పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుని భిక్ష కోరు మనుట

  •  
  •  
  •  

8-550-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చేలంబులొ మాడలో ఫలములో న్యంబులో గోవులో
రులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
రులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ణీ ఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా! "

టీకా:

వర = మంచి; చేలంబులో = బట్టలుకాని; మాడలో = సువర్ణ నాణెములుకాని {మాడ - అరవరహా, ఒక సువర్ణనాణెము}; ఫలములో = పళ్ళుకాని; వన్యంబులో = వనములుకాని; గోవులో = ఆవులుకాని; హరులో = గుఱ్ఱములుకాని; రత్నములో = మణులుకాని; రథంబులో = రథములుకాని; విమృష్టాన్నంబులో = మంచిఆహారములుకాని; కన్యలో = స్త్రీలుకాని; కరులు = ఏనుగులుకాని; కాంచనమో = బంగారముకాని; నికేతనములో = ఇళ్శుకాని; గ్రామంబులో = ఊళ్ళుకాని; భూములో = పొలములుకాని; ధరణీఖండమో = భూభాగముకాని; కాక = కాకపోతే; ఏమి = ఏది; అడిగెదో = అడిగెదవు; ధాత్రీసుర = బ్రాహ్మణ; ఇంద్ర = శ్రేష్ఠులలో; ఉత్తమా = ఉత్తముడా.

భావము:

ఓ బ్రాహ్మణోత్తముడా! నీకేం కావాలో కోరుకో. మేలైన వస్త్రములా, డబ్బులా, పండ్లా, అడవి సంపదలా, గోవులా, గుఱ్ఱములా, రత్నాలా, రథాలా, మంచి ఆహారాలా, కన్యలా, ఏనుగులా, బంగారమా, భవనాలా, గ్రామాలా, పొలాలా, భూభాగాలా లేకపోతే ఇవి కాకుండా ఇంకేమైనా కోరుకుంటున్నావా?”