పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విధాత వరాహస్తుతి

  •  
  •  
  •  

3-427-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రూపివి హవనేతవు
భోక్తవు నిఖిలహవఫలాధారుఁడవున్
రక్షకుఁడవు నగు నీ
వితథముగ నుతులొనర్తు య్య; ముకుందా!

టీకా:

హవ = హోమము యొక్క; రూపివిన్ = రూపము కలవాడవు; హవ = హోమము యొక్క; నేతవు = నాయకుడవు; హవ = హోమము యొక్క; భోక్తవున్ = స్వీకరించువాడవు; నిఖిల = సమస్తమైన; హవ = హోమముల యొక్క; ఫల = ఫలితములకు; ఆధారుడవున్ = కారణము అయినవాడవు; హవ = హోమముల యొక్క; రక్షకుడవున్ = రక్షించువాడవును; అగు = అయిన; నీకు = నీకు; అవితథముగన్ = సత్యముగా; నుతులు = స్తోత్రములు; ఒనర్తుము = చేయుదుము; అయ్య = తండ్రి; ముకుందా = భగవంతుడా {ముకుందుడు - విష్ణుమూర్తి}.

భావము:

భూమ్యుద్ధరణ చేసిన దేవదేవుని దేవతలు స్తుతిస్తున్నారు. వరహావతారుడా! నీవు యజ్ఞ స్వరూపుడవు, యజ్ఞ కర్తవు, యజ్ఞ భోక్తవు, యజ్ఞఫల ప్రదాతవు, యజ్ఞ రక్షకుడవు, ముకుందుడవు; సమస్తము నీవే; నిన్ను హృదయ పూర్వకంగా కీర్తిస్తున్నాము.