పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-710-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ళికులోపమ లసలక శోభిత మగు-
మృతాంశు రేఖానిభాననమును
మకర్ణ దివ్య భూషా ప్రభా కలితంబు-
సుందర భ్రూనాస సురుచిరంబు
లలిత కుంద కుట్మల సన్నిభద్విజ-
పూరిత స్నిగ్ధ కపోల యుగము
ద్మ పలాశ శోన లోచనంబును-
మందస్మితాపాంగ సుందరమును

4-710.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్మితాలోక సతత ప్రన్న ముఖముఁ
గంబు సుందర రుచిర మంళ గళంబు
హామణి కుండలప్రభాపూ కలిత
చారు మృగరాజ సన్నిభ స్కంధ యుతము.

టీకా:

అళి = తుమ్మెదల; కుల = గుంపుతో; ఉపమ = పోల్చదగిన; లసత్ = మెరుస్తున్న; అలక = ముంగురులతో; శోభితము = శోభిల్లుతున్నది; అగు = అయిన; అమృతాంశురేఖా = వెన్నెలకిరణము {అమృతాంశుడు - అమృతము వంటి అంశ (వెన్నెల) కలవాడు, చంద్రుడు}; నిభ = వంటి; ఆననమున్ = ముఖము; = సమ = చక్కటి; కర్ణ = చెవుల; దివ్య = దివ్యమైన; భూష = భూషణముల; ప్రభా = కాంతులు; కలితంబున్ = కలిగినది; సుందర = అందమైన; భ్రూ = కనుబొమలు; నాస = ముక్కుతో; సు = మిక్కిలి; రుచిరంబున్ = తేజోవంతమైనది; సలలిత = అందముగల; కుంద = మల్లె; కుట్మల = అరవిరసిన (పరువానికి వచ్చిన) మొగ్గల; సన్నిభ = వంటి; ద్విజ = పళ్ళతో; పూరిత = నిండైన; స్నిగ్ద = నున్నటి; కపోల = బుగ్గల, చెక్కిళ్ళ; యుగ్మము = యుగళము; = పద్మ = పద్మముల; పలాశ = రేక వలె; శోభన = శోభకలిగిన; లోచనంబులును = కన్నులు; మందస్మిత = చిరునవ్వుతోకూడిన; అపాంగ = కడకంటిచూపుతో; సుందరమును = అందమైనది.
సస్మిత = చిరునవ్వుతోకూడిన; సంతత = ఎల్లప్పుడు; ఆలోక = చూపులతో; ప్రసన్న = ప్రసన్నమైన; ముఖమున్ = మోమును; కంబు = శంఖమువలె; సుందర = అందమైన; రుచిర = చక్కటి; మంగళ = శుభకరమైన; గళంబును = కంఠమును; హార = హారములు; మణి = మణులు పొదిగిన; కుండల = చెవికుండలముల; ప్రభా = కాంతులతో; పూర = నిండుదనము; కలిత = కలిగిన; చారు = అందమైన; మృగరాజ = సింహము {మృగరాజు - మృగములలో రాజువంటిది, సింహము}; సన్నిభ = వంటి; స్కంధ = భుజములు; యుతము = కలది.

భావము:

తుమ్మెదల గుంపువలె నీ తలవెంట్రుకలు నల్లగా శోభిస్తాయి. నీ ముఖం చంద్రునికి సాటి వస్తుంది. దివ్య భూషణాల కాంతులతో నీ చెవులు ప్రకాశిస్తాయి. నీ కనుబొమలు, ముక్కు మిక్కిలి సొగసైనవి. నీ దంతాలు మొల్ల మొగ్గల వలె తెల్లగా ఉంటాయి. నీ చెక్కిళ్ళు నిగ్గు దేరుతుంటాయి. నీ కన్నులు కలువరేకుల వలె ప్రకాశిస్తాయి. నీ కడకన్నులు చిరునవ్వులను చిందుతాయి. నీ ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో ప్రసన్నంగా ఉంటుంది. నీ కంఠం శంఖానికి సాటి. మణికుండలాల కాంతులతో నీ మేను జిగేలుమంటుంది. నీ నడుము సింహం నడుమువలె సన్నగా ఉంటుంది.