పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శుకుడు స్తోత్రంబు సేయుట

  •  
  •  
  •  

2-62-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ములఁ జేసియైన, మఱి దానము లెన్నియుఁ జేసియైన, నే
ములఁ జేసియైన, ఫలసంచయ మెవ్వనిఁ జేర్పకున్న హే
దములై దురంతవిపదంచితరీతిగ నొప్పుచుండు; న
య్యరిమితున్ భజించెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్.

టీకా:

తపములన్ = తపస్సులు {తపస్సు - తపించుట ముఖ్యముగ ఆధ్యాత్మికమైనది}; చేసి = చేయుట వలన; ఐనన్ = అయినప్పటికిని; మఱి = ఇంకను; దానములు = దానములు; ఎన్నియున్ = ఎన్నింటిని; చేసి = చేయుట వలన; ఐనన్ = అయినప్పటికిని; ఏ = ఎంత కష్టసాధ్యమైన; జపములన్ = జపములను {జపము - నియమించుకొని మరల మరల స్మరించుట}; చేసి = చేయుటవలన; ఐనన్ = అయినప్పటికిని; ఫల = (వాటి వల్ల కలిగిన) ఫలితముల; సంచయమున్ = సమూహములను; ఎవ్వనిన్ = ఎవనికైతే; చేర్పక = అంకితము చేయకుండగ; ఉన్నన్ = ఉన్నట్లయితే; హేయన్ = నింద్యమైన, విడువతగిన; పదమున్ = మార్గములు; ఐ = అయి; దురంత = అంతులేని; విపత్ = ఆపదలు; అంచిత = తోకూడిన; రీతిగన్ = విధముగ; ఒప్పుచున్ = అగుతూ; ఉండున్ = ఉండునో; ఆ = ఆ; అపరిమితున్ = పరిమితులులేని వానిని; భజించెదన్ = కీర్తింతును; అఘ = పాపపు; ఓఘన్ = పరంపరలు; నివర్తనున్ = పోగొట్టువానిని; భద్ర = క్షేమముకలిగించు; కీర్తనున్ = కీర్తనములు కలవానిని.

భావము:

ఎన్నేసి తపస్సులు, దానాలు, జపాలు చేసినప్పటికి వాటివల్ల కలిగే ఫలాలను పరమేశ్వరుడికి అర్పించకుంటే అవన్నీ నింద్యాలై ఆపదల క్రింద పరిణమిస్తాయి. పరిమితి లేనివాడు, పాపనిచయ నివర్తనుడు, మంగళమయకీర్తనుడు అయినట్టు ఆ పరమేశ్వరుణ్ణి సేవిస్తున్నాను.