పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విధాత వరాహస్తుతి

  •  
  •  
  •  

3-432.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రకు నీతోడఁ గూడ వంన మొనర్తు
రణి యందును యాజ్ఞికుఁ గ్ని నిలుపు
రణి నీ తేజమీ ధరాకాంత యందు
నిలుప ధరణి పవిత్రయై నెగడుఁ గాన.


[3-432/1-వ. అదియునుం గాక. - తంజనగరము - తేవప్పెరుమాల్లయ్య వారి ప్రతి]

టీకా:

సమధిక = మిక్కిలి ఎక్కువైన; స్థావర = స్థావరములు, వృక్షాదులు {స్థావరములు - ఉన్న స్థానము నుండి కదలలేనివి, చెట్లు మొదలగునవి}; జంగమ = జంగమములు, జంత్వాదులు {జంగమములు - ఉన్న స్థానముల నుండి కదల గలవి, జంతువులు, మానవులు మొదలగునవి}; ఆత్మకము = తో కూడినది; ఐన = అయినట్టి; వసుమతీ = భూ; చక్రమున్ = మండలమును; అవక్ర = సాటిలేని; లీలన్ = విధముగా; ఉద్ధరించితి = ఉద్ధరించితివి; కరుణా = దయతో; ఉపేత = కూడిన; చిత్తుండవు = మనస్సుకలవాడవు; అగుచున్ = అవుతూ; అస్మత్ = మా యొక్క; మాత = తల్లి; అయ్యెన్ = అయ్యెను; ధరణి = భూదేవి; మాత = మాతల్లి; ఔటన్ = అగుట; ఎట్లు = ఏవిధముగ; అని = అని; మదిన్ = మనసులో; తలంచెదవు = అనకొంటివి; ఏని = అయితే; చర్చింపన్ = విశ్లేషింపగా; మాకున్ = మాకు; విశ్వమున్ = భువనముల; కున్ = కి; ఈవున్ = నీవు; జనకుడవు = తండ్రివి; అగుటన్ = అగుటచేత; ఉష్మత్ = నీ యొక్క; పత్ని = భార్య; భూదేవి = భూదేవి; అగుటన్ = అగుటచేత; మాకునున్ = మాకును; తల్లి = తల్లి; అయ్యెన్ = ఆయెను; ఇపుడున్ = ఇప్పుడు;
ధరన్ = భూదేవి; కున్ = కి; నీ = నీ; తోడన్ = తో; కూడన్ = కూడా; వందనమున్ = నమస్కారములు; ఒనర్తుము = చేసెదము; అరణి = నిప్పు రగుల్చు సాధనము; అందునున్ = లోపల; యాజ్ఞికుడు = యజ్ఞముచేయువాడు; అగ్నిన్ = నిప్పును; నిలుపు = రగిల్చు; కరణిన్ = విధముగా; నీ = నీ యొక్క; తేజమున్ = తేజస్సును; ఈ = ఈ; ధర = భూ; కాంత = దేవి; అందున్ = అందు; నిలుపన్ = నిలుపుట వలన; ధరణిన్ = భూదేవి; పవిత్ర = పవిత్రమైనది; ఐ = అయ్యి; నెగడున్ = వర్థిల్లును; కాన = కావున.

భావము:

కరుణ నిండిన హృదయం కలవాడవై, సకల చరాచర సమూహంతో నిండిన ఈ భూమండలాన్ని సముద్రజలాల్లో మునిగిపోకుండా కాపాడు. ఈ భూమి మాకు తల్లి. ఎలాగంటావేమో, మాకు ఈ లోకానికి తండ్రివి. నీవు భరించుటచే భూదేవి నీ భార్య అయింది. అందుకని ఆమె మాకు తల్లి అవుతుంది. నీతోపాటు, ఈ భూమికి నమస్కారం చేస్తాము. యజ్ఞకర్త అరణి యందు అగ్నిని నిల్పిన విధంగా నీవు నీ తేజస్సును ఈ భూమి యందు నిల్పడం వల్ల ఈ ధరిత్రి పవిత్రమై ఒప్పుతూ ఉంది.