పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : శుక్ర బలి సంవాదంబును

  •  
  •  
  •  

8-588-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నిజ మానతిచ్చితి వీవు మహాత్మక!-
హిని గృహస్థధర్మంబు నిదియ
ర్థంబుఁ గామంబు శమును వృత్తియు-
నెయ్యది ప్రార్థింప నిత్తు ననియు
ర్థ లోభంబున ర్థిఁ బొమ్మను టెట్లు?-
లికి లే దనుకంటెఁ బాప మెద్ది?
యెట్టి దుష్కర్ముని నే భరించెదఁ గాని-
త్యహీనుని మోవఁ జాల ననుచుఁ

8-588.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ
మరముననుండి తిరుగక చ్చుకంటె
లికి బొంకక నిజమునఁ రఁగుకంటె
మానధనులకు భద్రంబు ఱియుఁ గలదె.

టీకా:

నిజమున్ = సత్యమును; ఆనతిచ్చితివి = చెప్పితివి; ఈవు = నీవు; మహాత్మక = గొప్ప ఆత్మ కలవాడ; మహిని = భూమిపైన; గృహస్థ = గృహస్థులయొక్క; ధర్మంబున్ = ధర్మము; ఇదియ = ఇదె; అర్థంబున్ = అర్థము; కామంబు = కామము; యశము = కీర్తి; వృత్తియున్ = జీవనోపాయము; ఎయ్యదిన్ = దేనికోసము; ప్రార్థింపన్ = కోరినా; ఇత్తును = ఇచ్చెదను; అనియు = అని; అర్థ = సంపదలపై; లోభంబునన్ = లోభముతో; అర్థిన్ = అడిగినవానిని; పొమ్ము = వెళ్ళిపొమ్ము; అనుట = అనుట; ఎట్లు = ఎలాకుదురుతుంది; పలికి = మాట యిచ్చి; లేదు = లేదు; అనుట = అనుట; కంటెన్ = కంటె; పాపము = పాపము; ఎద్ది = ఏముంది; ఎట్టి = ఎలాంటి; దుష్కర్ముని = చెడ్డపనిచేసినవానినైన; నేన్ = నేను; భరించెదన్ = మోయగలను; కాని = కాని; సత్యహీనును = ఆడితప్పువానిని; మోవజాలన్ = మోయలేను; అనుచున్ = అని.
పలుకదే = అన్నదికదా; తొల్లి = పూర్వము; భూదేవి = భూదేవి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; తోడన్ = తోటి; సమరమున = యుద్ధము; నుండి = నుండి; తిరుగక = వెనుతిరగక; చచ్చు = మరణించుట; కంటెన్ = కంటె; పలికి = మాట యిచ్చి; బొంకక = పలుకలేదనకుండ; నిజమునన్ = సత్యమునందు; పరగు = వర్తిల్లెడి; కంటెన్ = కంటె; మాన = అభిమానము యనెడి; ధనుల = సంపదలుగలవార; కున్ = కి; భద్రంబు = శుభమైనది; మఱియున్ = మరింకొకటి; కలదె = ఉన్నదా, లేదు.

భావము:

“ఓ మహాత్మా! శుక్రాచార్యా! నీవు చెప్పింది నిజమే. లోకంలో ఇదే గృహధర్మం కూడా. అర్థమూ, కామమూ, కీర్తి, జీవనోపాయము వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ధనంపై దురాశతో అడిగినవానికి లేదని చెప్పి త్రిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కంటే పాపం లేదు. పూర్వం భూదేవి “ఎంతటి చెడ్డ పనిచేసిన వాడిని అయినా మోస్తాను కానీ ఆడినమాట తప్పిన వాడిని మాత్రం మోయలేను.” అని చెప్పింది కదా. యుద్ధంలో వెనుతిరగకుండా వీరమరణం పొందడం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం మానధనులు అయిన వారికి మేలైన మార్గాలు కదా.