పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-714-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి నీ పాదమూలంబు లెవ్వఁడేని
బొంది ధన్యాత్ముఁడౌ నట్టి పుణ్యుఁ డొండు
నము లోపలఁ గోరునే ఱచియైన?
వ్యయానంద! గోవింద! రి! ముకుంద!

టీకా:

ఇట్టి = ఇటువంటి; నీ = నీ యొక్క; పాదమూలంబున్ = అరికాలును; ఎవ్వడు = ఎవరు; ఏని = అయితే; పొంది = ధ్యానించి; ధన్యాత్ముడు = ధన్యమైన ఆత్మ కలవాడు; ఔను = అగునో; అట్టి = అటువంటి; పుణ్యుడు = పుణ్యవంతుడు; ఒండు = మరింకొకటి; మనము = మనసు; లోపలన్ = లో; కోరునే = కోరునా ఏమి, కోరడు; మఱచి = మరచిపోయి; ఐనన్ = అయినా; అవ్యయానంద = విష్ణుమూర్తి {అవ్యయానందుడు - తరుగని ఆనంద స్వరూపుడు, విష్ణువు}; గోవింద = విష్ణుమూర్తి; హరి = విష్ణుమూర్తి; ముకుంద = విష్ణుమూర్తి.

భావము:

ఇటువంటి నీ పాదమూలాన్ని ఆశ్రయించిన పుణ్యాత్ముడు మరచిపోయి అయినా మనస్సులో మరొకటి కోరుకొనడు.