పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శుకుడు స్తోత్రంబు సేయుట

  •  
  •  
  •  

2-65-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీతియు, యజ్ఞపతియుఁ, బ్ర
జాతియున్, బుద్ధిపతియు, గదధిపతియున్,
భూతియు, యాదవశ్రే
ణీతియున్, గతియునైన నిపుణు భజింతున్.

టీకా:

శ్రీ = లక్ష్మీదేవికి; పతియున్ = భర్తయును; యజ్ఞ = యజ్ఞమునకు; పతియున్ = రక్షకుడును; ప్రజాపతి = ప్రజలకు ప్రభువు, బ్రహ్మ; బుద్ధి = బుద్ధికి; పతియున్ = అధిదేవతయును; జగత్ = జగత్తునకు; అధిపతియున్ = అధిపతియును; భూ = భూమికి (ద్వారకకు); పతియున్ = రాజుయు; యాదవ = యాదవ కులముల; శ్రేణీపతియున్ = గణపతియును; గతియు = (సర్వులకు) పరమపదమును; ఐనన్ = అయినట్టి; నిపుణున్ = నేర్పరిని; భజింతున్ = కొలుస్తున్నాను.

భావము:

లక్ష్మికి, యజ్ఞానికి, ప్రజలకు, బుద్ధికి, జగత్తుకు, భూమికి, యాదవ వర్గానికి, పతి గతి అయినట్టి ఆ భగవంతుని సేవిస్తాను.