పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : ఉపోద్ఘాతము

  •  
  •  
  •  

11-1-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

SitraRamulu - ^

శ్రీ సీతాపతి! లంకే
శాసురసంహారచతుర! శాశ్వత! నుతవా
ణీత్యధిభూభవవృ
త్రాసురరిపుదేవజాల! రామనృపాలా!

టీకా:

శ్రీ = శోభనకరమైన; సీతాపతి = రామా {సీతాపతి - జానకీ వల్లభుడు, రాముడు}; లంకేశాసురసంహారచతుర = రామా {లంకేశాసురసంహారచతురుడు - లంకేశ్వరుని (రావణాసురుని) సంహరించుటలో చతురుడు, రాముడు}; శాశ్వత = రామా {శాశ్వతుడు - శాశ్వతముగానుండు వాడు, రాముడు}; నుతవాణీసత్యధిభూభవవృత్రాసురరిపుదేవజాల = రామా {నుతవాణీసత్యధిభూభవవృత్రాసురరిపుదేవజాల -నుత (పొగడబడుతున్న వాణీసత్యధిభూ (బ్రహ్మ) భవ (మహేశ్వరుడు) వృత్రాసురరిపు (ఇంద్రుడు) దేవజాల (మున్నగుదేవతల సమూహము) కలవాడు, రాముడు}; రామనృపాలా = రామా {రామనృపాలుడు - రాముడు అను రాజు}.

భావము:

శ్రీరామచంద్రప్రభూ! శ్రీజానకీవల్లభా! రావణాసురుని సంహరించిన చతురుడా! శాశ్వతుడా! బ్రహ్మ ఈశ్వర ఇంద్రాది దేవతలచే పొగడబడువాడా! రామరాజా! అవధరింపుము.