పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అమృతగుళికలు : సౌగంధికాలు


భాగవత పద్యసౌగంధికాలు

పద్య సూచిక;-
రాజీవసదృశనయన! విరాజితసుగుణా! ; రాజీవసదృశలోచన! రాజీవభవాది ; రా పూర్ణచంద్రిక! రా గౌతమీగంగ! ; రామ! గుణాభిరామ! ; రామలతోడను రాసము ; రామున్ మేచకజలదశ్యామున్ ; రావే సుందరి! యేమె బోటి! ; రోలంబేశ్వర! ; లగ్నం బెల్లి; ; లలనా! యేటికి తెల్లవాఱె? ; లలితస్కంధము, ; లాలనమున బహుదోషము ; లేమా! దనుజుల గెలువఁగలేమా? ; లోకంబులు లోకేశులు ; లోపలి సౌధంబులోన వర్తింపగఁ ; వచ్చెద రదె యదువీరులు ; వరచేలంబులొ ; వసుధాఖండము వేఁడితో? ; వాచవియైన గడ్డిఁ దిని ; వాయువశంబులై యెగసి ; వారిఁ గోరుచున్నవారికి ; వా రిల్లు చొచ్చి ; వాలిన భక్తి మ్రొక్కెద ; వావిఁ జెల్లెలు గాని ;

up-arrow (1) 11-125-క.

రాజీవసదృశనయన! వి
రాజితసుగుణా! విదేహరాజవినుత! వి
భ్రాజితకీర్తి సుధావృత
రాజీవభవాండభాండ! ఘుకులతిలకా!
భావము:- పద్మములవంటి కన్నులు కలవాడ! ప్రకాశించే సుగుణాలు కలవాడా జనక మహారాజుచే పొగడబడినవాడ! ప్రకాశించే కీర్తి అనే అమృతంతో ఆవరించబడిన బ్రహ్మాండభాండం కలవాడ! రఘువంశానికి తిలకం వంటివాడ! శ్రీరామచంద్ర ప్రభు!

up-arrow (2) 7-480-క.

రాజీవసదృశలోచన!
రాజీవభవాది దేవరాజి వినుత! వి
బ్రాజితకీర్తిలతావృత
రాజీవభవాండ భాండ! ఘుకులతిలకా!
భావము:- శ్రీరామచంద్ర ప్రభు! నీవు కలువల వంటి కన్నులు ఉన్న అందగాడవు; నిన్ను బ్రహ్మదేవుడు మున్నగు సకల దేవతలు సదా స్తుతిస్తు ఉంటారు; నీ కీర్తి సమస్త బ్రహ్మాండాల సమూహం అంతటా వ్యాపించి తళతళలాడుతూ ఉంటుంది; నీవు రఘువంశానికి వన్నె తెచ్చిన వాడవయ్యా! రామయ్య!

up-arrow (3) 10.1-604-సీ.

రా పూర్ణచంద్రిక! రా గౌతమీగంగ! ;
మ్ము భగీరథరాజతనయ!
రా సుధాజలరాశి! రా మేఘబాలిక! ;
మ్ము చింతామణి! మ్ము సురభి!
రా మనోహారిణి! రా సర్వమంగళ! ;
రా భారతీదేవి! రా ధరిత్రి!
రా శ్రీమహాలక్ష్మి! రా మందమారుతి! ;
మ్ము మందాకిని! రా శుభాంగి!
10.1-604.1-ఆ.
నుచు మఱియుఁ గలుగు నాఖ్యలు గల గోవు
డవిలోన దూరమందు మేయ
నగభీరభాషఁ డునొప్పఁ జీరు నా
భీరజనులు బొగడఁ బెంపు నెగడ.
భావము:- ఇలా రావే ఓ పూర్ణచంద్రికా! రామ్మా గౌతమీగంగ! రావే భాగీరథీతనయా! ఇటు రా సుధాజలరాశి! రావమ్మ ఓ మేఘబాలిక! ఇలా రామ్మా చింతామణి! రామ్మా ఓ సురభి! రావే మనోహారిణీ! రమ్ము సర్వమంగళ! రా భారతీదేవీ! ఇటు రా ధరిత్రీ! రావమ్మా శ్రీమహాలక్ష్మీ! రావే మందమారుతి! రమ్ము మందాకిని! ఇలా రా శుభాంగీ! అంటు తన మేఘగర్జన లాంటి కంఠస్వరంతో అడవిలో దూర ప్రాంతాలకు పోయిన గోవులను వాటి పేరు పెట్టి పేరుపేరునా పిలుస్తున్నాడు. బహుచక్కటి ఆ పలుకుల గాంభీర్యానికి, మాధుర్యానికి ఆనందించి గోకులంలోని ఆభీరజనులు ఎంతో మెచ్చుకుంటున్నారు.
గోవులు (జ్ఞానులు నామ రూప జ్ఞానాలు) మేస్తూ అడవిలో (సంసారాటవిలో) దూరదూరాల్లోకి దారితప్పి వెళ్ళి పోయాయి. శ్రీకృష్ణుడు గొల్లపిల్లలను (పసిమనసు లంత స్వచ్ఛమైన సిద్ధులను) చల్దులు తింటో (మననం చేస్తూ) ఉండ మని చెప్పి గోపాల బాలుడు బయలుదేరాడు ఇదిగో ఇలా, శ్రీకృష్ణ తత్వ ఆవిష్కరణ వెల్లడిస్తూ బమ్మెర వారు బ్రహ్మాండంగా అలతి పొలతి పదాలతో అలరించాడు.

up-arrow (4) 2-285-ఉ.

రా! గుణాభిరామ! దినరాజకులాంబుధిసోమ! తోయద
శ్యా! దశాననప్రబలసైన్యవిరామ! సురారిగోత్రసు
త్రా! సుబాహుబాహుబలర్ప తమఃపటుతీవ్రధామ! ని
ష్కా! కుభృల్లలామ! కఱకంఠసతీనుతనామ! రాఘవా!
భావము:- ఓ శ్రీరామచంద్ర! నీవు కల్యాణగుణసాంద్రుడవు. సూర్యవంశ మనే సముద్రానికి చంద్రుడవు. నీలమేఘశ్యాముడవు. రావణాసురుని భీకర సైన్యాన్ని అంతమొందించిన వాడవు. రాక్షసులనే పర్వతాల పాలిటి వజ్రాయుధధారైన ఇంద్రుడవు. సుబాహుని బాహుబల గర్వం అనే చీకటి పాలిటి తీక్ష్ణకిరణాల సూర్యుడవు. కాంక్షలు లేనివాడవు. అవనీపతులలో అగ్రగణ్యుడవు. పరమశివుని భార్య సతీదేవిచే సర్వదా సన్నుతి చేయబడుతుండే నామం గలవాడవు.

up-arrow (5) 10.1-1089-క.

రాలతోడను రాసము
రామానుజుఁ డాడఁ జూచి రాగిల్లి మనో
రాములమీఁద వియచ్చర
రాలు మూర్ఛిల్లిపడిరి రామవినోదా!
భావము:- రాజయోగివి అయిన పరీక్షిత్తు! గోవిందుడు గోపికలతో రాసలీల జరుపుతుండగా చూసి, కామపీడితులై గగనచర భామినులు పారవశ్యంతో తూలి సోలి తమ తమ ప్రాణేశ్వరుల మీదకు వాలిపోయారు.
(రామవినోదుల కోసమట ఈ పద్యం. రామ తారక మంత్ర అనుప్రాసతో ఈ పద్యం ప్రతి పాదంలో అలంకరించారు మన పోతనామాత్యులు. హాయిగా ఆస్వాదించి వినోదించండి రామవినోదుల్లారా! గోపికలను బాలజ్ఞానులు అనుకుంటే, వారిలో రామలు ఇక్కడ పరతత్వంలో రమిస్తున్నవారట. వారితో పరబ్రహ్మ స్వరూపుడు కృష్ణుడు బ్రహ్మరసక్రీడ జరుపుతుంటే. ఖేచరరామలు అయిన సిద్ధిపొందిన జ్ఞానులు ఆకాశమంత ఉన్నత స్థాయిలో వారు ఆనందపారవశ్యం పొందారట. పొంది మనోరాములు బ్రహ్మజ్ఞానుల సత్సాంగత్యం వైపు మరలారట.)

up-arrow (6) 2-160-క.

రామున్ మేచకజలద
శ్యామున్ సుగుణాభిరాము ద్వైభవసు
త్రామున్ దుష్టనిశాటవి
రాముం బొమ్మనియెఁ బంక్తిథుఁ డడవులకున్.
భావము:- నల్లని మేఘఛాయతో మెరిసిపోతు ఉండే వాడు, సర్వసుగుణాలతో ఒప్పి ఉండే వాడు, ఐశ్వర్యంతో ఇంద్రునికి సాటివచ్చే వాడు, దుష్టులైన రాక్షసులను చెండాడెడి వాడు అయిన శ్రీరామచంద్రుడిని దశరథుడు అడవులకు పొమ్మన్నాడు.

up-arrow (7) 10.1-773-శా.

రావే సుందరి! యేమె బోటి! వినవే; రాజీవనేత్రుండు బృం
దావీధిం దగ వేణు వూఁదుచు లసత్సవ్యానతాస్యంబుతో
భ్రూవిన్యాసము లంగుళీ క్రమములుంబొల్పార షడ్జంబుగాఁ
గావించెన్ నటుభంగి బ్రహ్మమగు దద్గాంధర్వ సంగీతమున్.
భావము:- ఓ చక్కదనాల చిన్నదాన! ఇలారావే. ఏమే వింటున్నావా. బృందావన వీధిలో పద్మాక్షుడు మన శ్రీకృష్ణుడు వేణువు ఊదుతూ ఎడమవైపుకు వంచిన ముఖంతో కనుబొమలాడిస్తూ వేణువుపై వేళ్ళవిన్యాసాలు వెలయిస్తూ నటునివలె షడ్జమస్వరంలో బహ్మగాంధర్వగీతాన్ని ఆలపిస్తున్నాడు.
అని బృందావనంలో కృష్ణుడు మన్మథోద్దీపితంగా వాయిస్తున్న మురళీగాన లోలులైన గోపికలు ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటున్నారు. అసలే బృందావనం బాగా పెద్దది, అతిశ్రేష్ఠమైనది, బహుమనోహరమైనది. శ్రీకృష్ణభగవానుల ఆకర్షణ చాలా ఎక్కువ, ఆలపిస్తున్నది పరబ్రహ్మం తానైన గాంధర్వగీతం, అది మనస్సును మథించి ఉద్దీపితం చేసేది, మరి గోపికలు (గో (జ్ఞానం) ఓపిక ఎక్కు వున్నవాళ్ళుట. మరి వేగిరపాటు సహజమే కదా.

up-arrow (8) 10.1-1462-శా.

రోలంబేశ్వర! నీకు దౌత్యము మహారూఢంబు; నీ నేరుపుల్
చాలున్; మచ్చరణాబ్జముల్ విడువు మస్మన్నాథపుత్రాదులన్
లీలం బాసి పరంబు డించి తనకున్ లీనత్వముం బొందు మ
మ్మేలా పాసె విభుండు? ధార్మికులు మున్నీ చందముల్ మెత్తురే.
భావము:- ఓ తుమ్మెదలరాయుడా! రాయబారం నడపటంలో నీవు చాల గడసరివేలే. నీ నేర్పులు ఇకచాలు. మా చరణపద్మాలను వదలిపెట్టు. మా భర్త, పుత్రాదులను చులకన చేసి పరిత్యజించి, సద్గతిమాట తలపెట్టక తనతో లీనమై ఉన్న మమ్మల్ని ప్రభువు ఎందుకు విడిచిపెట్టాడు? ఇలాంటి వర్తనలు ధర్మాత్ములు మెచ్చుకుంటారా?

up-arrow (9) 10.1-1726-శా.

"గ్నం బెల్లి; వివాహముం గదిసె నేలా రాఁడు గోవిందుఁ? డు
ద్విగ్నం బయ్యెడి మానసంబు వినెనో వృత్తాంతమున్? బ్రాహ్మణుం
గ్నిద్యోతనుఁ డేటికిం దడసె? నా త్నంబు సిద్ధించునో?
గ్నంబై చనునో? విరించికృత మెబ్భంగిన్ బ్రవర్తించునో?
భావము:- “నా మనసు ఉద్విగ్నంగా ఉంది. లగ్నం రేపే. ముహుర్తం దగ్గరకు వచ్చేసింది. వాసుదేవుడు ఇంకా రాలేదు ఎందుకో? నా మాట విన్నాడో లేదో? బ్రాహ్మణుడు అగ్నిద్యోతనుడు ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు? నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో? బ్రహ్మదేవుడు ఏం రాసిపెట్టాడో? – (అంటు రుక్మిణి డోలాయమాన మనసుతో సందేహిస్తోంది.)

up-arrow (10) 10.1-1131-మ.

నా! యేటికి తెల్లవాఱె? రవి యేలా తోఁచెఁ బూర్వాద్రిపైఁ?
కాలంబు నహంబు గాక నిశిగాఁ ల్పింపఁ డా బ్రహ్మ దా
ఱేఁడుం గృపలేఁడు; కీరములు దుర్వారంబు; లెట్లోకదే;
దే మాపటికాల మందు మనకుం గంజాక్షు సంభోగముల్.
భావము:- ఓ విలాసవతీ! ఎందుకు తెలవారిందే? తూర్పుకొండ మీద భానుడు ఎందుకు ఉదయించాడే? ఉన్న పగళ్ళన్నీ ఎప్పటికీ తెలవారని రాత్రిళ్ళుగా బ్రహ్మదేవు డెందుకు చేయడే? మన్మథుడు కూడా మరీ కరుణమాలినవాడు అయిపోయాడు. చిలుకలను వారించేవారే లేరు. ఎలాగమ్మా ఈ పగలు వేగించడం? మళ్ళీ రాత్రి అవుతుందా? పద్మాక్షుడితో ఆనందించే అదృష్టం లభిస్తుందా?
కృష్ణవిరహదుఃఖంతో ఓపికలులేక ఇళ్లల్లో వేగిపోతూ ఉన్న గోపికలలో ఒకామె తన స్నేహితురాలి దగ్గర ఇలా విలపిస్తోంది. తెల్లవారటం అంటే బ్రహ్మానందం పొందే సమాధి స్థితికి విఘ్నం కలిగి మెళకువ అనుకుంటే, ‘ఇంద్రియాణాం మనశ్చాస్మి’ అని గీత కనుక రవి అంటే మనస్సు అనుకుంటే, పూర్వాద్రిలో పూర్వ అంటే సమాధి నిండుగా పూర్తికాక ముందే అని, అద్రి అంటే ఈ దేహం అనుకుంటే, మనస్సు తోచటం అంటే తెల్లవారటం అనుకోవచ్చు. అహము అంటే సంసార సంపాదనకై సంచారం చేసే పగలు అనుకుంటే నిశి అంటే నిర్వికల్ప స్థితిలో ఉండే సమయం రాత్రి అనుకుంటే. పగళ్ళు వద్దు రాత్రే కావాలి అనటం. ‘బుద్ధిః తాం మంథాతీతీ మన్మథః ’ అని వ్యుత్పత్తి. ఆ మన్మథుడు మనసుని బ్రహ్మజ్ఞానం తెలుసుకోమని మథించేస్తున్నాడుట, పోని సంసార లంపటంలో పడుతున్నాడు పడనీ అని జాలిపడకుండా. చిలకలు అంటే సమాధి కుదరకుండా చెదరగొట్టే బాహ్యాభ్యంతరంలో ‘తియ్యగా అనిపించే శబ్దప్రపంచం’ అనుకుంటే. దానిని ఆపే నాథుడు లేడని విసుగు కలుగుతోంది అనుకోవచ్చు. మాపటివేళ అంటే మళ్ళీ బ్రహ్మజ్ఞానం స్పురించే సమాధిలో ఉండే సమయం. కంజాక్షుడు బ్రహ్మజ్ఞానమే చూపుగా కల ఆ పరబ్రహ్మతో కూడుట ఎప్పటికి లభిస్తుంది అని ఆత్రుతగా ఉంది అనుకోవచ్చు. అందుకని తనను లాలించే తన స్నేహితురాలు అయిన తల్లి అయిన గురువుకి చెప్పుకుంటోంది.

up-arrow (11) 1-22-మ.

లితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జుతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.
భావము:- బ్రహ్మదేవుడికైన పరమశివునికైన భాగవతమును తెలిసి పలుకుట చిత్రమైనట్టి శ్రీమద్భాగవతం కల్పవృక్షంతో సాటిరాగలిగి ప్రకాశించేది. ఏమాత్రం సందేహం లేదు. దీనిని రెండు రకాల అన్వయార్థాలు గల పదప్రయోగాలతో ఇలా వివరించారు. కల్పవృక్షం కొమ్మలతో మనోజ్ఞ మైంది అయితే భాగవతం స్కంధాలనే 12 భాగాలతో లలిత మనోహర మైనది. కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్ళు కలది అయితే భాగవతానికి మూలం భగవాను డైన శ్రీకృష్ణుడుగా కలది. కల్పవృక్షం చిలుకల పలుకలతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది, అలాగే భాగవతం శుకమహర్షి మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది. కల్పవృక్షం అందమైన పూల తీగలచే అలంకరింప బడినది, మరి భాగవతం మనోహర మైన వాక్కులుతో అలరారేది. కల్పవృక్షం మంచి రంగురంగుల పూలతో శోభిల్లు తుంటుంది, అదేవిధంగా భాగవతం అక్షర సార్థక మై సజ్జనుల మనసులు అలరించేది. కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తు గుండ్రంగా ఉంటుంది, అదే మరి భాగవతమో సుందరము ఉజ్వలము అయిన చక్కటి పద్య వృత్తాలు గలది. కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాల నైనా అందిస్తుంది, అయితే భాగవతం కైవల్యాది కామిత ప్రయోజనాలు సర్వం సమకూర్చేది. కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలత గల మాను కలిగినది, అలాగే భాగవతం స్వచ్ఛమైన వ్యాస కృత వ్యాసాలతో నిండినది. కల్పవృక్షం స్వర్గంలో విలసిల్లు తుంది, మరి భాగవతమో భూలోకంలో విరాజిల్లుతోంది. కల్పవృక్షం శుక పికాది పక్షులకు సైతం శ్రేయస్కర మైనది, అదే భాగవతం అయితే ఉత్తములకు సద్బ్రాహ్మణులకు శ్రేయోదాయక మైనది.

up-arrow (12) 10.1-366-క.

లానమున బహుదోషము
లోలిం బ్రాపించుఁ దాడనోపాయములన్
జా గుణంబులు గలుగును
బాలురకును దాడనంబ థ్యం బరయన్.
భావము:- గారాబం మరీ ఎక్కువ చేస్తే పిల్లలు చివరికి చెడిపోతారు. అప్పుడప్పుడు తగలనిస్తుంటే మంచి గుణాలు అలవడతాయి. పిల్లల మితిమీరే అల్లరికి చక్కటి ఔషధం దండోపాయం.
“దండం దశగుణ భవేత్" అంటారు కదా.
“శ్లో.| లాలనాద్బహవో దోషాన్తాడనాద్బహవో గుణాః|
తస్మాత్పుత్రం చ శిష్యం చ తాడయేన్నతులాలయేత్ఛ||"
అని ఒక నీతిశాస్త్ర బోధ.

up-arrow (13) 10.2-172-క.

"లేమా! దనుజుల గెలువఁగ
లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా
లే మాను మాన వేనిన్
లే మా విల్లందికొనుము లీలం గేలన్. "
భావము:- “భామా! మేము రాక్షసులను గెలువలేమా? నీ వెందుకు యుద్ధానికి సిద్ధపడ్డావు? ఇలా రా! యుద్ధ ప్రయత్నం మానుకో. మాననంటావా, అయితే విలాసంగా నీ చేత్తో ఈ విల్లందుకో!"
నరకాసుర వధ ఘట్టంలో శ్రీ కృష్ణుడు సత్యభామతో పలికిన పలుకులివి. పద్యం నడక, “లేమా" అనే అక్షర ద్వయంతో వేసిన యమకాలంకారం అమోఘం. చమత్కార భాషణతో చేసిన యిద్దరి వ్యక్తిత్వాల పోషణ ఎంతో బావుంది. సత్యభామ రణకౌశల ప్రదర్శనకు ముందరి దొకటి వెనుకటి దొకటి వేసిన జంట పద్యాలా అన్నట్లు ఉంటుంది “10.2-187-క. కొమ్మా…" పద్యం. ఒకే హల్లు మరల మరల వేస్తే వృత్యనుప్రాస, రెండు అంతకన్న ఎక్కువ హల్లులు అర్థబేధంతో అవ్యవధానంగా వేస్తే ఛేక. శబ్ద బేధం లేకుండా అర్థ బేధంతో మరల మరల వేస్తే యమకం. అవ్యవధానంగా రెండు అంత కన్నా ఎక్కువ హల్లులు అర్థబేధం శబ్దబేధం లేకుండా తాత్పర్య బేధంతో వేస్తే లాట.

up-arrow (14) 8-75-క.

లోకంబులు లోకేశులు
లోస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.
భావము:- లోకాలు, లోకాలను పాలించేవారు, లోకాలలో ఉండేవారు అందరు నశించిన అనంతరం; ఆ కారు చీకట్లకు ఆవతల అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను.

up-arrow (15) 10.1-1709-సీ.

"లోపలి సౌధంబులోన వర్తింపంగఁ;
దేవచ్చునే నిన్నుఁ దెత్తునేని
గావలివారలఁ ల బంధువులఁ జంపి;
కాని తేరా" దని మలనయన!
భావించెదేని యుపాయంబు చెప్పెద;
నాలింపు కులదేవయాత్రఁ జేసి
గరంబు వెలువడి గజాతకును మ్రొక్కఁ;
బెండ్లికి మునుపడఁ బెండ్లికూఁతుఁ
10.1-1709.1-తే.
నెలమి మావారు పంపుదు రేను నట్లు
పురము వెలువడి యేతెంచి భూతనాథు
తికి మ్రొక్కంగ నీవు నా మయమందు
చ్చి కొనిపొమ్ము నన్ను నవార్యచరిత!
భావము:- ఓ కమలాల వంటి కన్నులున్న కన్నయ్యా! “నీవు కన్యాంతఃపురంలో ఉంటావు కదా రుక్మిణీ ! నిన్ను ఎలా తీసుకుపోవాలి. అలా తీసుకెళ్ళాలంటే కాపలావాళ్ళను, అప్పు డక్కడ ఉన్న మీ బంధుజనాలను చంపాల్సివస్తుంది కదా" అని నీవు అనుకుంటే, దీనికి ఒక ఉపాయం మనవిచేస్తాను. చిత్తగించు. పెళ్ళికి ముందు మా వారు పెళ్ళికూతురును మా ఇలవేల్పు మంగళగౌరిని మొక్కడానికి పంపిస్తారు. నేను కూడ అలాగే నగరి వెలువడి మొక్కుచెల్లించడానికి ఊరి వెలుపల ఉన్న దుర్గగుడికి బయలుదేరి వస్తాను. అడ్డగింపరాని నడవడిక కలవాడా! కృష్ణా! ఆ సమయానికి దారికి అడ్డంగా వచ్చి నన్ను నిరాటంకంగా తీసుకొనిపో!

up-arrow (16) 10.1-1756-క.

"వచ్చెద రదె యదువీరులు
వ్రచ్చెద రరిసేన నెల్ల వైరులు పెలుచన్
నొచ్చెదరును విచ్చెదరును
చ్చెదరును నేఁడు చూడు లజాతాక్షీ!"
భావము:- ఇలా చకితహరిణేక్షణ యై ఆమె కృష్ణుని చూడగా “కమలనయనా! రుక్మిణీదేవి! కంగారు పడకు. యాదవ శూరులు వస్తారు. శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడతారు. పగవారు బాగా నష్టపోతారు, ఓడి చెల్లాచెదరౌతారు, చచ్చిపోతారు చూస్తుండు." ఊరడించసాగాడు.

up-arrow (17) 8-550-మ.

చేలంబులొ మాడలో ఫలములో న్యంబులో గోవులో
రులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
రులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ణీ ఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా! "
భావము:- ఓ బ్రాహ్మణోత్తముడా! నీకేం కావాలో కోరుకో. మేలైన వస్త్రములా, డబ్బులా, పండ్లా, అడవి సంపదలా, గోవులా, గుఱ్ఱములా, రత్నాలా, రథాలా, మంచి ఆహారాలా, కన్యలా, ఏనుగులా, బంగారమా, భవనాలా, గ్రామాలా, పొలాలా, భూభాగాలా లేకపోతే ఇవి కాకుండా ఇంకేమైనా కోరుకుంటున్నావా?

up-arrow (18) 8-570-మ.

సుధాఖండము వేఁడితో? గజములన్ వాంఛించితో? వాజులన్
వెనూహించితొ? కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో?
సి బాలుండవు; నేర వీ వడుగ; నీ భాగ్యంబు లీపాటి గా
సురేంద్రుండు పదత్రయం బడుగ నీ ల్పంబు నీ నేర్చునే? "
భావము:- “భూభాగం కోరుకోవాలి లేదా ఏనుగులు కోరుకోవాలి లేదా గుఱ్ఱాలను కోరాలి లేదా అందగత్తెలను చూసి కాంక్షపుడితే జవరాండ్రను కోరుకోవాలి; కాని చిన్నపిల్లాడివి కదా అడగటం తెలియదు; నీ సిరి / సామర్థ్యం ఇంత అల్పమైందే. కనుకే మూడడుగులు మాత్రమే అడిగావు; ఐనా ఇంతటి రాక్షస చక్రవర్తిని ఇంత అల్పం ఎలా ఇస్తాను. "
అని అంటున్నాడు బలిచక్రవర్తి మూడడుగుల మేర దానం అడిగిన వామనునితో.

up-arrow (19) 1-421-ఉ.

వావియైన గడ్డిఁ దిని వాహిను లందు జలంబు ద్రావఁగా
నీ రణంబు లెవ్వఁ డిటు నిర్దళితంబుగఁ జేసె వాఁడు దా
ఖేరుఁడైన, వాని మణి కీలిత భూషణ యుక్త బాహులన్
వేని త్రుంచివైతు వినువీథికి నేగిన నేల డాఁగినన్."
భావము:- నోటికి రుచించిన గడ్డి పరకలు తిని, కాలవల్లో నీళ్ళు తాగి బతికే సాధు జీవివైన నీ పాదాలను ఇలా ఎవడు నరికేసాడు. వాడెవడైనా సరే వాడు భూమ్మీద తిరిగే వాడైనా, ఆకాశంలో తిరిగే వాడైనా సరే వాడి చేతులు మణికంకణాదులు అలంకరించుకొనేంత గొప్పవైతే వాటితో సహా నరికి పారేస్తాను. వాడిని వదలను. వాడు నింగికి ఎగిరిపోయినా, నేలలో దూరిపోయినా సరే వదలనే వదలను."
(భూదేవి ధర్మదేవతలు గో వృషభ రూపాలలో ఒక చోట గడ్డి మేస్తున్నాయి. కలికాలం ప్రవేశించటం వల్ల, ఇద్దరు దీనంగా ఉన్నారు. పైగా ధర్మదేవత ఒంటికాలిమీద ఉంది. ఇంతలో కలిపురుషుడు వచ్చి ఇద్దరిని చితక తన్నుతున్నాడు. పరీక్షిత్తు విధివశాత్తు ఇదంతా చూసాడు. కోపంతో కలిని నిగ్రహిస్తు, గో వృషభ రూపులను ఓదారుస్తు, వృషభ రూపునితో ఇలా అంటున్నాడు.)

up-arrow (20) 1-211-ఉ.

వాయువశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం
బాయుచు నుండుకైవడిఁ బ్రపంచము సర్వముఁ గాలతంత్రమై
పాయుచుఁ గూడుచుండు నొకభంగిఁ జరింపదుకాల మన్నియుం
జేయుచుఁ నుండుఁ గాలము విచిత్రముదుస్తర మెట్టివారికిన్.
భావము:- ఆకాశంలోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం కలుసుకుంటూ, విడిపోతూ ఉంటాయి. అలానే ఈ ప్రపంచంలోని ప్రాణికోటి సమస్తం కాలం యొక్క అల్లిక వల్ల కూడుతూ, విడిపోతూ ఉంటాయి. కాలం ఎప్పడూ ఒకేలా జరగదు. జీవికి స్వేచ్చ అనేది లేదు. కాలమే అన్నింటికీ మూలం. కాలం చాలా విచిత్రమైంది. ఎంతటి వారైనా ఈ కాల ప్రభావాన్ని దాటలేరు.

up-arrow (21) 1-463-ఆ.

వారిఁ గోరుచున్నవారికి శీతల
వారి యిడుట యెట్టివారికయిన
వారితంబుగాని లసిన ధర్మంబు
వారి యిడఁడు దాహవారి గాఁడు."
భావము:- దాహంతో నోరెండి పోయి వాకిట్లోకి వచ్చి మంచినీళ్ళు అడిగిన అతిథికి, చల్లని మంచినీళ్ళు ఇవ్వటం ఎటువంటి వారికి అయినా సరే కాదనరాని కనీస కర్తవ్యమే. కాని ఇతడు మంచినీళ్ళు ఇవ్వటంలేదు, దాహం తీర్చటం లేదు."
దాహంతో అల్లాడిపోతూ పరీక్షిత్తు నీ ళ్ళడిగితే ధ్యానంలో ఉన్న శమీకమహర్షి స్పందించ లేదు. అది గమనించక ఉక్రోషంతో పరీక్షిన్మహారాజు మరోలా అనుకుంటున్నాడు.

up-arrow (22) 10.1-312-క.

వా రిల్లు చొచ్చి కడవలఁ
దోరంబగు నెయ్యిఁ ద్రావి తుది నా కడవల్
వీరింట నీ సుతుం డిడ
వారికి వీరికిని దొడ్డ వా దయ్యె సతీ!
భావము:- ఓ యిల్లాలా! మీ సుపుత్రుడు వాళ్ళింట్లోకి దూరి ఘమఘమలాడే నె య్యంతా తాగేసి, చివరకి ఆ కుండలు వీళ్ళింట్లో పడేసి పోయాడు. దాంతో వాళ్ళకీ వీళ్ళకీ పెద్ద గొడవ అయిపోయింది తెలుసా?

up-arrow (23) 1-2-ఉ.

వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్, దయా
శాలికి, శూలికిన్, శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్,
బా శశాంక మౌళికిఁ, గపాలికి, మన్మథ గర్వ పర్వతో
న్మూలికి, నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్.
భావము:- అనంత లీలాతాండవలోలు డైన పరమ శివునికి, మిక్కిలి దయ గలవానికి, త్రిశూల ధారికి, పర్వతరాజ పుత్రి పార్వతీదేవి యొక్క ముఖ పద్మం పాలిటి సూర్యునికి, తలపై నెలవంక ధరించిన వానికి, మెడలో పుఱ్ఱెల పేరు ధరించిన వానికి, మన్మథుడి గర్వం సర్వం అణిచేసిన వానికి, నారదాది మునుల మానస సరోవరాలలో విహరించే వానికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను.

up-arrow (24) 10.1-34-మత్త.

వావిఁ జెల్లెలు గాని పుత్రికవంటి దుత్తమురాలు; సం
భానీయచరిత్ర; భీరువు; బాల; నూత్నవివాహ సు
శ్రీవిలాసిని; దీన; కంపితచిత్త; నీ కిదె మ్రొక్కెదం;
గావే; కరుణామయాత్మక; కంస! మానవవల్లభా!
భావము:- ఓ కంసమహారాజా! నువ్వు దయామయుడవు. ఈ దేవకి ఏదో వరసకి చెప్పడానికి నీకు చెల్లెలు కాని నీకు కూతురు వంటిది. చాలా మంచిది. గౌరవించదగ్గ ప్రవర్తన కలది. భయస్తురాలు. కొత్త పెళ్ళికూతురు. మంచి లక్ష్మీకళ ఉట్టిపడుతున్నది. దీనురాలు. భయంతో లోలోన వణికిపోతూ ఉంది. ఇదిగో నీకు మ్రొక్కుతున్నాను, ఈమెను కాపాడవయ్యా!