పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శుకుడు స్తోత్రంబు సేయుట

  •  
  •  
  •  

2-63-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న, వ్యాధ, పుళింద, హూణ, శక, కంకాభీర, చండాల సం
వులుం దక్కిన పాపవర్తనులు నే ద్రాత్ము సేవించి, భా
తశ్రేష్ఠులఁ డాసి, శుద్ధతనులై ళ్యాణులై యుందు; రా
వికారుం బ్రభవిష్ణు నాదు మదిలో శ్రాంతమున్ మ్రొక్కెదన్.

టీకా:

యవన = యవనులు; వ్యాధ = బోయలు, కిరాతులు; పుళింద = పుళిందులు, మిక్కిలిహింసచేసేవారు; హూణ = హూణులు; శక = శకులు; కంక = కంకులు, కంక పక్షులను తినువారు; ఆభీర = గొల్లలు, చెంచులు; చండాల = చండాలులు; సంభవులు = (గా) పుట్టినవారు; తక్కిన = తతిమా; పాప = పాపపు; వర్తనులున్ = ప్రవర్తన కలవారు కూడ; ఏ = ఏ; భద్ర = శుభము; ఆత్మున్ = తానైన వానిని; సేవించి = కొలిచి; భాగవత = భగవంతునికి చెందినవారలలో; శ్రేష్ఠులన్ = శ్రేష్ఠమైన వారిని; డాసి = చేరి; శుద్ధ = పరిశుద్ధి చెందిన; తనులు = శరీరము కలవారు; ఐ = అయి; కళ్యాణులు = శుభ స్వరూపులు; ఐ = అయి; ఉందురు = ఉంటారో; ఆ = ఆ యొక్క; అవికారున్ = ఏ వికారములు లేని వానిని; ప్రభవిష్ణున్ = సృష్టి కారకుని; నాదు = నా యొక్క; మది = మనస్సు; లోన్ = లోపల; అశ్రాంతమున్ = విరామము లేకుండగ, నిరంతరము; మ్రొక్కెదన్ = కొలిచెదను.

భావము:

యవనులు, కిరాతులు, పుళిందులు, హూణులు, శకులు, కంకులు, ఆభీరులు, చండాలురు-ఇలాంటి జాతుల్లో పుట్టినవారు, ఇతర పాపాత్ములు కూడ పరమపావనుని సేవించినచో భాగవత శ్రేష్ఠుల నాశ్రయించినవారు, పరిశుద్ధ శరీరులు, మంగళాకారులు అయి ఉంటారు. వికారరహితుడు, సర్వసమర్ధుడు అయినట్టి ఆ పరమాత్మకు నా మనస్సులో ఎల్లవేళల నమస్కరిస్తాను.