పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : శుక్ర బలి సంవాదంబును

  •  
  •  
  •  

8-589-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధాత్రిని హలికునకును సు
క్షేత్రము బీజములు నొకటఁ జేకుఱు భంగిం
జిత్రముగ దాత కీవియుఁ
బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే?

టీకా:

ధాత్రిన్ = భూమిపైన; హలికున్ = రైతున; కునున్ = కు; క్షేత్రము = మంచిపొలము; బీజములు = మంచివిత్తనములు; ఒకటన్ = ఒకేచోట; చేకూరు = సమకూరెడి; భంగిన్ = వలె; చిత్రముగ = అపురూపముగ; దాత = దానముచేయువాని; కి = కి; ఈవియున్ = దానమునకు తగినది; పాత్రము = తగినగ్రహీత; సమకూరున్ = కలిసివచ్చు; అట్టి = అటువంటి; భాగ్యము = అదృష్టము; కలదే = ఉందా, లేదు.

భావము:

దున్నే రైతుకు మంచి పొలమూ, మంచి విత్త్తనాలూ ఒక చోట దొరకడం అరుదు. అదే విధంగా దాతకు తగిన ధనమూ, దానిని తీసుకునే ఉత్తముడూ దొరికే అదృష్టం అపురూపం కదా.