పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విధాత వరాహస్తుతి

  •  
  •  
  •  

3-425-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"త్వక్కున నఖిల వేములు రోమంబుల-
యందును బర్హిస్సు క్షు లందు
నాజ్యంబు పాదంబు లందుఁ జాతుర్హోత్ర-
లితంబు లగు యజ్ఞర్మములును
స్రుక్కు తుండంబున స్రువము నాసికను ని-
డాపాత్ర ముదరకోరము నందుఁ
శ్రవణాస్య బిలములఁ మస ప్రాశిత్రముల్-
ళమున నిష్ఠిత్రికంబు జిహ్వఁ

3-425.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గుఁ బ్రవర్గ్యము నగ్నిహోత్రములు నీదు
ర్వణంబును సభ్యావధ్యు లుత్త
మాంగ మసువులు చయనము గుఁ గిటీశ!"
నుచు నుతియించి రత్తఱి జ్ఞవిభుని.

టీకా:

త్వక్కునన్ = చర్మమునందు; అఖిల = సమస్తమైన; వేదములున్ = వేదమములును; రోమంబులన్ = వెంట్రుకల; అందున్ = అందు; బర్హిస్సున్ = దర్భలును; అక్షుల = కన్నుల; అందున్ = అందు; ఆజ్యంబున్ = నెయ్యి (హోమము చేయు); పాదంబులన్ = కాళ్ళ; అందున్ = అందు; చాతుర్ = నలుగురు (4); హోత్ర = ఋత్విక్కులచే; కలితంబులు = చేయబడునవి; అగు = అయిన; యజ్ఞ = యాగములను; కర్మములును = చేయుటలును; స్రుక్కున్ = స్రుక్కనేతెడ్డు {స్రుక్కు - హోమము కొరకు నేతిని తీయు తెడ్డు, గరిటి}; తుండంబునన్ = తొండమునందును; స్రువమున్ = స్రువనే తెడ్డు {స్రువము - హోమము చేయునప్పుడు నేతిని అగ్నిలో వేయుటకైన తెడ్డు, గరిటి}; నాసికను = ముక్కుయును; ఇడాపాత్రము = పిండివంటలకైన (భక్షణ) యజ్ఞపాత్ర, హవిస్సున్న పాత్ర; ఉదర = గర్భ; కోటరమున్ = ఆశయము; అందున్ = అందులో; శ్రవణ = చెవుల; అస్య = నోటి; బిలములన్ = రంధ్రములందు; చమస = చతురస్రముగ ఉండు యజ్ఞపాత్రలు; ప్రాశిత్రముల్ = బ్రహ్మ భాగ పాత్ర, తాగు యజ్ఞ పాత్రలు; గళమునన్ = గొంతునందు; ఇష్టిత్రికంబున్ = త్రికాలములను చేయబడు ఇష్టులు (చిన్ని యాగములు); జిహ్వన్ = నాలుక యందు; తగున్ = తగినది; ప్రవర్గ్యమున్ = మహావీతము అను యజ్ఞకార్యము {ప్రవర్గ్యము - మహావీతము - అగ్నిష్ఠోమాది యాగములకు విభాగములలో ఒకరకమైన యాగము}; అగ్నిహోత్రము = అగ్నిహోత్రము;
నీదు = నీ యొక్క; చర్వణంబునున్ = భక్షణము, నమలుట; సభ్య = హోమములేని అగ్నిహోత్రము; అపధ్యులున్ = హోమముచేయు (ఔపోసన) అగ్నిహోత్రము; ఉత్తమాంగము = తల; అసువులు = పంచప్రాణములు {అసువులు - పంచప్రాణములు - 1 ప్రాణము 2 అపానము 3 న్యాసము 4 ఉదానము 5 సాన వాయువులు}; చయనములున్ = ఇటుకలు పేర్చు యజ్ఞములు; అగున్ = అగును; కిటీశ = భగవంతుడా {కిటీశుడు - కిటి (వరాహము, పంది) రూపమున ఉన్న ఈశుడు (ప్రభువు), విష్ణువు}; అనుచున్ = అంటూ; నుతియించిరి = స్తుతించిరి; ఆ = ఆ; తఱిన్ = సమయమున; యజ్ఞవిభుని = భగవంతుని {యజ్ఞవిభుడు - యజ్ఞములకు ప్రభువు, విష్ణువు}.

భావము:

ఓ స్వామీ! నీ చర్మం నుండి, సమస్త వేదాలూ జనించాయి; నీ రోమకూపాల నుండి అగ్నులు ఆవిర్భవించాయి; నీ కన్నులనుండి హోమ ద్రవ్యమైన నెయ్యి, నీ నాలుగు పాదాలనుండి నాలుగు హోతలతో కూడిన యజ్ఞ కర్మలూ, మజ్జనుండి స్రుక్కూ, ముక్కునుండి సృవమూ, ఉదరమునుండి ఇడాపాత్రమూ, చెవులనుండి, ముఖంనుండి చమసం, ప్రాశిత్రం అనే పాత్రలూ, కంఠం నుండి ఇష్టులు అనే మూడు యజ్ఞాలూ, నాలుక నుండి, ప్రవర్గ్యం అనే యజ్ఞం పుట్టాయి; నీ చర్వణమే అగ్నిహోత్రం; సధ్యం అంటే హోమరహితాగ్ని, అపసథ్యం అంటే ఔపోసనాగ్ని నీ శరస్సు నుంచి జనించాయి; చయనాలు నీ ప్రాణ స్వరూపాలు; నీవు యజ్ఞాధికారుడవు; యజ్ఞవరాహమూర్తివి.