పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : శుక్ర బలి సంవాదంబును

  •  
  •  
  •  

8-594-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నొడివినంత పట్టు నుసలక యిచ్చుచో
నేల కట్టు విష్ణుఁ డేటి మాట?
ట్టెనేనిఁ దాన రుణించి విడుచును
విడువకుండ నిమ్ము విమలచరిత! "

టీకా:

నొడివినంతపట్టున్ = అన్నమాట ప్రకారము; నుసలక = ఆలస్యములేక; ఇచ్చుచోన్ = ఇచ్చిన ఎడల; ఏల = ఎందుకు; కట్టు = బంధించును; విష్ణుడు = విష్ణుమూర్తి; ఏటిమాట = అదేమి మాట; కట్టెనేని = బంధించినను; తాన = అతను; కరుణించి = దయచేసి; విడుచును = వదలిపెట్టును; విడువక = వదలిపెట్టక; ఉండనిమ్ము = పోతే పోనియ్యి; విమల = నిర్మలమైన; చరిత = వర్తన కలవాడ.

భావము:

నిర్మల ప్రవర్తన గల శుక్రాచార్యా! అదేం మాట, అన్నమాట ప్రకారం ఆలస్యం చేయకుండా దానం ఇస్తే విష్ణువు ఎందుకు బంధిస్తాడు. ఒకవేళ బంధించాడే అనుకో అతడే దయతో విడిచి పెడతాడు. విడిచి పెట్టకపోతే పోనీ ఇబ్బందేం ఉంది?