పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శుకుడు స్తోత్రంబు సేయుట

  •  
  •  
  •  

2-58-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రుఁడై, యీశ్వరుఁడై, మహామహిముఁడై, ప్రాదుర్భవస్థానసం
ణక్రీడనుఁడై, త్రిశక్తియుతుడై, యంతర్గతజ్యోతియై,
మేష్టిప్రము ఖామరాధిపులకుం బ్రాపింపరాకుండు దు
స్త మార్గంబునఁ దేజరిల్లు హరికిం త్త్వార్థినై మ్రొక్కెదన్.

టీకా:

పరుఁడు = అన్నిటికిని పైనుండు వాడు; ఐ = అయి; ఈశ్వరుఁడు = ప్రభువు, అధిపతి; ఐ = అయి; మహా = గొప్ప; మహిముఁడు = మహిమ కలవాడు; ఐ = అయి; ప్రాదుర్భవ = సృష్టి; స్థాన = స్థితి; సంహరణన్ = లయములు అను; క్రీడనుఁడున్ = ఆటాడుట కలవాడు; ఐ = అయి; త్రి = మూడు; శక్తి = శక్తులు {త్రిశక్తి - ఇవి మూడు (3) విధములు, ఒక్కొకటి మరల మూడు (3) రకములు అవి - 1 ఇచ్చాది - ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు, 2 ఉత్సాహాది - ఉత్సాహము, ప్రభుత్వము, మంత్రము, 3 సత్వాది - సత్వము, రజస్సు, తమస్సు}; యుతుఁడు = కలవాడు; ఐ = అయి; అంతర్గత = (సమస్తమునకు) లోపలన ఉండు; జ్యోతి = ప్రకాశము; ఐ = అయి; పరమేష్టి = మహాయాజ్ఞకుడు, బ్రహ్మ {పరమేష్టి - అత్యున్నతమైన సంకల్పశక్తుడు}; ప్రముఖ = మొదలగు ముఖ్య; అమర = దేవతల; అధిపులున్ = ప్రభువులు; కున్ = కిని; ప్రాపింపన్ = పొందుటకు; రాక = సాధ్యముకాక; ఉండున్ = ఉండునట్టి; దుస్తర = తరించలేని, అందుకొనలేని; మార్గంబునన్ = విధముగ; తేజరిల్లు = ప్రకాశించునట్టి; హరి = విష్ణుని; కిన్ = కి; తత్త్వన్ = తత్త్వమును,సత్ స్వరూపమును; అర్థిన్ = తెలిసికొన గోరువాడను; ఐ = అయి; మ్రొక్కెదన్ = ప్రార్థించుచుంటిని.

భావము:

ప్రకృతికంటే జీవునికంటే పరుడు, ఈశ్వరుడు, గొప్ప మహిమ కలవాడు, సృష్టిస్థితిలయాలను ఆటగా సాగించేవాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తుల శక్తి కలవాడు, అందరికి అంతరాత్మగా వెలుగొందేవాడు, బ్రహ్మాదిదేవతలు అందుకోడానికి వీలుకాని దుస్తరమైన త్రోవలో ప్రకాశించేవాడు అయిన శ్రీహరికి తత్త్వాభిలాషతో నమస్కరిస్తున్నాను.