పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : శుక్ర బలి సంవాదంబును

  •  
  •  
  •  

8-587-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలితలోచనుండయి యశస్వి యిట్లనియె.

టీకా:

అని = అని; ఇట్లు = ఇలా; హితంబు = మేలుకోరి; పలుకుచున్న = చెప్పుతున్న; కుల = వంశ; ఆచార్యున్ = గురువున; కున్ = కు; క్షణమాత్ర = కొంచెముసేపు; నిమీలిత = అరమూసిన; లోచనుండు = కన్నులు కలవాడు; అయి = అయ్యి; యశస్వి = కీర్తిగలవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా తమ మేలు కోరి, గురువు శుక్రుడు చెప్పగా, గొప్ప యశస్సు గల బలి ఒక క్షణం పాటు కన్నులు మూసుకుని ఇలా అన్నాడు.