పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : వాసుదే వాగమన నిర్ణయము

  •  
  •  
  •  

10.1-1726-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"గ్నం బెల్లి; వివాహముం గదిసె, నేలా రాఁడు గోవిందుఁ? డు
ద్విగ్నం బయ్యెడి మానసంబు; వినెనో వృత్తాంతమున్? బ్రాహ్మణుం
గ్నిద్యోతనుఁ డేటికిం దడసె? నా త్నంబు సిద్ధించునో?
గ్నంబై చనునో? విరించికృత మెబ్భంగిన్ బ్రవర్తించునో?

టీకా:

లగ్నంబున్ = ముహూర్తము; ఎల్లి = రేపు; వివాహమున్ = పెండ్లిసమయము; కదిసెన్ = దగ్గరైనది; ఏలా = ఎందుకు; రాడు = రాలేదు; గోవిందుడు = కృష్ణుడు {గోవిందుడు - గోవులకు ఒడయుడు, కృష్ణుడు}; ఉద్విగ్నంబు = కలవరపడినది; అయ్యెడిన్ = అగుచున్నది; మానసంబున్ = మనస్సు; వినెనో = విన్నాడో లేదో; వృత్తాంతమున్ = సమాచారమును; బ్రాహ్మణుండు = విప్రుడు; అగ్నిద్యోతనుడు = అగ్నిద్యోతనుడు; ఏటికి = ఎందుచేత; తడసెన్ = ఆలస్యము చేసెను; నా = నా యొక్క; యత్నంబున్ = ప్రయత్నము; సిద్ధించునో = ఫలించునో లేదో; భగ్నంబై = చెడిపోయినది; ఐచనునో = అయిపోవునేమో; విరించి = బ్రహ్మదేవుని {విరించి - వివరముగా రచించువాడు, బ్రహ్మ}; కృతము = వ్రాసిపెట్టినది; ఎబ్భంగి = ఏ విధముగ; ప్రవర్తించునో = నడచునో.

భావము:

“నా మనసు ఉద్విగ్నంగా ఉంది. లగ్నం రేపే. ముహూర్తము దగ్గరకు వచ్చేసింది. వాసుదేవుడు ఇంకా రాలేదు ఎందుకో? నా మాట విన్నాడో లేదో? బ్రాహ్మణుడు అగ్నిద్యోతనుడు ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు? నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో? బ్రహ్మదేవుడు ఏం రాసిపెట్టాడో? – (అంటు రుక్మిణి డోలాయమాన మనసుతో సందేహిస్తోంది.)