పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : పూర్ణి

  •  
  •  
  •  

5.2-166-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీ రుణీ హృదయస్థిత!
పాకహర! సర్వలోకపావన! భువనా
తీగుణాశ్రయ! యతి వి
ఖ్యా! సురార్చిత పదాబ్జ! కంసవిదారీ!

టీకా:

శ్రీతరుణీహృదయస్థిత = శ్రీకృష్ణా {శ్రీతరుణీ హృదయ స్థితుడు - శ్రీతరుణీ (లక్ష్మీదేవిని) హృదయమందు స్థితుడు (నిలుపుకున్నవాడు), కృష్ణుడు}; పాతకహర = శ్రీకృష్ణా {పాతక హరుడు - పాతక (పాపములను) హరుడు (హరించువాడు), కృష్ణుడు}; సర్వలోకపావన = శ్రీకృష్ణా {సర్వలోక పావనుడు - సర్వ (అఖిలమైన) లోకములను పావనుడు (పవిత్రుజేయువాడు), కృష్ణుడు}; భువనాతీతగుణాశ్రయ = శ్రీకృష్ణా {భువనాతీత గుణాశ్రయుడు - భువన (లోకములు అన్నిటికిని) అతీతమైన గుణములకు ఆశ్రయుడు (నిలయమైనవాడు), కృష్ణుడు}; అతివిఖ్యాతసురార్చితపదాబ్జ = శ్రీకృష్ణా {అతి విఖ్యాత సురార్చిత పదాబ్జ - అతి (మిక్కిలి) విఖ్యాత (ప్రసిద్దిచెందిన) సురా (దేవతలచే) అర్చిత (పూజింపబడెడి) పద (పాదములు యనెడి) అబ్జుడు (పద్మములు కలవాడు), కృష్ణుడు}; కంసవిదారీ = శ్రీకృష్ణా {కంస విదారి - కంసుని విదారి (సంహరించివాడు), కృష్ణుడు};

భావము:

లక్ష్మీదేవి హృదయంలో నిలుపుకున్నవాడా! పాపాలను హరించేవాడా! సర్వలోకాలను పవిత్రం చేసేవాడా! అలౌకిక గుణాలకు ఆశ్రయమైనవాడా! మిక్కిలి ప్రసిద్ధి పొందినవాడా! దేవతలచేత పూజింపబడే పాదపద్మాలు కలవాడా! కంసుని సంహరించినవాడా!