పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : శుక్ర బలి సంవాదంబును

  •  
  •  
  •  

8-578-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నుజేంద్ర! యీతఁడు రణీసురుఁడుఁ గాడు-
దేవకార్యంబు సాధించుకొఱకు
రి విష్ణుఁ డవ్యయుం దితి గర్భంబునఁ-
శ్యపసూనుఁడై లిఁగె; నకట!
యెఱుగ కీతని కోర్కి నిచ్చెద నంటివి-
దైత్య సంతతి కుపద్రవము వచ్చు
నీ లక్ష్మిఁ దేజంబు నెలవు నైశ్వర్యంబు-
వంచించి యిచ్చుఁ దా వాసవునకు;

8-578.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మొనసి జగము లెల్ల మూఁడు పాదంబుల
ఖిలకాయుఁ డగుచు నాక్రమించు
ర్వ ధనము విష్ణు సంసర్జనము చేసి
డుగు పగిది నెట్లు బ్రతికె దీవు?

టీకా:

దనుజేంద్ర = రాక్షసచక్రవర్తి; ఈతడు = ఇతగాడు; ధరణీసురుడు = బ్రాహ్మణుడు; కాడు = కాడు; దేవ = దేవతల; కార్యంబు = పని; సాధించు = సాధించుట; కొఱకు = కోసము; హరి = నారాయణుడు; విష్ణుడు = నారాయణుడు; అవ్యయుండు = నారాయణుడు; అదితి = అదితి యొక్క; గర్భంబునన్ = కడుపులో; కశ్యప = కశ్యపునియొక్క; సూనుడు = పుత్రుడు; ఐ = అయ్యి; కలిగెన్ = పుట్టెను; అకట = అయ్యో; ఎఱుగక = తెలియక; ఈతని = ఇతని యొక్క; కోర్కిన్ = కోరికను; ఇచ్చెదన్ = ఇస్తాను; అంటివి = అన్నావు; దైత్య = రాక్షస; సంతతి = కులమున; కున్ = కు; ఉపద్రవము = పెనుముప్పు; వచ్చున్ = వచ్చును; నీ = నీ యొక్క; లక్ష్మిన్ = సంపదలను; తేజంబున్ = తేజస్సును; నెలవున్ = స్థానమును; ఐశ్వర్యంబున్ = ఐశ్వర్యమును; వంచించి = దొంగిలించి; ఇచ్చున్ = ఇచ్చును; తాన్ = అతడు; వాసవున్ = ఇంద్రుని; కు = కి.
మొనసి = వ్యూహముపన్ని; జగములు = లోకములు; ఎల్లన్ = అన్నిటిని; మూడు = మూడు (3); పాదంబులన్ = అడుగులతోటి; అఖిలకాయుండు = విశ్వరూపుడు; అగుచున్ = అగుచు; ఆక్రమించున్ = అలముకొనును; సర్వ = సమస్తమైన; ధనమున్ = సంపదలను; విష్ణు = నారాయణునికి; సంసర్జనంబు = అప్పజెప్పుట; చేసి = చేసి; బడుగు = బీదవాని; పగిదిన్ = వలె; ఎట్లు = ఎలా; బ్రతికెదవు = జీవించగలవు; ఈవు = నీవు.

భావము:

“రాక్షసేశ్వరా! బలీ! ఇతడు బ్రాహ్మణుడు కాదు. అనంతాత్ము డైన హరి, విష్ణువు. దేవతల కార్యాన్ని సాధించడానికి కశ్యపుని కొడుకుగా అదితి గర్భంలో పుట్టినవాడు. అయ్యో! తెలియకుండా ఇతనికి దానం ఇస్తానని ఒప్పుకున్నావు. దీని వలన రాక్షసులకు కష్టం వస్తుంది. ఇతడు నిన్ను మోసగించి నీ సంపదనూ తేజస్సునూ రాజ్యాన్నీ ఇంద్రునికి ఇస్తాడు. విశ్వరూపం ధరించి మూడడుగులతో లోకాలు అన్నిటినీ ఆక్రమిస్తాడు. నీ ఐశ్వర్యమంతా ధారపోసి నీవు నిరుపేదగా ఎలా బ్రతుకుతావు.