పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : బ్రహ్మకృత గర్భస్థ వామన స్తోత్రం (ఆపద విమోచనము)

  1
"దేవ! జితం జితంతే పరమేశ్వర!-
సియజ్ఞభావన! శ్రుతిశరీర!
కారణసూకరాకారుండ వగు నీకు-
తిభక్తి మ్రొక్కెద య్య వరద!
వదీయ రోమకూము లందు లీనంబు-
లై యుండు నంబుధుఁ ట్టి యధ్వ
రాత్మక మై తనరారు నీ రూపంబు-
గానంగరాదు దుష్కర్మపరుల

  2
ట్టి నీకుఁబ్రణామంబు లాచరింతు
ఖిలజగదేకకీర్తి! దయానువర్తి!
వ్యచారిత్ర! పంకజత్రనేత్ర!
చిరశుభాకార! యిందిరాచిత్తచోర!"

  3
అని వెండియు నిట్లు స్తుతియించిరి.

  4
"త్వక్కున నఖిల వేములు రోమంబుల-
యందును బర్హిస్సు క్షు లందు
నాజ్యంబు పాదంబు లందుఁ జాతుర్హోత్ర-
లితంబు లగు యజ్ఞర్మములును
స్రుక్కు తుండంబున స్రువము నాసికను ని-
డాపాత్ర ముదరకోరము నందుఁ
శ్రవణాస్య బిలములఁ మస ప్రాశిత్రముల్-
ళమున నిష్ఠిత్రికంబు జిహ్వఁ

  5
గుఁ బ్రవర్గ్యము నగ్నిహోత్రములు నీదు
ర్వణంబును సభ్యావధ్యు లుత్త
మాంగ మసువులు చయనము గుఁ గిటీశ!"
నుచు నుతియించి రత్తఱి జ్ఞవిభుని.

  6
వెండియు "ముహుర్ముహుర్భవ దావిర్భావంబు దీక్షణీయేష్టి యగు; నీదు దంష్ట్రలు ప్రాయణీయం బను దీక్షానంతరేష్టియు, నుదయనీయం బను సమాప్తేష్టియు, యుష్మద్రేతంబు సోమంబును, ద్వదీయావస్థానంబు ప్రాతస్సవనాదులు; నీదు త్వజ్మాంసాది సప్తధాతువు లగ్నిష్ఠోమాత్యగ్నిష్ఠోమోక్థ్యషోడశీ వాజపేయాతిరాత్రాప్తోర్యామంబు లను సంస్థాభేదంబులును, ద్వాదశాహాదిరూపంబులైన బహు యాగ సంఘాత రూపంబులు నగు; సర్వసత్త్రంబులు భవదీయ శరీరసంధులు; ససోమాసోమంబు లగు యజ్ఞక్రతువులు నీవ; మఱియును నీవు యజనబంధనంబులచే నొప్పుచుందువు; అదియునుం గాక.

  7
రూపివి హవనేతవు
భోక్తవు నిఖిలహవఫలాధారుఁడవున్
రక్షకుఁడవు నగు నీ
వితథముగ నుతులొనర్తు య్య; ముకుందా!

  8
త్త్వగుణమున సద్భక్తి సంభవించు
క్తియుతముగఁ జిత్తంబు వ్య మగును
హృదయపద్మంబునం దోలి నెఱుఁగఁబడిన
ట్టి నీకు నమస్కారయ్య; వరద!

  9
విందోదర తావకీనసితదంష్ట్రాగ్రావ లగ్నక్షమా
నద్యబ్ధినదాటవీయుత సమిద్ధక్ష్మాతలంబొప్పె భా
సుకాసారజలావతీర్ణమదవచ్ఛుండాలరాడ్దంతశే
సంసక్త వినీలపంకజమురేఖంబొల్పు దీపింపఁగన్

  10
మఱియును.

  11
తురామ్నాయ వపుర్విశేష ధర! చంత్సూకరాకార! నీ
సి దంష్ట్రాగ్ర విలగ్నమై ధరణి రాజిల్లెం గులాద్రీంద్ర రా
శృంగోపరిలగ్న మేఘము గతిం జాలం దగెన్ సజ్జనాం
చి హృత్పల్వలలోల! భూరమణ! లక్ష్మీనాథ! దేవోత్తమా!

  12
మధిక స్థావర జంగమాత్మక మైన-
సుమతీచక్ర మక్ర లీల
నుద్ధరించితి కరుణోపేత చిత్తుండ-
గుచు నస్మన్మాత య్యె ధరణి
మాత యౌటెట్లని దిఁ దలంచెద వేనిఁ-
ర్చింప మాకు విశ్వమున కీవు
నకుఁడ వగుట యుష్మత్పత్ని భూదేవి-
గుటఁ మాకును దల్లి య్యె నిపుడు

  13
రకు నీతోడఁ గూడ వంన మొనర్తు
రణి యందును యాజ్ఞికుఁ గ్ని నిలుపు
రణి నీ తేజమీ ధరాకాంత యందు
నిలుప ధరణి పవిత్రయై నెగడుఁ గాన.


3-432/1-వ. అదియునుం గాక. - తంజనగరము - తేవప్పెరుమాల్లయ్య వారి ప్రతి

  14
లఁప రసాతలాంతరగక్షితిఁ గ్రమ్మఱ నిల్పినట్టి నీ
లితన మెన్న విస్మయము గాదు సమస్త జగత్తు లోలి మై
లుగఁగఁ జేయు టద్భుతము గాక మహోన్నతి నీ వొనర్చు పెం
రిన కార్యముల్ నడప న్యులకుం దరమే? రమేశ్వరా!

  15
ల జగన్నియామక విక్షణలీలఁ దనర్చు నట్టి నం
ధర! తావకస్ఫుర దుదారత మంత్రసమర్థుఁ డైన యా
జ్ఞికుఁ డరణిన్ హుతాశనుని నిల్పిన కైవడి మన్నివాస మౌ
కుఁ దలపోసి యా క్షితిఁ దృఢంబుగ నిల్పితి వయ్య; యీశ్వరా!

  16
లిత వేదశాస్త్రమయ సౌకరమూర్తిఁ దనర్చుచున్ రసా
మున నుండి వెల్వడు నుదారత మేను విదుర్పఁ దత్సటో
చ్ఛలితము లైన బిందువుల సాధు తపోజన సత్యలోక వా
సు మగు మేము దోఁగి పరిశుద్ధి వహించితి మయ్య; మాధవా!

  17
విశ్వభవస్థితిప్రళయ వేళల యందు వికారసత్త్వమున్
విశ్వము నీవ యై నిఖిల విశ్వము లోలి సృజింతు విందిరా
ధీశ్వర! యీశ! కేశవ! త్రయీమయ! దివ్యశరీర! దేవ! నీ
శాశ్వతలీల లిట్టి వని న్నుతిసేయఁగ మాకు శక్యమే?

  18
పంకజోదర! నీ వపారకర్ముండవు-
వదీయకర్మాభ్ది పార మరయ
నెఱిఁగెద నని మది నిచ్చగించిన వాఁడు-
రికింపఁగా మతిభ్రష్టు గాఁక
విజ్ఞానియే చూడ విశ్వంబు నీ యోగ-
మాయాపయోనిధి గ్న మౌటఁ
దెలిసియుఁ దమ బుద్ధిఁ దెలియని మూఢుల-
నే మన నఖిలలోకేశ్వరేశ!

  19
దాసజనకోటి కతిసౌఖ్యదాయకములు
వితత కరుణాసుధాతరంగితము లైన
నీ కటాక్షేక్షణములచే నెఱయ మమ్ముఁ
జూచి సుఖులను జేయవో సుభగచరిత!"

  20
ని బ్రహ్మవాదు లగు స
న్మునివర్యులు భక్తియోగమున వినమితులై
మున మోదము ముప్పిరి
గొనఁ బొగడిరి ఖురవిదళితగోత్రిం బోత్రిన్.

  21
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత తృతీయ స్కంధ అంతర్గత బ్రహ్మకృత గర్భస్థ వామన స్తోత్రం (ఆపద విమోచనము)