పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విధాత వరాహస్తుతి

  •  
  •  
  •  

3-434-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల జగన్నియామక విక్షణలీలఁ దనర్చు నట్టి నం
ధర! తావకస్ఫుర దుదారత మంత్రసమర్థుఁ డైన యా
జ్ఞికుఁ డరణిన్ హుతాశనుని నిల్పిన కైవడి మన్నివాస మౌ
కుఁ దలపోసి యా క్షితిఁ దృఢంబుగ నిల్పితి వయ్య; యీశ్వరా!

టీకా:

సకల = సమస్తమైన; జగత్ = భువనములను; నియామక = నియమించుట యందలి; విచక్షణ = వివేకము యొక్క; లీలన్ = లీలతో; తనర్చుని = విలసిల్ల చేసేటి; అట్టి = అటువంటి; నందకధర = విష్ణుమూర్తి {నందకధరుడు - నందకము అను కత్తిని ధరించువాడు, విష్ణువు}; తావక = నీ యొక్క; స్ఫురత్ = వ్యక్తమగు; ఉదారత = గొప్పతనముతో; మంత్ర = మంత్రశక్తి కలిగిన; సమర్థుడు = సామర్థ్యము కలవాడు; ఐన = అయిన; యాజ్ఞికుడు = యజ్ఞము చేయు వాడు; అరణిన్ = అరణిలో {అరణి - కఱ్ఱపుల్లతో మధించుట ద్వారా అగ్నిని రగుల్చుటకైన సాధనము}; హుతాశనుని = అగ్నిహోత్రుని, నిప్పుని; నిల్పిన = రగిల్చు; కైవడిన్ = విధముగా; మత్ = మా యొక్క; నివాసము = నివాసము; ఔటన్ = అగుట; కున్ = కు; తలపోసి = ఆలోచించి; ఆ = ఆ; క్షితిన్ = భూమండలమును; దృఢంబుగన్ = గట్టిగా; నిల్పితివి = నిలబెట్టితివి; అయ్య = తండ్రి; ఈశ్వరా = విష్ణుమూర్తి {ఈశ్వరుడు - ఈశత్వము (ప్రభావము చూపు శక్తి) కలవాడు, విష్ణువు}.

భావము:

“నందకం” అనే ఖడ్గాన్ని ధరించినవాడా! ఈశ్వరుడా! ఓ శ్రీహరీ! నేర్పుతో సకల లోకాలను నియమబద్ధంగా ఏర్పాటు చేసిన నేర్పరివి. మంత్రసిధ్దుడైన యాజ్ఞికుడు ఆరణి యందు అగ్నిని నిలిపినట్లు నీవు దయపూని మేము నిలబడి మనుగడ సాధించడానికి ఈ భూమిని ఈ విధంగా సుస్థిరంగా నిలబెట్టావు.