పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : శుక్ర బలి సంవాదంబును

  •  
  •  
  •  

8-586-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుమున్ రాజ్యముఁ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం
తిం బోఁడు; త్రివిక్రమస్ఫురణ వాఁడై నిండు బ్రహ్మాండముం;
లఁడే మాన్ప నొకండు? నా పలుకు లార్ణింపు కర్ణంబులన్;
దీ దానము గీనముం బనుపుమా ర్ణిన్ వదాన్యోత్తమా! "

టీకా:

కులమున్ = వంశమును; రాజ్యమున్ = రాజ్యమును; తేజమున్ = తేజస్సును; నిలుపుము = నిలబెట్టుము; ఈ = ఈ; కుబ్జుండు = వామనుడు; విశ్వంభరుండు = విష్ణుమూర్తి {విశ్వంభరుడు - జగత్తును భరించువాడు, హరి}; అలతిన్ = అంతతేలికగా; పోడు = వదలిపెట్టడు; త్రివిక్రమ = ముల్లోకములను ఆక్రమించెడి; స్ఫురణన్ = స్ఫూర్తికల; వాడు = వాడు; ఐ = అయ్యి; నిండున్ = నిండిపోవును; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; కలడే = సమర్థుడు ఉన్నాడా; మాన్పన్ = ఆపుటకు; ఒకండు = ఒకడైన; నా = నా యొక్క; పలుకులున్ = మాటలను; ఆకర్ణింపుము = వినుము; కర్ణంబులన్ = చెవులారా; వలదు = వద్దు; ఈ = ఈ; దానమున్ = దానము; గీనమున్ = గీనము; పనుపుమా = పంపివేయుము; వర్ణిన్ = బ్రహ్మచారిని; వదాన్య = దాతలలో; ఉత్తమా = శ్రేష్ఠుడా.

భావము:

దాతలలోకెల్లా అగ్రేశ్వరుడా! బలీ! ఈ పొట్టివాడు సాక్షాత్తు విశ్వభర్త, విష్ణువు. అంత తేలికగా ఇతను ఇక్కడ నుండి వెళ్ళడు. మూడు లోకాలనూ, మూడు అడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపం ధరించి, బ్రహ్మాండం అంతా నిండిపోతాడు. అప్పుడు అతనిని ఎవ్వరూ ఆపలేరు తెలుసా. దానం వద్దు, గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని పంపిచెయ్యి. నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్నీ నిలబెట్టుకో".