పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విధాత వరాహస్తుతి

  •  
  •  
  •  

3-423.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి నీకుఁబ్రణామంబు లాచరింతు
ఖిలజగదేకకీర్తి! దయానువర్తి!
వ్యచారిత్ర! పంకజత్రనేత్ర!
చిరశుభాకార! యిందిరాచిత్తచోర!"

టీకా:

దేవ = దేవుడా; జితం = జయము; జితం = జయము; తే = నీకు; పరమేశ్వర = భగవంతుడా {పరమేశ్వరుడు - పరమము (అత్యున్నత)మైన ఈశ్వరుడు, విష్ణవు}; సిత = చక్కటి; యజ్ఞ = యజ్ఞమునకు; భావన = కారణుడా; శ్రుతి = వేదములే; శరీర = దేహముగా కలవాడ; కారణ = పనిగట్టుకొని; సూకరా = వరాహము యొక్క; ఆకారుండవు = స్వరూపము ధరించినవాడవు; అగు = అయిన; నీకున్ = నీకు; అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; మ్రొక్కెదము = నమస్కరించెదము; అయ్య = తండ్రి; వరద = భగవంతుడా {వరదుడు - వరములను ఇచ్చువాడు, విష్ణువు}; భవదీయ = నీ యొక్క; రోమ = వెంట్రుకల; కూపంబులు = మొదళ్లు; అందున్ = లో; లీనంబులున్ = లీనమైనవి; ఐ = అయి; ఉండున్ = ఉండే; అంబుధులు = సముద్రములు {అంబుధి - నీటికి నిధి వంటిది, సముద్రము}; అట్టి = అటువంటి; అధ్వరము = యజ్ఞము చేయు; ఆత్మకము = మార్గము; ఐ = అయ్యి; తనరారు = అతిశయించు; నీ = నీ యొక్క; రూపంబున్ = రూపము; కానంగరాదు = కనపడదు; దుష్కర్మపరుల = చెడ్డపనులు చేయువారి; కున్ = కి; అట్టి = అటువంటి;
నీకున్ = నీకు; ప్రణామంబులు = నమస్కారములు; ఆచరింతుము = చేయుదుము; అఖిల = సమస్తమైన; జగదేకకీర్తి = విష్ణుమూర్తి {జగదేకకీర్తి - లోకముల అంతటిచేతను కీర్తింపబడువాడు, విష్ణువు}; దయానువర్తి = విష్ణుమూర్తి {దయానువర్తి - దయతో అనుకూలముగా వర్తించువాడు, విష్ణువు}; భవ్య = శుభకరమైన; చారిత్ర = చరిత్ర కలవాడ; పంకజనేత్ర = విష్ణుమూర్తి {పంకజనేత్ర - పంకజము (పద్మము) లవంటి నేత్రములు కలవాడ, విష్ణవు}; చిరశుభాకార = విష్ణుమూర్తి {చిరశుభాకారుడు - మిక్కిలి శుభకరమైన ఆకారము కలవాడు, విష్ణువు}; ఇందిరాచిత్తచోర = విష్ణుమూర్తి {ఇందిరాచిత్తచోరుడు - ఇందిర (లక్ష్మీదేవి) యొక్క చిత్తము (మనసు)ను చోరుడు (దొంగిలించిన వాడు), విష్ణువు}.

భావము:

దేవదేవా! జయం జయం నీకు పరమేశ్వరా! జయం జయం. నీవు యజ్ఞాధిపతివి. వేదమూర్తివి, దుష్టశిక్షణ శిష్టరక్షణార్ధం వరాహావతారం ధరించిన నీకు పరమ భక్తితో ప్రణమిల్లుతున్నాము. నీవు వరాలు ఇచ్చే వాడవు, ఈ మహాసముద్రాలన్నీ నీ రోమకూపాలలో ఇమిడి ఉన్నాయి. విశాల విఖ్యాత కీర్తివీ, పరమ కరుణామూర్తివీ, పరమ పవిత్ర చరిత్రుడవూ, పద్మాల రేకులకు సాటివచ్చే కన్నులు కలవాడవూ, మిక్కిలి మంగళ ఆకారుడవూ, శ్రీరమా చిత్త చోరుడవూ అయిన నీకు ఇదిగో చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాం.