పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధరణీ ధర్మదేవత లుద్ధరణంబు

  •  
  •  
  •  

1-446-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీపంబులు, ఖండిత సం
తాపంబులు, గల్మషాంధమస మహోద్య
ద్దీపంబులు, పాషండ దు
రాపంబులు, విష్ణు వందనాలాపంబుల్.

టీకా:

శ్రీ = సంపదలను; పంబులు = అతిశయింప చేయునది; ఖండిత = బద్దలు చేయబడిన; సంతాపంబులు = వ్యధలు కలవి; కల్మష = పాపము అను; అంధతమస = కటిక చీకటికి {అంధము - అంధతరము - అంధతమము}; మహా = గొప్ప; ఉద్యత్ = పెద్దవి, పైకెత్త బడిన; దీపంబులు = దీపములు; పాషండ = పాషండులకు; దురాపంబులు = పొందవీలుకానివి; విష్ణు = విష్ణుదేవుని; వందన = నమస్కారములు; ఆలాపంబుల్ = స్మరణములు.

భావము:

ఆ నందనందమని వందనాలాపాలు, శ్రీలను చెందించేవి, సంతాపాలను సమూలంగా తొలగించేవి, ఉద్దీపితమైన దివ్వెలై పాపాలనే కటిక చీకట్లను పోగొట్టేవి, పాషండులు పొందలేనివి.
భాగవత భక్తిప్రపత్తుల విశిష్ఠతను ఇలా తలచుకుంటు, శుకుడు పరీక్షిత్తునకు చెప్పిన భాగవతాన్ని వివరించమని శౌనకాదులు సూతుని వేడుకుంటున్నారు