పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : శుక స్తుతి (సర్వశుభప్రదం)

  1
"రుఁడై, యీశ్వరుఁడై, మహామహిముఁడై, ప్రాదుర్భవస్థానసం
ణక్రీడనుఁడై, త్రిశక్తియుతుడై, యంతర్గతజ్యోతియై,
మేష్టిప్రము ఖామరాధిపులకుం బ్రాపింపరాకుండు దు
స్త మార్గంబునఁ దేజరిల్లు హరికిం త్త్వార్థినై మ్రొక్కెదన్.

  2
మఱియు సజ్జనదురితసంహారకుండును, దుర్జన నివారకుండును సర్వరూపకుండునుఁ, బరమహంసాశ్రమ ప్రవర్తమాన మునిజన హృదయకమల కర్ణికామధ్య ప్రదీపకుండును, సాత్వతశ్రేష్ఠుండును, నిఖిల కల్యాణ గుణ గరిష్ఠుండునుఁ, బరమ భక్తియుక్త సులభుండును, భక్తిహీనజన దుర్లభుండును, నిరతిశయ నిరుపమ నిరవధిక ప్రకారుండును, నిజస్వరూపబ్రహ్మవిహారుండును నైన యప్పరమేశ్వరునకు నమస్కరించెద.

  3
విభువందనార్చనములే, విభుచింతయు, నామకీర్తనం,
బే విభులీల, లద్భుతము లెప్పుడు సంశ్రవణంబు సేయ దో
షాలిఁ బాసి లోకము శుభాయతవృత్తిఁ జెలంగు నండ్రు; నే
నా విభు నాశ్రయించెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్.

  4
రమేశు పాదయుగ మెప్పుడు గోరి భజించి నేర్పరుల్
లోలి బుద్ధితో నుభయలోకములందుల జడ్డుఁ బాసి, యే
తాము లేక బ్రహ్మగతిఁ దారు గతశ్రములై చరింతు; రే
నా రమేశు మ్రొక్కెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్.

  5
ములఁ జేసియైన, మఱి దానము లెన్నియుఁ జేసియైన, నే
ములఁ జేసియైన, ఫలసంచయ మెవ్వనిఁ జేర్పకున్న హే
దములై దురంతవిపదంచితరీతిగ నొప్పుచుండు; న
య్యరిమితున్ భజించెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్.

  6
న, వ్యాధ, పుళింద, హూణ, శక, కంకాభీర, చండాల సం
వులుం దక్కిన పాపవర్తనులు నే ద్రాత్ము సేవించి, భా
తశ్రేష్ఠులఁ డాసి, శుద్ధతనులై ళ్యాణులై యుందు; రా
వికారుం బ్రభవిష్ణు నాదు మదిలో శ్రాంతమున్ మ్రొక్కెదన్.

  7
ముల్ సేసిననో, మనోనియతినో, దానవ్రతావృత్తినో,
మంత్రంబులనో, శ్రుతిస్మృతులనో, ద్భక్తినో యెట్లు ల
బ్ధదుండౌనని బ్రహ్మ రుద్ర ముఖరుల్, భావింతు రెవ్వాని; న
య్యవర్గాధిపుఁ డాత్మమూర్తి సులభుండౌఁ గాక నాకెప్పుడున్.

  8
శ్రీతియు, యజ్ఞపతియుఁ, బ్ర
జాతియున్, బుద్ధిపతియు, గదధిపతియున్,
భూతియు, యాదవశ్రే
ణీతియున్, గతియునైన నిపుణు భజింతున్.

  9
ణువో? గాక కడున్ మహావిభవుఁడో? చ్ఛిన్నుఁడో? ఛిన్నుఁడో?
గుణియో? నిర్గుణుఁడో? యటంచు విబుధుల్ గుంఠీభవత్తత్త్వమా
ర్గణులై యే విభుపాదపద్మ భజనోత్కర్షంబులం దత్త్వ వీ
క్షముం జేసెద; రట్టి విష్ణుఁ, బరమున్, ర్వాత్ము సేవించెదన్.

  10
దుత్పాదనబుద్ధి బ్రహ్మకు మదిన్ సంధింప నూహించి యే
వంతుండు సరస్వతిం బనుప, నా ద్మాస్య దా నవ్విభున్
నింగా నియమించి తద్భువన సామ్రాజ్యస్థితిన్ సృష్టిపా
గుఁ జేసెన్ మును బ్రహ్మ; నట్టి గుణి నారంభింతు సేవింపఁగన్.

  11
పూర్ణుఁ డయ్యును మహాభూతపంచకయోగ-
మున మేనులను పురములు సృజించి;
పురములలోనుండి పురుషభావంబున-
దీపించు నెవ్వడు ధీరవృత్తిఁ?
బంచభూతములను దునొకం డింద్రయ-
ములఁ బ్రకాశింపించి భూరిమహిమ
షోడశాత్మకుఁడన శోభిల్లు, జీవత్వ-
నృత్త వినోదంబు నెఱపుచుండు?

  12
ట్టి భగవంతుఁ, డవ్యయుం, చ్యుతుండు
మానసోదిత వాక్పుష్ప మాలికలను
మంజు నవరస మకరంద హిమ లుట్ట
శిష్టహృద్భావలీలలఁ జేయుఁగాత.

  13
మాధనుల్, మహాత్ములు, సమాధినిరూఢులు, యన్ముఖాంబుజ
ధ్యా మరంద పానమున నాత్మ భయంబులఁ బాసి, ముక్తులై
లూత నొంద; రట్టి మునిలోకశిఖామణికిన్, విశంక టా
జ్ఞాతమోనభోమణికి, సాధుజనాగ్రణి, కేను మ్రొక్కెదన్."

  14
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత ద్వితీయ స్కంధ అంతర్గత శుక స్తుతి (సర్వశుభప్రదం)