పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధర్మనందన రాజ్యాభిషేకంబు

  •  
  •  
  •  

1-233-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సంపూర్ణ వృష్టిఁ బర్జన్యుండు గురియించు,-
నిల యెల్లఁ గోర్కుల నీనుచుండు,
గోవులు వర్షించు ఘోషభూములఁ బాలు,-
లవంతములు లతాపాదపములు,
పండు సస్యములు దప్పక ఋతువుల నెల్ల,-
ర్మ మెల్లెడలనుఁ నరి యుండు,
దైవభూతాత్మ తంత్రము లగు రోగాది-
యములు సెందవు ప్రజల కెందుఁ,

1-233.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గురుకులోత్తముండు గుంతీతనూజుండు
దాన మానఘనుఁడు ర్మజుండు
త్యవాక్యధనుఁడు కలమహీరాజ్య
విభవభాజి యయిన వేళ యందు

టీకా:

సంపూర్ణ = సంపూర్ణమైన; వృష్టిన్ = వర్షమును; పర్జన్యుండు = మేఘుడు {పర్జన్యుడు - ఉరిమెడువాడు, మేఘుడు}; కురియించు = కురిపించును; ఇల = భూమి; ఎల్లన్ = సమస్తమైన; కోర్కులన్ = కోరికలను; ఈనుచుండున్ = పుట్టించును; గోవులు = ఆవులు; వర్షించున్ = ఎక్కువగా ఇచ్చును; ఘోషభూములన్ = గొల్లపల్లెలలో; పాలు = పాలు; ఫల = ఫలములతో; వంతములున్ = నిండి ఉండును; లతా = తీగలు; పాదపములు = చెట్లు; పండు = పండును; సస్యములున్ = ధాన్యములు; తప్పక = తప్పకుండగ; ఋతువులన్ = ఋతువులలో; ఎల్లన్ = సమస్తమును; ధర్మము = ధర్మవర్తనము; ఎల్ల = సమస్త; ఎడలను = స్థలములందును; తనరి = విస్తరించి; ఉండున్ = ఉండును; దైవ = దేవతలు; భూత = భూతములు; ఆత్మ = ఆత్మలు; తంత్రములు = హేతు భూతములు; అగు = అయినట్టి; రోగ = రోగములు; ఆది = మొదలగు; భయములు = భయములు; చెందవు = కలుగవు; ప్రజలు = లోకులు; కున్ = కు; ఎందున్ = ఎక్కడాకూడ; కురు = కురు; కుల = వంశములో; ఉత్తముండు = ఉత్తముడు; కుంతీ = కుంతియొక్క; తనూజుండు = పుత్రుడు;
దాన = దానమునందును; మాన = మానమునందును; ఘనుఁడు = గొప్పవాడు; ధర్మజుండు = ధర్మరాజు; సత్య = సత్యమైన; వాక్య = వాక్కు; ధనుఁడు = ధనముగాగలవాడు; సకల = సమస్త; మహీ = భూమియందలి; రాజ్య = రాజ్యములలోను; విభవ = (తన) వైభవము; భాజి = భజింపబడువాడు; అయిన = అయినట్టి; వేళ = సమయము; అందున్ = లో;

భావము:

దానఘనుడు, మానధనుడు, సత్యధనుడు, సత్యసంధుడు, కురుకులాలంకారుడు, కుంతికుమారుడు ఐన ధర్మరాజు సమస్త భూమండలాన్ని వైభవోపేతంగా పరిపాలిస్తున్న సమయంలో మేఘుడు వానలు సమృద్ధిగా కురిపించాడు; పృథివి బంగారు పంటలు పండించి, కోరిన కోర్కెలు తీర్చింది; గోశాలలోని గోవులు పాలను వర్షించాయి; వృక్షాలూ, లతలూ సంపూర్ణంగా ఫలించాయి; ఋతుధర్మం తప్పకుండా నిండుగా పంటలు పండాయి; దేశమంతటా ధర్మం పాతుకున్నది; ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికాదులు అయిన తాపత్రయాలు, వ్యాధులు ప్రజలను బాధించలేదు.