పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట

  •  
  •  
  •  

4-59-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తి దన పతి యగు నా పశు
తిఁ జూచి సముత్సుకతను భాషించె;"ప్రజా
తి మీ మామ మఖము సు
వ్రమతి నొనరించుచున్న వాఁడఁట వింటే;

టీకా:

సతి = సతీదేవి; తన = తన యొక్క; పతి = భర్త; అగు = అయిన; ఆ = ఆ; పశుపతిన్ = శివుని {పశుపతి - పాశములచే బంధించబడిన సకల జీవులను పాలించు అధిపతి, శివుడు}; చూచి = చూసి; సముత్సకతను = మంచి; ఉత్సుకతనున్ = ఉత్సాహముతో; భాషించెన్ = మాట్లాడెను; ప్రజాపతి = ప్రజాపతి; మీ = మీ యొక్క; మామ = మావగారు; మఖమున్ = యాగమును; సువ్రత = బాగుగా చేయు; మతిన్ = ఉద్దేశ్యముతో; ఒనరించుచున్ = చేస్తూ; ఉన్నవాడట = ఉన్నాడట; వింటే = విన్నావా.

భావము:

అప్పుడు సతీదేవి అతిశయించిన కుతూహలంతో తన ప్రాణేశ్వరుడైన పరమేశ్వరునితో ఇలా అంటోంది “విన్నారా! మీ మావగారు దక్షప్రజాపతి దీక్షాపరుడై యజ్ఞం చేస్తున్నా డట!