పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : శుక్ర బలి సంవాదంబును

  •  
  •  
  •  

8-591-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డుగని క్రతువులఁ వ్రతములఁ
బొగనఁ జన నట్టి పొడవు పొడవునఁ గుఱుచై
డిగెడినఁట; ననుబోఁటికి
నిరాదె మహానుభావ! యిష్టార్థంబుల్.

టీకా:

ఉడుగని = ఎడతెగని; క్రతువులన్ = యాగములతో; వ్రతములన్ = వ్రతములతో; పొడగనన్ = దర్శించుటకు; చననట్టి = వీలుకానట్టి; పొడవు = గొప్పవాడు; పొడవున = ఔన్నత్యముతో, కొలతలో; కుఱుచ = తక్కువ, పొట్టి; ఐ = అయ్యి; అడిగెడిన్ = అడుగుతున్నాడు; అట = అట; నను = నా; పోటి = వంటివాని; కిన్ = కి; ఇడన్ = దానమిచ్చుట; రాదె = చేయకూడదా ఏమి; మహానుభావ = గొప్పవాడా; ఇష్ట = కోరిన; అర్థంబుల్ = సంపదలను.

భావము:

ఓ మహత్మా! శుక్రాచార్యా! ఎడతెగని యజ్ఞ యాగాలు, వ్రతాలూ చేసినా, పుణ్యకార్యాలు చేసినా విష్ణువును దర్శించడానికి వీలు పడదు. అటువంటి గొప్ప వాడు కురచ అయి అడుగుతున్నాడు. అతడు కోరినదానిని ఇవ్వడం కంటే నావంటి వాడికి ఇంకేం కావాలి.