద్రియాత్మనే = హరి {భూతసూక్ష్మేంద్రియాత్మన - జీవులకు సూక్ష్మేంద్రియములు (తన్మాత్రలు, ఇంద్రియములు) తానైన వాడు, విష్ణువు}; సూక్ష్మాయ = హరి {సూక్ష్ముడు - సూక్ష్మమే తానైనవాడు, విష్ణువు}; వాసుదేవాయ = హరి {వాసుదేవుడు - చతుర్వ్యూహములలోని వాసుదేవుడు, బుద్ధికి అధిష్టానదేవత, సమస్తమందు వసించెడి దేవుడు, విష్ణువు}; పూర్ణాయ = హరి {పూర్ణుడు - విశ్వమంతా నిండియున్నవాడు, పరిపూర్ణమైనవాడు, విష్ణువు}; పుణ్యాయ = హరి {పుణ్యుడు - పుణ్యమే తానైనవాడు, విష్ణువు}; నిర్వికారాయ = హరి {నిర్వికారుడు - వికారములు (మార్పులు) లేనివాడు, విష్ణువు}; కర్మవిస్తారకాయ = హరి {కర్మవిస్తారకాయుడు - వేదకర్మలను విస్తరింపజేయువాడు, విష్ణువు}; క్షేత్రపాలాయ = హరి {క్షేత్రపాలుడు - శరీరములు అనెడి క్షేత్రములను పాలించువాడు, విష్ణువు}; త్రైలోక్యపాలకాయ = హరి {త్రైలోక్యపాలకుడు - త్రైలోక్య (ముల్లోకములను) పాలకుడు, విష్ణువు}; సోమరూపాయ = హరి {సోమరూపుడు - స ఉమ (శివుని) రూపము కలవాడు, విష్ణువు}; తేజోబలాఢ్యాయ = హరి {తేజోబలాఢ్యుడు - తేజము బలము మిక్కిలిగా కలవాడు, విష్ణువు}; స్వయంజ్యోతిషే = హరి {స్వయంజ్యోతిషుడు - స్వయముగా ప్రకాశము కలవాడు, విష్ణువు}; దురన్తాయ = హరి {దురన్తుడు - దురితములను అంతముచేయువాడు, విష్ణువు}; కర్మసాధనాయ = హరి {కర్మసాధనుడు - వేదకర్మలకు సాధనమైనవాడు, విష్ణువు}.
పురాపురుషాయ = హరి {పురాపురుషుడు - పురాణపురుషుడు, విష్ణువు}; యజ్ఞరేతసే = హరి {యజ్ఞరేతస్సుడు - యజ్ఞమునకు రేతస్సువంటివాడు (కారణుడు), విష్ణువు}; జీవతృప్తాయ = హరి {జీవతృప్తుడు - జీవమనెడు తృప్తము (పురోడాశము, యజ్ఞార్థమైన ఆపూపము) కలవాడు, విష్ణువు}; పృథ్విరూపకాయ = హరి {పృథ్విరూపకుడు - పృథ్వి (పెద్ద, బృహతి) రూపము కలవాడు, ఉరుగాయుడు, విష్ణువు}; లోకాయ = హరి {లోకుడు - లోకము స్వరూపముగ కలవాడు, విష్ణువు}; నభసే = హరి {నభస్సు - ఆకాశము తానైనవాడు, విష్ణువు}; అన్తకాయ = హరి {అన్తకుడు - లయకారకుడు, విష్ణువు}; విశ్వయోనయే = హరి {విశ్వయోనిః - విశ్వమునకు ఉత్పత్తిస్థానమైనవాడు, విష్ణువు, విశ్వమునకు కారణ మయినవాడు, విష్ణుసహస్రనామములు శ్రీశంకర భాష్యం 117వ నామం, 149వ నామం}; విష్ణవే = హరి {విష్ణువు - వ్యాపించెడివాడు, విష్ణువు}; జిష్ణవే = హరి {జిష్ణవు - జయించెడివాడు, విష్ణువు}; నమోస్తు = నమస్కారము.

భావము:

“పద్మనాభుడవు, సంకర్షణుడవు, శాంతుడవు, జగతికి చైతన్యాన్ని కలిగించేవాడవు, తన్మాత్రలకూ ఇంద్రియాలకూ ఆశ్రయమైనవాడవు, సూక్ష్మమే నీవైనవాడవు, వాసుదేవుడవు, పరిపూర్ణమైనవాడవు, పుణ్యశరీరుడవు, నిర్వికారుడవు, వేదకర్మలను విస్తరింప జేసినవాడవు, దేహము లనెడి క్షేత్రాలను పాలించేవాడవు, ముల్లోకాలకు పాలకుడవు, సోమరూపుడవు, అధిక తేజస్సూ బలమూ కలవాడవు, స్వయంప్రకాశం కలవాడవు, అంతం లేనివాడవు, వేదకర్మలకు సాధనమైనవాడవు, పురాణ పురుషుడవు, యజ్ఞకారకుడవు, జీవ తృప్తుడవు, ఉరుగాయుడవు, లోకస్వరూపుడవు, ఆకాశం నీవే అయినవాడవు, లయకారుడవు, విశ్వకర్తవు, సర్వ వ్యాపకుడవు, జిష్ణుడవు అయిన నీకు నమస్కారం.