పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

శ్రీ వామన చరిత్ర : శుక్ర బలి సంవాదంబును

118
అని యిట్లు పలుకుచున్న ఖర్వునకు నుర్వీదానంబు చేయం దలంచి కరకలిత సలిల కలశుండైన య వ్వితరణగుణముఖరునిం గని, నిజ విచారయుక్త దనుజ రాజ్య చక్రుండగు శుక్రుం డిట్లనియె.
అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలుకుచున్న = అనుచున్న; ఖర్వున్ = పొట్టివాని; కును = కి; ఉర్వీదానంబు = భూదానము; చేయన్ = చేయవలెనని; తలచి = అనుకొని; కర = చేతిలో; కలిత = ఉన్న; సలిల = నీటి; కలశుండు = కలశము కలవాడు; ఐన = అయినట్టి; ఆ = ఆ; వితరణ = దానముచేసెడి; గుణ = లక్షణములతో; ముఖరునిన్ = ముఖ్యమైనవానిని; కని = చూసి; నిజ = తన; విచార = ఆలోచనలో; యుక్త = కూడిన; దనుజ = రాక్షస; రాజ్య = రాజ్యమును; చక్రుండు = నడపువాడు; అగు = అయిన; శుక్రుండు = శుక్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
ఇలా చాలంటూ పలికిన వామనునికి మూడు అడుగుల భూదానం ఇవ్వడానికి బలిచక్రవర్తి జలకలశం చేతిలోనికి తీసుకుని సమాత్తం అవుతున్నాడు. అంతలో రాక్షసరాజ్య నిర్వాహణా దక్షుడు అయిన శుక్రాచార్యుడు దానశీలుడైన దానవచక్రవర్తి బలితో ఇలాఅన్నాడు.

119
"నుజేంద్ర! యీతఁడు రణీసురుఁడుఁ గాడు;
దేవకార్యంబు సాధించుకొఱకు
రి విష్ణుఁ డవ్యయుం దితి గర్భంబునఁ;
శ్యపసూనుఁడై లిఁగె; నకట!
యెఱుగ కీతని కోర్కి నిచ్చెద నంటివి;
దైత్య సంతతి కుపద్రవము వచ్చు
నీలక్ష్మిఁ దేజంబు నెలవు నైశ్వర్యంబు;
వంచించి యిచ్చుఁ దా వాసవునకు;

119.1
మొనసి జగము లెల్ల మూఁడు పాదంబుల
ఖిలకాయుఁ డగుచు నాక్రమించు
ర్వ ధనము విష్ణు సంసర్జనము చేసి
డుగు పగిది నెట్లు బ్రతికె దీవు?
దనుజేంద్ర = రాక్షసచక్రవర్తి; ఈతడు = ఇతగాడు; ధరణీసురుడు = బ్రాహ్మణుడు; కాడు = కాడు; దేవ = దేవతల; కార్యంబు = పని; సాధించు = సాధించుట; కొఱకు = కోసము; హరి = నారాయణుడు; విష్ణుడు = నారాయణుడు; అవ్యయుండు = నారాయణుడు; అదితి = అదితి యొక్క; గర్భంబునన్ = కడుపులో; కశ్యప = కశ్యపునియొక్క; సూనుడు = పుత్రుడు; ఐ = అయ్యి; కలిగెన్ = పుట్టెను; అకట = అయ్యో; ఎఱుగక = తెలియక; ఈతని = ఇతని యొక్క; కోర్కిన్ = కోరికను; ఇచ్చెదన్ = ఇస్తాను; అంటివి = అన్నావు; దైత్య = రాక్షస; సంతతి = కులమున; కున్ = కు; ఉపద్రవము = పెనుముప్పు; వచ్చున్ = వచ్చును; నీ = నీ యొక్క; లక్ష్మిన్ = సంపదలను; తేజంబున్ = తేజస్సును; నెలవున్ = స్థానమును; ఐశ్వర్యంబున్ = ఐశ్వర్యమును; వంచించి = దొంగిలించి; ఇచ్చున్ = ఇచ్చును; తాన్ = అతడు; వాసవున్ = ఇంద్రుని; కు = కి.
మొనసి = వ్యూహముపన్ని; జగములు = లోకములు; ఎల్లన్ = అన్నిటిని; మూడు = మూడు (3); పాదంబులన్ = అడుగులతోటి; అఖిలకాయుండు = విశ్వరూపుడు; అగుచున్ = అగుచు; ఆక్రమించున్ = అలముకొనును; సర్వ = సమస్తమైన; ధనమున్ = సంపదలను; విష్ణు = నారాయణునికి; సంసర్జనంబు = అప్పజెప్పుట; చేసి = చేసి; బడుగు = బీదవాని; పగిదిన్ = వలె; ఎట్లు = ఎలా; బ్రతికెదవు = జీవించగలవు; ఈవు = నీవు.
"రాక్షసేశ్వరా! బలీ! ఇతడు బ్రాహ్మణుడు కాదు. అనంతాత్ము డైన హరి, విష్ణువు. దేవతల కార్యాన్ని సాధించడానికి కశ్యపుని కొడుకుగా అదితి గర్భంలో పుట్టినవాడు. అయ్యో! తెలియకుండా ఇతనికి దానం ఇస్తానని ఒప్పుకున్నావు. దీని వలన రాక్షసులకు కష్టం వస్తుంది. ఇతడు నిన్ను మోసగించి నీ సంపదనూ తేజస్సునూ రాజ్యాన్నీ ఇంద్రునికి ఇస్తాడు. విశ్వరూపం ధరించి మూడడుగులతో లోకాలు అన్నిటినీ ఆక్రమిస్తాడు. నీ ఐశ్వర్యమంతా ధారపోసి నీవు నిరుపేదగా ఎలా బ్రతుకుతావు.

120
క్కపదంబున భూమియు
నొక్కటఁ ద్రిదివంబు ద్రొక్కి యున్నతమూర్తిన్
దిక్కులు గగనముఁ దానై
వెక్కసమై యున్న నెందు వెడలెదు? చెపుమా!
ఒక్క = ఒక; పదంబునన్ = అడుగుతో; భూమియున్ = భూలోకమును; ఒక్కటన్ = ఒకదానితో; త్రిదివంబున్ = స్వర్గలోకమును; త్రొక్కి = ఆక్రమించేసి; ఉన్నత = పెద్ద; మూర్తిన్ = స్వరూపముతో; దిక్కులున్ = దిక్కులు; గగనమున్ = ఆకాశము; తాను = తనే; ఐ = అయ్యి; వెక్కసము = నిండిపోయినవాడు; ఐ = అయ్యి; ఉన్నన్ = అయిపోయినచో; ఎందున్ = ఎక్కడకు; వెడలెదు = పోయెదవు; చెపుమా = చెప్పు.
ఇతడు ఒకపాదంతో భూలోకాన్నీ, ఇంకొకపాదంతో స్వర్గలోకాన్నీ కప్పివేస్తాడు. బాగా పెద్ద ఆకారం ధరించి, దిక్కులూ, ఆకాశం పిక్కటిల్లేటట్లు పెరిగి, అంతా తానై నిండిపోతాడు. అప్పుడు నీవు ఎక్కడికి పోతావు చెప్పు.

121
చ్చెద నని పల్కి యీకున్న నరకంబు;
ద్రోవ నీవును సమర్థుఁడవుఁ గావ;
యేదానమున నాశ మేతెంచు నదియును;
దానంబుఁ గా దండ్రు త్త్వవిదులు;
దానంబు యజ్ఞంబుఁ పముఁ గర్మంబును;
దావిత్తవంతుఁడై లఁపవలయుఁ;
న యింటఁ గల సర్వనమును నైదు భా;
ములుగా విభజించి కామమునకు

121.1
ర్థమునకు ధర్మశముల కాశ్రిత
బృందములకు సమతఁ బెట్టునట్టి
పురుషుఁ డిందు నందు బూర్ణుఁడై మోదించుఁ
న్ను మాని చేఁత గవుఁ గాదు.
ఇచ్చెదన్ = ఇస్తాను; అని = అని; పల్కి = పలికి; ఈకున్న = ఇవ్వకపోతే; నరకంబు = నరకమునకు పోవుటను; త్రోవన్ = తోసిపుచ్చుటకు; నీవును = నీవుకూడ; సమర్థుండవు = శక్తిమంతుడవు; కావ = కావా, అవును; ఏ = ఎట్టి; దానమునన్ = దానమువలన; నాశమున్ = నాశనము; ఏతెంచు = కలుగునో; అదియునున్ = అది; దానంబున్ = దానము; కాదు = కాదు; అండ్రున్ = అనెదరు; తత్త్వవిదులు = విజ్ఞానులు; దానంబున్ = దానము; యజ్ఞంబున్ = యాగము; తపమున్ = తపస్సు; కర్మంబున్ = కార్యక్రమములను; తాన్ = తను; విత్తవంతుడు = ధనముకలవాడు; ఐ = అయ్యి; తలపవలయున్ = సంకల్పించవలెను; తన = తన యొక్క; ఇంటన్ = ఇంటిలో; కల = ఉన్నట్టి; సర్వ = సమస్తమైన; ధనమున్ = సంపదలను; ఐదు = అయిదు; భాగములు = విభాగములుగా; విభజించి = విడదీసి; కామమున్ = కామమున; కున్ = కు; అర్థమున్ = అర్థమున; కున్ = కు.
ధర్మ = ధర్మమునకు; యశముల్ = కీర్తి; కిన్ = కి; ఆశ్రిత = ఆశ్రయించినవారి; బృందముల్ = సమూహముల; కున్ = కు; సమతన్ = సరిగా; పెట్టున్ = ఉపయోగించు; అట్టి = అటువంటి; పురుషుండు = మానవుడు; ఇందున్ = ఇహమున; అందున్ = పరమున; పూర్ణుడు = సార్థకుడు; ఐ = అయ్యి; మోదించున్ = ఆనందించును; తన్ను = తనకు; మాని = మించిన; చేతన్ = చేయుట; తగవు = తగినది; కాదు = కాదు.
ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే, వచ్చే నరకాన్ని త్రోసిపుచ్చడానికి నీకు శక్తి ఉంది. "దాతకు నాశనం తెచ్చే దానం దానమే కాదు" అని పెద్దలు చెప్తారు. తాను ధనవంతుడుగా ఉంటూ దానాన్ని యజ్ఞాన్ని తపస్సునూ గురించి ఆలోచించాలి. ఉత్తముడైన పురుషుడు తన ధనమంతా ఐదు భాగాలు చేసి కామానికి, అర్థానికి, ధర్మానికి, కీర్తికి, ఆశ్రయించినవారికీ సమానంగా పంచాలి. ఆ విధంగా చేసేవాడు, ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ కృతార్థుడు అయి సుఖపడతాడు. తనకు మించిన ధర్మం న్యాయం కాదు.

122
అదియునుం గాక యీ యర్థంబునందు బహుభంగి బహ్వృచ గీతార్థంబుఁ గల దొక్కటి; సావధానుండవై యాకర్ణింపుము.
అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ఈ = ఈ; అర్థంబు = విషయము; అందున్ = లో; బహు = అనేక; భంగిన్ = విధములుగ; బహ్వృచ = ఋగ్వేద; గీతార్థంబు = సూక్తి; కలదు = ఉన్నది; ఒకటి = ఒకటి; సావధానుండవు = శ్రద్ధగలవాడవు; ఐ = అయ్యి; ఆకర్ణింపుము = వినుము.
అంతేకాకుండా, ఈ విషయంలో ఎంతో ప్రసిద్ధమైన ఒక ఋగ్వేదసూక్తి ఉన్నది. దాన్ని చెబుతాను శ్రద్ధగా విను.

123
అంగీకరించిన ఖిలంబుఁ బోవుచో;
నృతంబుఁగాదు లే నిన నధిప!
యాత్మ వృక్షము మూల నృతంబు నిశ్చయ;
నృత మూలముఁ గల్గ నాత్మ చెడదు;
పుష్పఫలము లాత్మ భూజంబునకు సత్య;
మామ్రాను బ్రతుకమి దియుఁ జెడును;
లపుష్పములు లేక స చెడి వృక్షంబు;
మూలంబుతో వృద్ధిఁ బొందుఁ గాదె?

123.1
చేటుఁ గొఱతయు లఘిమయుఁ జెందకుండ
నిచ్చు పురుషుండు చెడకుండు నిద్ధచరిత!
కాక యంచిత సత్య సంతి నటంచు
నిజధనం బర్థి కిచ్చిన నీకు లేదు.
అంగీకరించినన్ = ఒప్పుకొనినచో; అఖిలంబున్ = సమస్తము; పోవుచోన్ = పోవునప్పుడు; అనృతంబు = అబద్దము; కాదు = కాదు; లేదు = లేదు; అనినన్ = అన్నప్పటికిని; అధిప = రాజా; ఆత్మ = దేహము యనెడి; వృక్షమున్ = చెట్టునకు; మూలము = మూలము, వేళ్ళు; అనృతంబు = అబద్దము; నిశ్చయము = తథ్యముగా; అనృత = అబద్దము; మూలమునన్ =వేరు; కల్గన్ = బాగున్నచో; ఆత్మ = దేహము; చెడదు = పాడైపోదు; పుష్ప = పూలు; ఫలముల్ = పండ్లు; ఆత్మన్ = దేహము యనెడి; భూజంబున్ = చెట్టున; కున్ = కు; సత్యము = సత్యము; ఆ = ఆ; మ్రాను = కాండము; బ్రతుకమి = జీవములేకపోయినచో; అదియున్ = అదికూడ; చెడును = నశించును; ఫల = పండ్లు; పుష్పములున్ = పూలు; లేక = లేకుండ; పస = అందము; చెడి = పాడైపోయినను; వృక్షంబు = చెట్టు; మూలంబు = కాండము, మొదలు; తోన్ = ద్వారా; వృద్దిన్ = అభివృద్దిని; పొందున్ = పొందును; కాదె = కదా.
చేటు = నాశనము; కొఱత = లోటు; లఘిమ = తక్కువగుట; చెందకుండ = పొందకుండగ; ఇచ్చు = దానముచేసెడి; పురుషుండు = మానవుడు; చెడక = నాశనముకాకుండ; ఉండున్ = ఉండును; ఇద్దచరిత = ప్రసిద్దమైన నడవడిక కలవాడ; కాక = అలాకాకండ; అంచిత = అచ్చమైన; సత్య = సత్యము; సంగతిన్ = కోసము; అటంచున్ = అనుచు; నిజ = తన; ధనంబున్ = సంపదలను; అర్థి = అడిగినవాని; కిన్ = కి; ఇచ్చిన = ఇచ్చివేసినచో; నీకు = నీకు; లేదు = ఏమీఉండదు.
రాజా! సచ్చరిత్రా! దేనిని ఇవ్వడం వలన సమస్తమూ నష్టము అవుతుందో ఆ దానము ఇవ్వరాదు. ఇస్తానని మాట ఇచ్చినాసరే. దానివల్ల అసత్య దోషం అంటదు. ఆత్మ అనే చెట్టుకు అసత్యమే మూలం కదా. అటువంటి ఆత్మ వృక్షానికి సత్యం పూలు పండ్లుగా ఉంటుంది. అసత్యం అనే మూలం బాగుంటే ఆత్మ అనే వృక్షం చెడదు. మొదలు చెడితే చెట్టు పూలూ పండ్లు చెడతాయి. పండ్లు పూలు లేకపోయినా మొదలు బాగా ఉంటే వృక్షం వృద్ధి చెందుతుంది. కాబట్టి మొదటికి చేటు వాటిల్లకుండా; లోటు రాకుండా; పదుగురలో పలుచన కాకుండా దానం చేసే దాత చెడిపోడు. అందుచేత, సత్యంకోసం నీవు ఇతనికి దానమిస్తే నీకు మిగిలేది ఏమీ ఉండదు.

124
ర్వమయినచోట ర్వధనంబులు
డుగ లే దటంచు నృతమాడు
చెనటి పందనేమి చెప్పఁ బ్రాణము తోడి
వము వాఁడు; వాని న్మ మేల?
సర్వము = సమస్తము; అయిన = అదే అయిన; చోట = అప్పుడు; సర్వ = సమస్తమైన; ధనంబులు = సంపదలు; అడుగ = కోర; లేదు = లేదు; అట = అని; అంచున్ = అనుచు; అనృతము = అబద్ధము; ఆడు = ఆడెడి; చెనటిపంద =కుత్సితపు పిఱికిపందను; ఏమి = ఏమని; చెప్ప = చెప్పవలెను; ప్రాణము = జీవము; తోడి = తో ఉన్న; శవము = శవము; వాడు = అతడు; వాని = అతడి; జన్మము = పుట్టుక; ఏల = ఎందుకు.
ఏ దానం దాత సంపద అంతటికి సమానమో, ఒక ప్రక్క అది అడుగుతూ; నేను అడిగేది స్వల్పమే సమస్త సంపదలూ కాదు అంటూ అబద్ధం చెప్పరాదు కదా. ఆ విధంగా చెప్పేవాడు నీచుడు, పిరికివాడు; వాడు ప్రాణమున్న పీనుగ; వాడి బ్రతుకు వ్యర్ధము.

125
మఱియు నిం దొక్క విశేషంబు గలదు; వివరించెద.
మఱియున్ = ఇంతేకాక; ఇందున్ = దీనిలో; ఒక్క = మరొక; విశేషంబు = ముఖ్యమైన విషయము; కలదు = ఉన్నది; వివరించెద = వివరముగా తెలిపెదను.
దీనిలో ఇంకొక విశేషం ఉంది వివరిస్తాను విను.

126
వారిజాక్షులందు వైవాహికము లందుఁ
బ్రాణవిత్తమానభంగమందుఁ
కిత గోకులాగ్ర న్మరక్షణ మందు
బొంకవచ్చు నఘము పొందఁ దధిప!
వారిజాక్షుల = ఆడవారి విషయము {వారిజాక్షులు - వారిజ (పద్మముల)వంటి అక్షులు (కన్నులు కలవారు), స్త్రీలు}; అందున్ = లోను; వైవాహికములు = పెండ్లికి సంబంధించిన వాని; అందున్ = లోను; ప్రాణ = ప్రాణములు; విత్త = ధనములు; మాన = గౌరవము; భంగము = పోయెడి సందర్భముల; అందున్ = లోను; చకిత = భీతిల్లిన; గో = గోవుల; కుల = సమూహములను; అగ్రజన్మ = బ్రాహ్మణులను; రక్షణము = కాపాడుట; అందున్ = లోను; బొంకవచ్చు = అబద్ధమాడవచ్చును; అఘము = పాపము; పొందదు = అంటదు; అధిప = రాజా.
ఓ బలిచక్రవర్తి! ఆడువారి విషయంలో కాని; పెళ్ళిళ్ల సందర్భంలో కాని; ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేటప్పుడు కాని; భీతిల్లిన గోవులను, విప్రులను కాపాడే టప్పుడు కాని అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు. దాని వల్ల ఏ పాపం రాదు.

127
కుమున్ రాజ్యముఁ దేజమున్ నిలుపుమీ కుబ్జుండు విశ్వంభరుం
తిం బోఁడు; త్రివిక్రమస్ఫురణ వాఁడైనిండు బ్రహ్మాండముం;
లఁడే మాన్ప నొకండు? నా పలుకు లార్ణింపు కర్ణంబులన్;
దీ దానము గీనముం బనుపుమా ర్ణిన్ వదాన్యోత్తమా!"
కులమున్ = వంశమును; రాజ్యమున్ = రాజ్యమును; తేజమున్ = తేజస్సును; నిలుపుము = నిలబెట్టుము; ఈ = ఈ; కుబ్జుండు = వామనుడు; విశ్వంభరుండు = విష్ణుమూర్తి {విశ్వంభరుడు - జగత్తును భరించువాడు, హరి}; అలతిన్ = అంతతేలికగా; పోడు = వదలిపెట్టడు; త్రివిక్రమ = ముల్లోకములను ఆక్రమించెడి; స్ఫురణన్ = స్ఫూర్తికల; వాడు = వాడు; ఐ = అయ్యి; నిండున్ = నిండిపోవును; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; కలడే = సమర్థుడు ఉన్నాడా; మాన్పన్ = ఆపుటకు; ఒకండు = ఒకడైన; నా = నా యొక్క; పలుకులున్ = మాటలను; ఆకర్ణింపుము = వినుము; కర్ణంబులన్ = చెవులారా; వలదు = వద్దు; ఈ = ఈ; దానమున్ = దానము; గీనమున్ = గీనము; పనుపుమా = పంపివేయుము; వర్ణిన్ = బ్రహ్మచారిని; వదాన్య = దాతలలో; ఉత్తమా = శ్రేష్ఠుడా.
దాతలలోకెల్లా అగ్రేశ్వరుడా! బలీ! ఈ పొట్టివాడు సాక్షాత్తు విశ్వభర్త, విష్ణువు. అంత తేలికగా ఇతను ఇక్కడ నుండి వెళ్ళడు. మూడు లోకాలనూ, మూడు అడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపం ధరించి, బ్రహ్మాండం అంతా నిండిపోతాడు. అప్పుడు అతనిని ఎవ్వరూ ఆపలేరు తెలుసా. దానం వద్దు, గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని పంపిచెయ్యి. నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్నీ నిలబెట్టుకో".

128
అని యిట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలిత లోచనుండయి యశస్వి యిట్లనియె.
అని = అని; ఇట్లు = ఇలా; హితంబు = మేలుకోరి; పలుకుచున్న = చెప్పుతున్న; కుల = వంశ; ఆచార్యున్ = గురువున; కున్ = కు; క్షణమాత్ర = కొంచెముసేపు; నిమీలిత = అరమూసిన; లోచనుండు = కన్నులు కలవాడు; అయి = అయ్యి; యశస్వి = కీర్తిగలవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

129
"నిజ మానతిచ్చితి వీవు మహాత్మక! ;
హిని గృహస్థధర్మంబు నిదియ
ర్థంబుఁ గామంబు శమును వృత్తియు;
నెయ్యది ప్రార్థింప నిత్తు ననియు
ర్థ లోభంబున ర్థిఁ బొమ్మను టెట్లు? ;
లికి లే దనుకంటెఁ బాప మెద్ది?
యెట్టి దుష్కర్ముని నేభరించెదఁ గాని;
త్యహీనుని మోవఁ జాల ననుచుఁ

129.1
లుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ
మరముననుండి తిరుగక చ్చుకంటె
లికి బొంకక నిజమునఁ రఁగుకంటె
మానధనులకు భద్రంబు ఱియుఁ గలదె.
నిజమున్ = సత్యమును; ఆనతిచ్చితివి = చెప్పితివి; ఈవు = నీవు; మహాత్మక = గొప్ప ఆత్మ కలవాడ; మహిని = భూమిపైన; గృహస్థ = గృహస్థులయొక్క; ధర్మంబున్ = ధర్మము; ఇదియ = ఇదె; అర్థంబున్ = అర్థము; కామంబు = కామము; యశము = కీర్తి; వృత్తియున్ = జీవనోపాయము; ఎయ్యదిన్ = దేనికోసము; ప్రార్థింపన్ = కోరినా; ఇత్తును = ఇచ్చెదను; అనియు = అని; అర్థ = సంపదలపై; లోభంబునన్ = లోభముతో; అర్థిన్ = అడిగినవానిని; పొమ్ము = వెళ్ళిపొమ్ము; అనుట = అనుట; ఎట్లు = ఎలాకుదురుతుంది; పలికి = మాట యిచ్చి; లేదు = లేదు; అనుట = అనుట; కంటెన్ = కంటె; పాపము = పాపము; ఎద్ది = ఏముంది; ఎట్టి = ఎలాంటి; దుష్కర్ముని = చెడ్డపనిచేసినవానినైన; నేన్ = నేను; భరించెదన్ = మోయగలను; కాని = కాని; సత్యహీనును = ఆడితప్పువానిని; మోవజాలన్ = మోయలేను; అనుచున్ = అని.
పలుకదే = అన్నదికదా; తొల్లి = పూర్వము; భూదేవి = భూదేవి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; తోడన్ = తోటి; సమరమున = యుద్ధము; నుండి = నుండి; తిరుగక = వెనుతిరగక; చచ్చు = మరణించుట; కంటెన్ = కంటె; పలికి = మాట యిచ్చి; బొంకక = పలుకలేదనకుండ; నిజమునన్ = సత్యమునందు; పరగు = వర్తిల్లెడి; కంటెన్ = కంటె; మాన = అభిమానము యనెడి; ధనుల = సంపదలుగలవార; కున్ = కి; భద్రంబు = శుభమైనది; మఱియున్ = మరింకొకటి; కలదె = ఉన్నదా, లేదు.
"ఓ మహాత్మా! శుక్రాచార్యా! నీవు చెప్పింది నిజమే. లోకంలో ఇదే గృహధర్మం కూడా. అర్థమూ, కామమూ, కీర్తి, జీవనోపాయము వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ధనంపై దురాశతో అడిగినవానికి లేదని చెప్పి త్రిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కంటే పాపం లేదు. పూర్వం భూదేవి "ఎంతటి చెడ్డ పనిచేసిన వాడిని అయినా మోస్తాను కానీ ఆడినమాట తప్పిన వాడిని మాత్రం మోయలేను." అని చెప్పింది కదా. యుద్ధంలో వెనుతిరగకుండా వీరమరణం పొందడం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం మానధనులు అయిన వారికి మేలైన మార్గాలు కదా.

130
ధాత్రిని హలికునకును సు
క్షేత్రము బీజములు నొకటఁ జేకుఱు భంగిం
జిత్రముగ దాత కీవియుఁ
బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే?
ధాత్రిన్ = భూమిపైన; హలికున్ = రైతున; కునున్ = కు; క్షేత్రము = మంచిపొలము; బీజములు = మంచివిత్తనములు; ఒకటన్ = ఒకేచోట; చేకూరు = సమకూరెడి; భంగిన్ = వలె; చిత్రముగ = అపురూపముగ; దాత = దానముచేయువాని; కి = కి; ఈవియున్ = దానమునకు తగినది; పాత్రము = తగినగ్రహీత; సమకూరున్ = కలిసివచ్చు; అట్టి = అటువంటి; భాగ్యము = అదృష్టము; కలదే = ఉందా, లేదు.
దున్నే రైతుకు మంచి పొలమూ, మంచి విత్త్తనాలూ ఒక చోట దొరకడం అరుదు. అదే విధంగా దాతకు తగిన ధనమూ, దానిని తీసుకునే ఉత్తముడూ దొరికే అదృష్టం అపురూపం కదా.

131
కారేరాజులు? రాజ్యముల్ గలుగవే? ర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవంజాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరేకోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!
కారే = కలుగరా; రాజులు = రాజులు; రాజ్యముల్ = రాజ్యములు; కలుగవే = పొందలేదా ఏమి; గర్వ = అహంకారముతో; ఉన్నతిన్ = ఔన్నత్యమును; పొందరే = చెందలేదా ఏమి; వారు = వాళ్ళందరు; ఏరి = ఎక్కడ ఉన్నారు; సిరిని = సంపదలను; మూటగట్టుకొని = కూడగొట్టుకొని; పోవంజాలిరే = తీసుకుని పోగలిగేరా, లేదు; భూమి = నేలపైన; పేరైనన్ = కనీసము పేరైన; కలదే = ఉన్నదా, లేదు; శిబి = శిబిచక్రవర్తి; ప్రముఖులున్ = మొదలగువారు; ప్రీతిన్ = కోరి; యశః = కీర్తి; కాములు = కోరువారు; ఐ = అయ్యి; ఈరే = ఇవ్వలేదా; కోర్కులు = దానములను; వారలన్ = వారిని; మఱచిరే = మరచిపోయారా, లేదు; ఈ = ఇప్పటి; కాలమున్ = కాలమునందును; భార్గవా = శుక్రాచార్యుడా {భార్గవుడు - భృగువు వంశమువాడు, శుక్రుడు}.
శుక్రాచార్యా! పూర్వం కూడ ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో ఔన్నత్యాన్ని సాధించునవారే కదా. కాని వా రెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా. శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా.

132
డుగని క్రతువులఁ వ్రతములఁ
బొగనఁ జన నట్టి పొడవు పొడవునఁ గుఱుచై
డిగెడినఁట; ననుబోఁటికి
నిరాదె మహానుభావ! యిష్టార్థంబుల్.
ఉడుగని = ఎడతెగని; క్రతువులన్ = యాగములతో; వ్రతములన్ = వ్రతములతో; పొడగనన్ = దర్శించుటకు; చననట్టి = వీలుకానట్టి; పొడవు = గొప్పవాడు; పొడవున = ఔన్నత్యముతో, కొలతలో; కుఱుచ = తక్కువ, పొట్టి; ఐ = అయ్యి; అడిగెడిన్ = అడుగుతున్నాడు; అట = అట; నను = నా; పోటి = వంటివాని; కిన్ = కి; ఇడన్ = దానమిచ్చుట; రాదె = చేయకూడదా ఏమి; మహానుభావ = గొప్పవాడా; ఇష్ట = కోరిన; అర్థంబుల్ = సంపదలను.
ఓ మహత్మా! శుక్రాచార్యా! ఎడతెగని యజ్ఞ యాగాలు, వ్రతాలూ చేసినా, పుణ్యకార్యాలు చేసినా విష్ణువును దర్శించడానికి వీలు పడదు. అటువంటి గొప్ప వాడు కురచ అయి అడుగుతున్నాడు. అతడు కోరినదానిని ఇవ్వడం కంటే నావంటి వాడికి ఇంకేం కావాలి.

133
దిన్శ్రీసతి కొప్పుపైఁ, దనువుపై, నంసోత్తరీయంబుపై,
బాదాబ్జంబులపైఁ, గపోలతటిపైఁ, బాలిండ్లపై నూత్నమ
ర్యాదంజెందు కరంబు గ్రిం దగుట మీఁదైనా కరంబుంట మేల్
గాదే?రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?
ఆదిన్ = ముందుగా; శ్రీసతి = లక్ష్మీదేవి; కొప్పు = జుట్టుముడి; పైన్ = మీద; తనువు = శరీరము; పైన్ = మీద; అంసోత్తరీయంబు = పైట; పైన్ = మీద; పాద = పాదములు యనెడి; అబ్జంబుల = పద్మముల; పైన్ = మీద; కపోలతటి = చెక్కిళ్ళ; పైన్ = మీద; పాలిండ్ల = స్తనముల; పైన్ = మీద; నూత్న = సరికొత్త; మర్యాదన్ = గౌరవమును; చెందు = పొందెడి; కరంబు = చేయి; క్రింద = కింద ఉన్నది; అగుట = అగుట; మీద = పైన ఉన్నది; ఐ = అయ్యి; నా = నా యొక్క; కరంబున్ = చేయి; ఉంటన్ = ఉండుట; మేల్ = గొప్ప; కాదే = కాదా ఏమిటి; రాజ్యమున్ = రాజ్యము; గీజ్యమున్ = గీజ్యము; సతతమే = శాశ్వతమా కాదు; కాయంబు = దేహము; నాపాయమే = చెడిపోనిదా కాదు.
ఇతడు దానం కావాలని చాచినచేయి ఎంతో గొప్పది కదా! మొదట లక్ష్మీదేవి యొక్క కొప్పు ముడి మీద, శరీరం మీద, పైట చెంగు మీద, పాదపద్మాల మీద, చెక్కిళ్ళ మీద, పాలిండ్ల మీద సరికొత్త మర్యాదలు పొందే దివ్యమైన హస్తం. అంతటి చెయ్యి కిందది కావటం నాచెయ్యి పైది కావటం ఎంత అదృష్టం! ఎంత మేలు! దీని ముందు ఈ రాజ్యం ఏ పాటిది! ఇదేమైనా శాశ్వతంగా ఉండేదా! ఈ శరీరం ఏమైనా పడిపోకుండా ఉండిపోతుందా.

134
నియంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
ర్మణంబైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో;
రుఁడైనన్, హరియైన, నీరజభవుం భ్యాగతుండైన నౌఁ;
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా; ధీవర్య! వే యేటికిన్?
నిరయంబు = నరకము దాపురించినది; ఐనన్ = అయినసరే; నిబంధము = కట్టివేయబడుట; ఐనన్ = జరిగినసరే; ధరణీ = భూమండలము; నిర్మూలనంబు = నాశనము; ఐనన్ = అయినాసరే; దుర్మరణంబు = దుర్మరణము; ఐనన్ = సంభవించినాసరే; కుల = వంశము; అంతము = నాశనము; ఐనన్ = జరిగినసరే; నిజమున్ = సత్యమునే; రానిమ్ము = ఒప్పుకొనెదను; కానిమ్ము = జరిగెడిది జరుగనిమ్ము; పో = భయంలేదు; హరుడు = శివుడు; ఐనన్ = అయినా; హరి = విష్ణువు; ఐనన్ = అయినా; నీరజభవుండు = బ్రహ్మదేవుడయినా; అభ్యాగతుండు = అతిథిగావచ్చినవాడు; ఐనన్ = అయిన; ఔ = సరే; తిరుగన్ = వెనుతిరుగుట; నేరదు = చేయలేదు; నాదు = నా యొక్క; జిహ్వ = నాలుక; వినుమా = వినుము; ధీవర్య = విజ్ఞాని; వేయేటికిన్ = పలుమాటలుదేనికి.
మిగతావి అన్నీ అనవసరమయ్య! నే బంధింప బడటం కాని, నాకు దుర్మరణం కలగటం కాని, నాకు నరకం దాపురించటం కాని, నా కులమే నాశనం కావటం కాని, భూమండలం బద్ధలవటం కాని, నిజంగానే వస్తే రానియ్యి; జరుగుతే జరుగనీ; ఏమైనా సరే నేను మాత్రం అబద్ధమాడ లేను. దానం పట్టడానికి వచ్చిన వాడు సాక్షాత్తు ఆ పరమ శివుడే అయినా, ఆ విష్ణుమూర్తే అయినా, ఆ బ్రహ్మదేవుడే అయినా సరే నా నాలుకకి ఆడిన మాట తప్పటం రాదు. పరమ విజ్ఞాన స్వరూప శుక్రాచార్య! నా నిర్ణయం వినవయ్య!

135
నొడివినంత పట్టు నుసలక యిచ్చుచో
నేల కట్టు విష్ణుఁ డేటి మాట?
ట్టెనేనిఁ దాన రుణించి విడుచును
విడువకుండ నిమ్ము విమలచరిత!
నొడివినంతపట్టున్ = అన్నమాట ప్రకారము; నుసలక = ఆలస్యములేక; ఇచ్చుచోన్ = ఇచ్చిన ఎడల; ఏల = ఎందుకు; కట్టు = బంధించును; విష్ణుడు = విష్ణుమూర్తి; ఏటిమాట = అదేమి మాట; కట్టెనేని = బంధించినను; తాన = అతను; కరుణించి = దయచేసి; విడుచును = వదలిపెట్టును; విడువక = వదలిపెట్టక; ఉండనిమ్ము = పోతే పోనియ్యి; విమల = నిర్మలమైన; చరిత = వర్తన కలవాడ.
నిర్మల ప్రవర్తన గల శుక్రాచార్యా! అదేం మాట, అన్నమాట ప్రకారం ఆలస్యం చేయకుండా దానం ఇస్తే విష్ణువు ఎందుకు బంధిస్తాడు. ఒకవేళ బంధించాడే అనుకో అతడే దయతో విడిచి పెడతాడు. విడిచి పెట్టకపోతే పోనీ ఇబ్బందేం ఉంది?