పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ఉపోద్ఘాతము

  •  
  •  
  •  

4-1-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

SitraRamulu - ^

శ్రీ విలసితధరణీతన
యాదన సరోజ వాసరాధిప! సిత రా
జీదళనయన! నిఖిల ధ
రార నుత సుగుణధామ! రాఘవరామా!

టీకా:

శ్రీవిలసితధరణీతనయావదనసరోజవాసరాధిప = శ్రీరామ {శ్రీవిలసిత ధరణీ తనయా వదనసరోజ వాసరాధిప - శ్రీ (లక్ష్మీదేవివలె, శుభకరమైన) విలసిత (ప్రకాశముగల) ధరణీ (భూదేవి యొక్క) తనయా (పుత్రిక, సీతాదేవి) వదన (మోము అనెడి) సరోజ (పద్మమునకు) వాసరాధిప (వాసరములకు (పగళ్ళకు) అధిపతి, సూర్యుడా), శ్రీరామ}; సితరాజీవదళనయన = శ్రీరామ {సితరాజీవ దళ నయన - సిత (తెల్లని) రాజీవ (తామరపువ్వు) దళ (రేకుల) వంటి నయన (కన్నులు గల వాడు), శ్రీరామ}; నిఖిల ధరావర నుత సుగుణధామ = శ్రీరామ {నిఖిల ధరావర నుత సుగుణధామ - నిఖిల (సమస్తమైన) ధరావర (రాజుల) చేత నుత (స్తోత్రము చేయబడిన) గుణములకు ధామ (నిలయ మైనవాడ), శ్రీరామ}; రాఘవరామా = శ్రీరామ {రాఘవరామా - రాఘవ (రఘు వంశమునకు చెందిన) రామ, శ్రీరామ}.

భావము:

శ్రీమహాలక్ష్మీతేజోరూపి, ఓర్పుకు మారుపేరైన భూదేవి పుత్రిక అయిన సీతదేవి మోము అనే పద్మాన్ని ప్రకాశింపజేసే దినకరుని వంటి వాడు; తెల్ల తామర పూరేకుల వంటి కన్నులు గలవాడు; సమస్తమైన రాజులు అందరిచేత స్తుతింపబడే సుగుణాలతో అలరారేవాడు; అయినట్టి ఓ రఘువంశపు శ్రీరామ! నీకు వందనములు.