పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అమృతగుళికలు : విద్రుమాలు


భాగవత పద్యవిద్రుమాలు

పద్య సూచిక;-
శ్రీకర! పరిశోషిత ; శ్రీకాంతాహృదయప్రియ! ; శ్రీ తరుణీ హృదయస్థిత! ; శ్రీపంబులు ; శ్రీమద్భక్త చకోరక ; శ్రీ మ ద్విఖ్యాతి లతాక్రామిత ; శ్రీమన్నామ! పయోదశ్యామ ; శ్రీ మరుదశనపతిశయన! ; శ్రీమహిత వినుత దివిజస్తోమ! ; శ్రీయుతమూర్తి! ; శ్రీరాజిత! మునిపూజిత! ; శ్రీ విలసితధరణీతనయా ; శ్రీ సీతాపతి! ; సంతస మింత లేదు ; సంపూర్ణ వృష్టిఁ ; సంసారజీమూత సంఘంబు విచ్చునే? ; సకలప్రాణిహృదంతరాళముల ; సకలార్థసంవేది ; సతి దన పతి యగు ; సప్తాబ్దంబుల బాలుఁడై ; సరసవచో విలాస! ; సరసహృదయవాసా! ; సరసిం బాసిన వేయు కాలువల ; సరసిజనిభ హస్తా! ;

up-arrow (1) 10.2-1-క.

శ్రీర! పరిశోషిత ర
త్నార! కమనీయగుణగణాకర! కారు
ణ్యార! భీకరశర ధా
రాకంపితదానవేంద్ర! రామనరేంద్రా!
భావము:- సంపదలను కలుగజేయు వాడా; సముద్రము ఇంకిపోవునట్లు చేసిన వాడా; మనోజ్ఞములైన గుణగణములకు నిధి వంటి వాడా; దయకి నిధి వంటి వాడా; రాక్షస ప్రభువులను భయంకరమైన బాణపరంపరలచే వణికింప జేసినవాడా; మహారాజా! శ్రీరామ!

up-arrow (2) 5.2-1-క.

శ్రీకాంతాహృదయప్రియ!
లోకాలోకప్రచార! లోకేశ్వర! సు
శ్లో! భవభయనివారక!
గోకులమందార! నందగోపకుమారా!
భావము:- లక్ష్మీదేవి తన మనస్సులో మెచ్చినవాడా! విశ్వం అంతటి యందు పేరెన్నిక గన్నవాడా! లోకాలన్నిటికి ప్రభువైనవాడా! మంచి కీర్తి కలవాడా! గోకులానికి కల్పవృక్షం వంటివాడా! నందగోపుని కుమారా! శ్రీకృష్ణా!.
ఈ స్కంధం గంగనార్యుల వారి కృతి. పోతన సంప్రదాయాన్ని అనుసరిస్తు చేసిన ఈ ద్వితీయాశ్వాస ప్రారంభ స్తోత్రంలో ‘లోకాలోకప్రచార ’ అనటంతో సందర్భ సార్థక్యం పాటించబడింది. అలా లోకాలను, అలోకాలను, లోకాలోక పర్వతాన్ని వివరించబడుతా యని సూచింపబడింది.

up-arrow (3) 5.2-166-క.

శ్రీ రుణీ హృదయస్థిత!
పాకహర! సర్వలోకపావన! భువనా
తీగుణాశ్రయ! యతి వి
ఖ్యా! సురార్చిత పదాబ్జ! కంసవిదారీ!
భావము:- లక్ష్మీదేవి హృదయంలో నిలుపుకున్నవాడా! పాపాలను హరించేవాడా! సర్వలోకాలను పవిత్రం చేసేవాడా! అలౌకిక గుణాలకు ఆశ్రయమైనవాడా! మిక్కిలి ప్రసిద్ధి పొందినవాడా! దేవతలచేత పూజింపబడే పాదపద్మాలు కలవాడా! కంసుని సంహరించినవాడా!

up-arrow (4) 1-446-క.

శ్రీపంబులు ఖండిత సం
తాపంబులు గల్మషాంధమస మహోద్య
ద్దీపంబులు పాషండ దు
రాపంబులు విష్ణు వందనాలాపంబుల్.
భావము:- ఆ నందనందమని వందనాలాపాలు, శ్రీలను చెందించేవి, సంతాపాలను సమూలంగా తొలగించేవి, ఉద్దీపితమైన దివ్వెలై పాపాలనే కటిక చీకట్లను పోగొట్టేవి, పాషండులు పొందలేనివి.
భాగవత భక్తిప్రపత్తుల విశిష్ఠతను ఇలా తలచుకుంటు, శుకుడు పరీక్షిత్తునకు చెప్పిన భాగవతాన్ని వివరించమని శౌనకాదులు సూతుని వేడుకుంటున్నారు

up-arrow (5) 2-1-క.

శ్రీద్భక్త చకోరక
సో! వివేకాభిరామ! సురవినుత గుణ
స్తో! నిరలంకృతాసుర
రామా సీమంతసీమ! రాఘవరామా!
భావము:- భక్తులు అనెడి చకోరక పక్షులకు చంద్రుని వంటివాడా! వివేకముతో విలసిల్లు వాడా! దేవతలచేత పొగడబడిన సుగుణములు గలవాడా! (రాక్షసులను సంహరించి) రాక్షస స్త్రీల పాపిట సింధూరాలంకరణలు తొలగించిన వాడ! రఘు వంశోద్భవుడవైన శ్రీరామచంద్రప్రభూ! అవధరింపుము.

up-arrow (6) 7-1-క.

శ్రీ ద్విఖ్యాతి లతా
క్రామిత రోదోంతరాళ! మనీయ మహా
జీమూత తులిత దేహ
శ్యాల రుచిజాల! రామచంద్రనృపాలా!
భావము:- చక్కటి కీర్తిలతలు లోకమంతా వ్యాపించిన వాడా! మనోహరమైన నీలి మేఘఛాయను పోలెడి మేను కలవాడా! శ్రీరామచంద్రమహారాజా! అవధరించు

up-arrow (7) 8-1-క.

శ్రీన్నామ! పయోద
శ్యా! ధరాభృల్లలామ! గదభిరామా!
రామాజనకామ! మహో
ద్ధా! గుణస్తోమధామ! శరథరామా!
భావము:- మంగళకర మైన పేరు కలవాడా! మేఘం వంటి కాంతివంత మైన దేహం కలవాడా! రాజులలో బహు గొప్పవాడా! ఆఖిల లోకాలలో అందమైన వాడా! స్త్రీలకు మన్మథుని వంటి వాడా! బహు గంభీరమైన వాడా! సుగుణాలనే సంపదలకు నిలయమైన వాడా! దశరథకుమారు డైన శ్రీరామచంద్రా! అవధరించు!

up-arrow (8) 12-1-క.

శ్రీ రుదశనపతిశయన!
కామితమునిరాజయోగిల్పద్రుమ! యు
ద్దా! ఘనజనకవరనృప
జామాతృవరేశ! రామచంద్రమహీశా!
భావము:- వాయుభక్షణంచేసే సర్పలకు అధిపతి అయిన ఆదిశేషునిపై శయనించేవాడా! కోరి ఆశ్రయించిన మునులకు, రాజులకు, యోగులకు కోరికలు తీర్చే కల్పవృక్షమా! మహోన్నతుడా! గొప్పవాడైన జనకమహారాజు అల్లుళ్ళలో కెల్లా మహా ప్రసిద్ధుడా! శ్రీరామచంద్రప్రభూ!

up-arrow (9) 3-1-క.

శ్రీహిత వినుత దివిజ
స్తో! యశస్సీమ! రాజసోమ! సుమేరు
స్థే! వినిర్జితభార్గవ
రా! దశాననవిరామ! ఘుకులరామా!
భావము:- శ్రీరామా! శ్రీకరమైన మహిమ కలవాడా! దేవతలుచే సంస్తుతింపబడు వాడా! దిగ్దిగంతాల వరకు వ్యాపించే యశస్సు కలవాడా! చంద్రుని వలె చల్లని పరిపాలన చేయువాడా! మేరునగ ధీరుడా! పరశురాము డంతటి వాని భంగపరచిన శూరుడా! పది తలల రావణాసురుని తుదముట్టించిన వీరాధివీరుడా! రఘువంశోద్ధారక రామా! . . . అవధరించు.

up-arrow (10) 10.1-1706-ఉ.

శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహముపాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున త్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ
ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ
డా ధమాధముం డెఱుఁగఁ ద్భుతమైన భవత్ప్రతాపమున్
భావము:- ఓ శుభాకారా! పురుషోత్తమ! శ్రీకృష్ణా! సింహానికి చెందవలసిన దానిని నక్క కోరినట్లు, గర్విష్ఠి ఐన శశిపాలుడు నీ పదభక్తురాలు ఐన రుక్మిణిని, నన్ను తీసుకుపోతాను అంటున్నాడు. అద్భుతమైన నీ మహిమ తెలియని పరమనీచుడు వాడు.

up-arrow (11) 9-1-క.

శ్రీరాజిత! మునిపూజిత!
వారిధి గర్వాతిరేక వారణ బాణా!
సూరిత్రాణ! మహోజ్జ్వల
సాయశస్సాంద్ర! రామచంద్ర నరేంద్రా!
భావము:- లక్ష్మిగలిగి ప్రకాశించే వాడా! మునులు పూజించు వాడా! సముద్రుడి గర్వం సర్వం పోగొట్టిన బాణం గల వాడా! పండితులను కాపాడే వాడా! బహు ప్రకాశవంతమైన గొప్పకీర్తి గల వాడా! శ్రీరామచంద్ర ప్రభూ! అవధరించు.

up-arrow (12) 4-1-క.

శ్రీ విలసితధరణీతన
యాదన సరోజ వాసరాధిప! సిత రా
జీదళనయన! నిఖిల ధ
రార నుత సుగుణధామ! రాఘవరామా!
భావము:- శ్రీమహాలక్ష్మీతేజోరూపి, ఓర్పుకు మారుపేరైన భూదేవి పుత్రిక అయిన సీతదేవి మోము అనే పద్మాన్ని ప్రకాశింపజేసే దినకరుని వంటి వాడు; తెల్ల తామర పూరేకుల వంటి కన్నులు గలవాడు; సమస్తమైన రాజులు అందరిచేత స్తుతింపబడే సుగుణాలతో అలరారేవాడు; అయినట్టి ఓ రఘువంశపు శ్రీరామ! నీకు వందనములు.

up-arrow (13) 11-1-క.

శ్రీ సీతాపతి! లంకే
శాసురసంహారచతుర! శాశ్వత! నుతవా
ణీత్యధిభూభవవృ
త్రాసురరిపుదేవజాల! రామనృపాలా!
భావము:- శ్రీరామచంద్రప్రభూ! శ్రీజానకీవల్లభా! రావణాసురుని సంహరించిన చతురుడా! శాశ్వతుడా! బ్రహ్మ ఈశ్వర ఇంద్రాది దేవతలచే పొగడబడువాడా! రామరాజా! అవధరింపుము.

up-arrow (14) 1-210-ఉ.

సంస మింత లేదుమృగశాపవశంబునఁ బాండు భూవిభుం
డంము నొందియుండ మిము ర్భకులం గొనివచ్చి కాంక్షతో
నింలవారిఁగాఁ బెనిచె నెన్నఁడు సౌఖ్యముపట్టు గాన దీ
గొంతి యనేక దుఃఖములఁ గుందుచు నుండునుభాగ్య మెట్టిదో?
భావము:- పాపం! మీ తల్లి కుంతీదేవికి ఏమాత్రం సంతోషం లేదు; పాండురాజు లేడిరూపంలో ఉన్న ముని శాపకారణంగా మరణించడంతో, పసికందులైన మిమ్మల్ని అరచేతిలో పెట్టుకొని పెంచుకొచ్చింది; ఇంతవాళ్ళని చేసింది; ఏ ఒక్కరోజూ సౌఖ్యమన్న మాట ఎరుగదు; ఈవిడ దురదృష్టం ఎలాంటిదో కానీ జీవితమంతా కష్టాలతోనే జీవితం గడిచింది.

up-arrow (15) 1-233-సీ.

సంపూర్ణ వృష్టిఁ బర్జన్యుండు గురియించు;
నిల యెల్లఁ గోర్కుల నీనుచుండు
గోవులు వర్షించు ఘోషభూములఁ బాలు;
లవంతములు లతాపాదపములు
పండు సస్యములు దప్పక ఋతువుల నెల్ల;
ర్మ మెల్లెడలను నరి యుండు
దైవభూతాత్మ తంత్రము లగు రోగాది;
యములు సెందవు ప్రజల కెందు
1-233.1-ఆ.
గురుకులోత్తముండు గుంతీతనూజుండు
దాన మానఘనుఁడు ర్మజుండు
త్యవాక్యధనుఁడు కలమహీరాజ్య
విభవభాజి యయిన వేళ యందు
భావము:- దానఘనుడు, మానధనుడు, సత్యధనుడు, సత్యసంధుడు, కురులాలంకారుడు, కుంతికుమారుడు ఐన ధర్మరాజు సమస్త భూమండలాన్ని వైభవోపేతంగా పరిపాలిస్తున్న సమయంలో మేఘుడు వానలు సమృద్ధిగా కురిపించాడు; పృథివి బంగారు పంటలు పండించింది; గోశాలలోని గోవులు కుండల కొద్దీ పాలిచ్చాయి; వృక్షాలూ, లతలూ సంపూర్ణంగా ఫలించాయి; ఋతుధర్మం తప్పకుండా నిండుగా పంటలు పండాయి; దేశమంతటా ధర్మం పాతుకున్నది; ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికాదులు అయిన తాపత్రయాలు, వ్యాధులు ప్రజలను బాధించలేదు.

up-arrow (16) 7-171-సీ.

సంసారజీమూత సంఘంబు విచ్చునే? ;
క్రిదాస్యప్రభంనము లేక;
తాపత్రయాభీల దావాగ్ను లాఱునే? ;
విష్ణుసేవామృతవృష్టి లేక;
ర్వంకషాఘౌఘ లరాసు లింకునే? ;
రిమనీషా బడబాగ్ని లేక;
నవిప ద్గాఢాంధకారంబు లడగునే? ;
ద్మాక్షునుతి రవిప్రభలు లేక;
7-171.1-తే.
నిరుపమాపునరావృత్తి నిష్కళంక
ముక్తినిధిఁ గానవచ్చునే? ముఖ్యమైన
శార్ఙ్గకోదండచింతనాంనము లేక
తామరసగర్భునకు నైన దానవేంద్ర!"
భావము:- రాక్షసేశ్వరా! పెద్ద గాలి ప్రభంజనంలా విసరక పోతే, గుంపులు కట్టిన కారు మబ్బులు విడిపోవు కదా. అలాగే చక్రధారి అయిన విష్ణుమూర్తి సేవ లేకుండా సంసార బంధాలు తొలగిపోవు. శ్రీహరి కైంకర్యం అనే అమృతపు వాన జల్లు కురవక పోతే, సంసారాటవిలో చెలరేగే తాపత్రయాలు అనే భయంకరమైన దావాగ్ని చల్లారదు. బడబాగ్ని ప్రజ్వల్లితే సముద్రాలు కూడా ఇంకిపోతాయి. అలాగే శ్రీపతి చింతన ఉత్తేజమైతే సముద్రం లాగ అంతటా ఒరుసుకుంటూ ఉండే పాపులన్నీ పటాపంచలైపోతాయి. సూర్యుని కిరణాలు తాకితే ఎంతటి చీకటి తెరలైనా విడిపోతాయి. అలాగే కేశవ కీర్తనతో ఎంతటి విపత్తులు చుట్టుముట్టినా విరిగిపోతాయి. మహా నిధులు గుప్తంగా ఉంటాయి. అంజనం ఉంటే వాటిని కనుగొనగలం. (శార్ఙ్గం అనే ఖడ్గం కోదండం అనే విల్లు ధరిస్తాడు విష్ణువు.) విష్ణుభక్తి అనే అంజనం ఉంటే కాని నిర్మలమైన, నిరుపమానమైన, పునర్జన్మ లేని ముక్తి అనే పెన్నిధి అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. నాన్నగారూ! ఆఖరుకి ఆ బహ్మదేవుడికి అయినా సరే ఇది తప్ప మార్గాంతరం లేదు.

up-arrow (17) 1-185-మ.

లప్రాణిహృదంతరాళముల భాస్వజ్జ్యోతియై యుండు సూ
క్ష్మళుం డచ్యుతుఁ డయ్యెడన్ విరటజా ర్భంబుఁ దాఁ జక్రహ
స్తకుఁడై వైష్ణవమాయఁ గప్పి కురు సంతానార్థియై యడ్డమై
ప్రటస్ఫూర్తి నడంచె ద్రోణతనయబ్రహ్మాస్త్రమున్ లీలతోన్.
భావము:- సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంతో సమస్త ప్రాణుల హృదయాంతరాళాల్లో జ్యోతిర్మూర్తియై ప్రకాశించే వాసుచేవుడు పాండవుల వంశాంకురాన్ని రక్షించటం కోసం చక్రాన్ని ధరించి, ఉత్తరాగర్భాన్ని యోగమాయతో కప్పివేసి, అమోఘమైన వైష్ణవ తేజస్సుతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అవలీలగా అణచివేశాడు.

up-arrow (18) 10.2-621-సీ.

లార్థసంవేది యొ యింటిలోపలఁ;
జెలితోడ ముచ్చటల్‌ సెప్పుచుండు
విపులయశోనిధి వేఱొక యింటిలో;
రసిజాననఁ గూడి రస మాడుఁ
బుండరీకదళాక్షుఁ డొండొక యింటిలోఁ;
రుణికి హారవల్లరులు గ్రుచ్చుఁ
రుణాపయోనిధి ఱియొక యింటిలోఁ;
జెలిఁ గూడి విడియము సేయుచుండు
10.2-621.1-ఆ.
విచకమలనయనుఁ డొయింటిలో నవ్వు
బ్రవిమలాత్ముఁ డొకటఁ బాడుచుండు
యోగిజనవిధేయుఁ డొకయింట సుఖగోష్ఠి
లుపు ననఘుఁ డొకటఁ జెలఁగుచుండు.
భావము:- శ్రీకృష్ణుడు తన ముద్దులసఖితో ఒక ఇంటిలో ముచ్చటలు ఆడుతున్నాడు; మరో ఇంటిలో మరొక ప్రియసఖితో సరసమాడుతున్నాడు; ఇంకో ఇంటిలో ఒక స్త్రీ రత్నం కోసం హారాలు గుచ్చుతున్నాడు; ఒక ఇంటిలో తన యువతితో కలిసి తాంబూలం సేవిస్తున్నాడు; ఒక ఇంటిలో నవ్వుతున్నాడు; ఒక ఇంటిలో పాడుతున్నాడు; ఒక ఇంటిలో సుఖగోష్టి చేస్తున్నాడు; ఒక ఇంటిలో ఆనందిస్తున్నాడు; ఈ మాదిరి అనేక రూపాలతో కనపడుతూ ఉన్న ఆ సకలార్థసంవేదిని, ఆ వికచకమల నయనుని, ఆ విమలాత్ముని, ఆ యోగిజన విధేయుని, ఆ శ్రీకృష్ణభగవానుడిని దర్శిస్తూ నారదుడు ముందుకు సాగిపోయాడు.

up-arrow (19) 4-59-క.

తి దన పతి యగు నా పశు
తిఁ జూచి సముత్సుకతను భాషించె;"ప్రజా
తి మీ మామ మఖము సు
వ్రమతి నొనరించుచున్న వాఁడఁట వింటే;
భావము:- అప్పుడు సతీదేవి అతిశయించిన కుతూహలంతో తన ప్రాణేశ్వరుడైన పరమేశ్వరునితో ఇలా అంటోంది “విన్నారా! మీ మావగారు దక్షప్రజాపతి దీక్షాపరుడై యజ్ఞం చేస్తున్నా డట!

up-arrow (20) 2-187-శా.

ప్తాబ్దంబుల బాలుఁడై నిజభుజాస్తంభంబునన్ లీలమై
ప్తాహంబులు శైలరాజము లసచ్ఛత్త్రంబుగాఁ దాల్చి, సం
గుప్తప్రాణులఁ జేసె మాధవుఁడు గోగోపాలకవ్రాతమున్
ప్తాంభోధి పరీతభూధరున కాశ్చర్యంబె చింతింపఁగన్.
భావము:- శ్రీకృష్ణుడు ఏడేళ్ళ బాలుడై ఉన్నా ఏడు రోజుల పాటు స్తంభాలలాంటి తన భుజాలపై అలవోకగా గోవర్థనగిరిని ఓ చక్కటి గొడుగులాగ ఎత్తి పట్టుకున్నాడు. గోవులను గోపాలకులను దాని మరుగున దాచి అందరి ప్రాణాలను రక్షించాడు. సప్తసముద్రాలతో చుట్టబడి ఉండే భూమి నంతటిని ధరించిన ఆ పరమపురుషునికి ఇది వింత పనేం కాదు.

up-arrow (21) 4-974-చ.

సవచో విలాస! గుణసాగర! సాగర మేఖలా మహీ
ణ ధురంధరప్రకట వ్య భుజాభుజగేంద్ర! రాజశే
! ఖర దూషణప్రముఖ గాఢ తమఃపటలప్రచండభా
స్క! కఱకంఠ కార్ముక విఖండన ఖేలన! భక్తపాలనా!
భావము:- రసవంతమైన వాగ్విలాసం కలవాడా! గుణసముద్రా! సముద్రం ఒడ్డాణంగా కల భూమి భారాన్ని మోయడంలో సమర్థమైన శేషుని వంటి భుజాలు గలవాడా! రాజ చూడామణీ! ఖర దూషణులు అనే గాఢాంధకారానికి ప్రచండ భాస్కరుడా! శివుని ధనువును విరిచినవాడా! భక్తులను పాలించేవాడా!

up-arrow (22) 5.1-183-మా.

సహృదయవాసా! చారులక్ష్మీవిలాసా!
రితశుభచరిత్రా! భాస్కరాబ్జారినేత్రా!
నిరుపమఘనగాత్రా! నిర్మలజ్ఞానపాత్రా!
గురుతరభవదూరా! గోపికాచిత్తచోరా!
భావము:- సరసుల హృదయాలలో నివసించేవాడా! అందమైన లక్ష్మీకళతో విలసిల్లేవాడా! గొప్ప శుభచరిత్ర కలవాడా! సూర్య చంద్రులు కన్నులుగా గలవాడా! సాటిలేని మేఘం వంటి శరీరం కలవాడా! స్వచ్ఛమైన జ్ఞానంతో ఒప్పేవాడా! గొప్ప సంసారభారాన్ని దూరం చేసేవాడా! గోపికల మనస్సులను దొంగిలించినవాడా! కృష్ణా!

up-arrow (23) 1-64-మ.

సిం బాసిన వేయు కాలువల యోజన్ విష్ణునం దైన శ్రీ
నానా ప్రకటావతారము లసంఖ్యాతంబు లుర్వీశులున్
సులున్ బ్రాహ్మణసంయమీంద్రులు మహర్షుల్ విష్ణునంశాంశజుల్
రి కృష్ణుండు బలానుజన్ముఁ డెడ లే; దా విష్ణుఁడౌ నేర్పడన్.
భావము:- ప్రపంచంలో సరస్సుల నుండి ఎన్నో కాలవలు వెలువడి ప్రవహిస్తూ ఉంటాయి; అలాగే శ్రీమన్నారాయణుని లోనుంచి విశ్వశ్రేయోదాయకములైన ఎన్నెన్నో అవతారాలు ప్రావిర్భవిస్తూ ఉంటాయి; రాజ్యాలేలేవాళ్ళు, దేవతలు, బ్రాహ్మణులు, బ్రహ్మర్షులు, మహర్షులు ఆ నారాయణుని సూక్ష్మ అంశలచే ఉద్భవించిన వారే; పూర్వం బలరామునిగా, అతని సోదరుడు శ్రీకృష్ణునిగా శ్రీమహావిష్ణువు తానే అవతరించాడు కదా.

up-arrow (24) 10.1-1791-మా.

సిజనిభ హస్తా! ర్వలోక ప్రశస్తా!
నిరుపమ శుభమూర్తీ! నిర్మలారూఢ కీర్తీ!
హృదయ విదారీ! క్తలోకోపకారీ!
గురు బుధజన తోషీ! ఘోరదైతేయ శోషీ!
భావము:- పద్మాల వంటి హస్తములు కలవాడా! ఎల్లలోకాలలోను శ్రేష్ఠతమమైన వాడా! సాటిలేని మంగళ స్వరూపము కలవాడా! స్వచ్ఛమైన వన్నెకెక్కిన కీర్తి కలవాడా! శత్రువుల గుండెలను ఖండించు వాడా! భక్త సమూహానికి మేలు చేయువాడా! పెద్దలను, పండితులను సంతోషపరచేవాడా! భయంకరులైన రక్కసులను నాశనము చేయువాడా! శ్రీరామచంద్రప్రభూ! వందనములు.