పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-723.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పురము నాత్మాంశమునఁ జెందు పురుషుఁ డింద్రి
ములచే విషయ సుఖము నుభవించు;
హిని మధుమక్షికాకృత ధువుఁ బోలి
తనిఁ బురవర్తి యగు జీవుఁ డండ్రు మఱియు.

టీకా:

చతురాత్మ = నేర్పరితనముగలవాడ; సత్త్వరజస్తమో గుణములు = త్రిగుణములు; వరుసన్ = వరుసగా; జనించెను = పుట్టెను; వాని = వాటి; వలనన్ = వలన; మహత్ = మహత్తు; అహంకార = అహంకారము; తన్మాత్ర = తన్మాత్రలు; నభస్ = ఆకాశము; మరుత్ = వాయువు; అనల = అగ్ని; జల = నీరు; అవని = భూమి; ముని = మునులు; సుపర్వ = దేవతలు; భూతగణ = జీవజాలము; ఆత్మక = కూడినట్లు; స్పురణన్ = అనిపించెడి; విశ్వంబున్ = భువనమును; భిన్న = వివిధ; రూపమునను = రూపములతో; ఉత్పన్నము = సృష్టింపబడునవి; అయ్యెన్ = అయ్యెను; దేవ = భగవంతుడ; ఈ = ఈ; గతిన్ = విధముగ; భవదీయ = నీ యొక్క; మాయను = మాయ; చేసి = వలన; రూఢిన్ = స్థిరముగా; చతుర్ = నాలుగు; విధరూపము = విధములు, వ్యూహములు; ఐన = అయిన.
పురమున్ = పురము అనెడి శరీరము; ఆత్మ = తన యొక్క; అంశమునన్ = అంశచేత; చెందు = చెందెడి; పురుషుండు = మానవుడు; ఇంద్రియముల్ = ఇంద్రియములు; చేన్ = చేత; విషయ = ఇంద్రియార్థములనెడి; సుఖముల్ = సుఖములను; అనుభవించున్ = అనుభవించును; మహిని = భూమిమీద; మధుమక్షికా = తేనెటీగచే; కృత = చేయబడిన; మధువున్ = తేనెను; పోలి = వలె; అతనిన్ = అతనిని; పురవర్తి = పురములోనుండెడివాడు; అగు = అయిన; జీవుడు = జీవుడు; అండ్రు = అంటారు; మఱియున్ = ఇంకను.

భావము:

(మాయాశక్తి చేత) సత్త్వ రజస్తమో గుణాలు వరుసగా జన్మించాయి. ఆ త్రిగుణాల వల్ల మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, ఋషులు, దేవతలు, భూతగణాలు మొదలైన విశ్వం పుట్టింది. ఈ విధంగా మాయచేత నీవు సృష్టించిన చతుర్విధ రూపమైన పురమనే దేహాన్ని ఆత్మాంశలో పురుషుడు ప్రవేశించి తేనెను త్రాగినట్లు ఇంద్రియాలతో విషయ సుఖాలను అనుభవిస్తాడు. అతనిని "పురమునందుండు జీవుడు" అని అంటారు.