పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : ఉపోద్ఘాతము

  •  
  •  
  •  

12-1-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

SitraRamulu - ^

శ్రీ రుదశనపతిశయన!
కామితమునిరాజయోగిల్పద్రుమ! యు
ద్దా! ఘనజనకవరనృప
జామాతృవరేశ! రామచంద్రమహీశా!

టీకా:

శ్రీ = శోభనకరమైన; మరుదశనపతిశయన = రామ {మరు దశన పతి శయనుడు -మరుత్ (గాలిని) అశన (భక్షణముచేసెడి వారి - సర్పముల) పతి (ప్రభువైన ఆదిశేషుని పైన) శయనుడు (పరుండువాడు), విష్ణువు}; కామితమునిరాజయోగికల్పద్రుమ = రామ {కామిత ముని రాజ యోగి కల్పద్రుముడు - కామిత (కోరి ఆశ్రయించిన) ముని (ఋషులకు) రాజ (రాజులకు) యోగి (యోగులకు) కల్పద్రుముడు (కల్పవృక్షము వంటివాడు), విష్ణువు}; ఉద్దామ = రామ {ఉద్దాముడు - స్వతంత్రుడు, విష్ణువు}; ఘనజనకవరనృప = రామ {ఘన జనక వరనృప జామాతృ వరేశుడు - ఘన (గొప్ప) జనకవరనృప (జనకమహారాజు యొక్క) జామాతృ (అల్లుళ్ళలో) వరేశ (ఘనత వహించినవాడు), రాముడు}; రామచంద్రమహీశా = రామ {రామచంద్ర మహీశుడు - రామచంద్రుడనెడి మహీశుడు (భూమికి ప్రభువు, రాజు), రాముడు}.

భావము:

వాయుభక్షణంచేసే సర్పలకు అధిపతి అయిన ఆదిశేషునిపై శయనించేవాడా! కోరి ఆశ్రయించిన మునులకు, రాజులకు, యోగులకు కోరికలు తీర్చే కల్పవృక్షమా! మహోన్నతుడా! గొప్పవాడైన జనకమహారాజు అల్లుళ్ళలో కెల్లా మహా ప్రసిద్ధుడా! శ్రీరామచంద్రప్రభూ!