పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అమృతగుళికలు : పగడాలు


భాగవత పద్యపగడాలు

పద్య సూచిక;-
ఘన సింహంబుల కీర్తి ; ఘను లాత్మీయ తమోనివృత్తికొఱకై ; చండ దోర్దండలీల భూమండలంబు ; చందనాదుల నాఁకట స్రగ్గువాఁడు ; చని చని తొంటి మత్స్యకురుజాంగలభూము ; చను నీకు గుడుపఁజాలెడి ; చనుదెంచెన్ ఘనుఁ డల్లవాఁడె ; చన్ను విడిచి చనఁ డిట్టటు ; చలమున నను డాసి జలరాశిఁ జొరరాదు ; చిక్కఁడు వ్రతములఁ గ్రతువుల ; చిత్రముగ భరత లక్ష్మణ శత్రుఘ్నుల ; చుంచొదువుఁ బాలు ద్రావు ; నిరయంబైన, నిబంధమైన ; నిరయమునకుఁ బ్రాప్త నిగ్రహమునకును ; నీ పద్యావళు లాలకించు చెవులున్ ; నీరాట వనాటములకుఁ ; నీలగళాపరాధి యగు నీకుఁ ; నీలోన లేని చోద్యము ; నీ వారము ప్రజలేమును ; నుతచరితులార! మీరలు ; నూతన గరళస్తని యగు ; పంకజముఖి నీ ళ్ళాడఁను ; పంచబాణుని నీఱు సేసిన ; పడఁతీ! నీ బిడ్డడు ;

up-arrow (1) 10.1-1752-మ.

" సింహంబుల కీర్తి నీచమృగముల్ గైకొన్న చందంబునన్
కీర్తుల్ గొని బాలఁ దోడ్కొనుచు నున్మాదంబుతో గోపకుల్
నుచున్నా రదె; శౌర్య మెన్నటికి? మీ స్త్రాస్తముల్ గాల్పనే?
నుమధ్యన్ విడిపింపమేని నగరే ధాత్రీజనుల్ క్రంతలన్."
భావము:- "గొప్ప గొప్ప సింహాల పరువు నీచమైన జంతువులు తీసేసినట్లు, మన పరువు తీసి కృష్ణుడు రుక్మిణీ పడతిని పట్టుకు పోతున్నాడు. అదిగో చూడండి, గొల్లలు ఉద్రేకంగా పారిపోతున్నారు. రాకుమారిని విడిపించ లేకపోతే మన పరాక్రమా లెందుకు. మన అస్త్రశస్త్రా లెందుకు దండగ. లోకులు నవ్వరా." అని జరాసంధాదులు తమలో తాము హెచ్చరించుకోసాగారు.

up-arrow (2) 10.1-1710-మ.

ను లాత్మీయ తమోనివృత్తికొఱకై గౌరీశుమర్యాద నె
వ్వని పాదాంబుజతోయమందు మునుఁగన్ వాంఛింతు రే నట్టి నీ
నుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూఱుజన్మంబులున్
నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబ, ప్రాణేశ్వరా!
భావము:- జీవితేశ్వరా! నాథా! పార్వతీపతి పరాత్పరుని పాదపద్మాల యందు ప్రభవించిన పవిత్ర గంగాజలాలలో ఓలలాడుతుంటాడు. మహాత్ములు అజ్ఞానరాహిత్యం కోరి, శంకరుని వలెనే, ఆ పరాత్పరుని పదజనిత గంగాజలాలలో ఓలలాడాలని కోరుతుంటారు. అటువంటి తీర్థపాదుడ వైన నీ అనుగ్రహాన్ని అందుకొని మనలేని ఎడల, బ్రహ్మచర్యదీక్షా వ్రతనిష్ఠ వహించి వంద జన్మలు కలిగినా సరే, నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ, తప్పక నా ప్రాణాలు నీకే అర్పిస్తాను సుమా!
రుక్మిణీ సందేశంలోని సుమథురమైన పద్యరాజం యిది. భాగవతమే మహా మహిమాన్వితం, అందులో రుక్మిణీ కల్యాణం మహత్వం ఎవరికైనా చెప్పతరమా. – ఆత్మేశ్వరా! పరమాత్మా! ఆత్మజ్ఞాన సంపన్నులు కూడ తమ హృదయాలలోని అవశిష్ఠ అజ్ఞానాంధకార నివారణ కోసం సాత్వికగుణం అభివృద్ధి చేసి తమోగుణం గ్రసించే బ్రహ్మవేత్త లాగ ఏ పరబ్రహ్మ అనే పవిత్ర జ్ఞాన గంగలో లయం కావాలని కోరతారో అట్టి పరబ్రహ్మతో ఈ జన్మలో ఉపరతి జెందలేనిచో ఎన్ని జన్మ లైనా పట్టుబట్టి విడువ కుండా మళ్ళీ మళ్ళీ మరణించే దాకా తపిస్తూనే ఉంటాను అంటున్నది రుక్మిణి అనే జీవాత్మ.

up-arrow (3) 4-505-తే.

చండ దోర్దండలీల భూమండలంబు
మతలంబుగఁ జేసి శశ్వత్ప్రసిద్ధి
నొంది యవ్విభుఁ డీ లోకమందు నెల్ల
ప్రజకుఁ దండ్రియు జీవనప్రదుఁడు నగుచు.
భావము:- పృథుచక్రవర్తి తన భుజబలంతో నేలంతా సమతలంగా చేసాడు. ఆ ప్రభువు తండ్రి యై ప్రజలకు బ్రతుకు తెరువు కల్పించాడు, శాశ్వత మైన యశస్సు గడించాడు.

up-arrow (4) 1-279-తే.

చందనాదుల నాఁకట స్రగ్గువాఁడు
నివి నొందని కైవడి ర్మసుతుఁడు
సంపదలు పెక్కు గలిగియుఁ క్రిపాద
సేవనంబులఁ పరిపూర్తి సెందకుండె.
భావము:- మంచి గంధం లాంటి శృంగార ద్రవ్యాలు ఎన్ని ఉన్నా ఆకలితో అల్లాడే వాడు తిండి కోసం ఎంతో ఆతృతతో ఉంటాడు. కౌరవులను ఓడించి ధర్మరాజు సమస్త రాజ్య సంపదలు పొందాక కూడ, శ్రీకృష్ణ భగవానుని ఎంత సేవిస్తున్నా, ఇంకా సేవించాలని ఎంతో ఆతృత కలిగి ఉన్నాడుట.

up-arrow (5) 3-46-చ.

ని చని తొంటి మత్స్యకురుజాంగలభూము లతిక్రమించి చ
య్య యమునానదిం గదిసి చ్చట భాగవతున్ సరోజలో
దృఢభక్తు సద్గుణవిశారదు శాంతుని దేవమంత్రి శి
ష్యుని మహితప్రసిద్ధుఁ బరిశోషితదోషుఁ బ్రబుద్ధు నుద్ధవున్.
భావము:- అలాగ వెళ్ళివెళ్ళి మత్స్య, కురు, జాంగల భూములను అతిక్రమించి అనంతరం యమునా నదిని సమీపించాడు. ఆ నదీతీరంలో పరమభాగవతుడు, శ్రీకృష్ణుని మీద అఖండమైన భక్తిగలవాడు. ఉత్తమగుణ సంపన్నుడు, శాంతుడు, రాజనీతిలో బృహస్పతి శిష్యుడు, మిక్కిలి యశస్సు కలవాడూ, దోషశూన్యుడు, మహాజ్ఞాని అయిన ఉద్ధవుణ్ణి దర్శించాడు.

up-arrow (6) 10.1-220-క.

"చను నీకు గుడుపఁజాలెడి
నువారలు లేరు; నీవు నవలె" ననుచుం
నుఁగుడుపి మీఁద నిలుకడఁ
నుదాన ననంగ వేడ్కఁ నుఁ జనుఁ గుడుపన్.
భావము:- బాలకృష్ణుని వద్దకు వస్తున్న శిశుహంతకి పూతన “నీకు చనుబాలు (చనుట) పట్టించ గల నేర్పరులు ఎవరు లేరయ్య. ఇంక నువ్వు పోవాలి." అని లాలించింది. నీకు చనుబాలు (చనుట) పట్టించి అటుపిమ్మట మెల్లగా (తప్పక) పోతాలే (చనిపోతాలే) అంటున్నట్లు ఉత్సాహంతో స్తన్యం ఇవ్వడానికి బయలుదేరింది.

up-arrow (7) 8-107-మ.

నుదెంచెన్ ఘనుఁ డల్లవాఁడె; హరి పజ్జం గంటిరే లక్ష్మి? శం
నినాదం బదె; చక్ర మల్లదె; భుజంధ్వంసియున్ వాఁడె; క్ర
న్న యేతెంచె నటంచు వేల్పులు నమోనారాయణాయేతి ని
స్వనులై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం జక్రికిన్.
భావము:- గజేంద్రుని ఆర్తి బాపటానికి ఆరాటంగా ఆకాశంలో వెళ్తున్న శ్రీమహావిష్ణువును చూసి దేవతలు “అదిగదిగో మహనీయుడైన విష్ణుమూర్తి వస్తున్నాడు. అతని వెనుకనే శ్రీమహాలక్ష్మి వస్తున్నది చూడండి. అదిగో పాంచజన్య శంఖధ్వని. సర్పాలను సంహరించేవాడు గరుత్మంతుడు అదిగో చూడండి వెంట వస్తున్నాడు." అనుకుంటు “నారాయణునికి నమస్కారం" అంటు నమస్కారాలు చేస్తున్నారు.

up-arrow (8) 10.1-331-క.

"చన్ను విడిచి చనఁ డిట్టటు
నెన్నఁడుఁ బొరుగిండ్ల త్రోవ లెఱుఁగఁడు నేడుం
న్నులు దెఱవని మా యీ
చిన్ని కుమారకుని ఱవ్వ చేయం దగునే?
భావము:- "మా కన్నయ్య చంటాడు నా ఒళ్ళో కూర్చుండి పాలు తాగుతుండటమే తప్ప నన్ను వదలి ఈ పక్కకి ఆ పక్కకి పోడు. పక్కింటికి కూడ దారి తెలియదు. అలాంటి ఈ నాటికి సరిగా కళ్ళు తెరవడంరాని పసిగుడ్డును ఇలా అల్లరి పెట్టడం మీకు తగినపని కాదు.

up-arrow (9) 10.1-1343-సీ.

లమున నను డాసి లరాశిఁ జొరరాదు;
నిగిడి గోత్రముదండ నిలువరాదు;
కేడించి కుంభిని క్రిందికిఁ బోరాదు;
నుజసింహుఁడ నని లయరాదు;
చేరినఁ బడవైతుఁ జెయి చాపఁగారాదు;
బెరసి నా ముందటఁ బెరుఁగరాదు;
భూనాథ హింసకుఁ బోరాదు నను మీఱి;
శోధింతుఁ గానలఁ జొరఁగరాదు;
10.1-1343.1-ఆ.
ప్రబలమూర్తి ననుచు భాసిల్లఁగారాదు;
రఁ బ్రబుద్ధుఁడ నని ఱుమరాదు;
లికితనము చూపి ర్వింపఁగారాదు;
రముగాదు; కృష్ణ! లఁగు తలఁగు.
భావము:- ఓ కృష్ణా! పౌరుషానికి పోయి నా దగ్గరకి వచ్చేక ఇక వేషాలేసి నాటకాలాడి తప్పించుకు పోడానికి అవకాశం ఉండదు జాగ్రత్త. తర్వాత (మత్స్యావతారంలో లా చేపలా వేషం కట్టి) సముద్రంలోకి పోడానికీ కుదరదు. (కూర్మావతారంలో మంథర పర్వతానికి కింద నిలబడి ఆధారంగా ఉన్నా నని తాబేలు వేషం కట్టి) కొండల దన్ను తీసుకోడానికీ అవ్వదు. (వరహావతారంలో భూమిని ధరించి దాని కిందున్నా కదా అని పంది వేషం కట్టి) తప్పించుకుపోయి భూమి కిందకి దూరడానికీ వీలవదు. (నరసింహావతారం ఎత్తిన వాడిని కదా అని) సింహంలాంటి మగాణ్ణి అన్ని విఱ్ఱవీగడానికీ కుదరదు. (వామనావతారంలో చెయ్యి చాచడం అలవాటే అనుకోకు) దగ్గరకు వస్తే పడదోసేస్తా. ఇక చెయ్యి చాచడానికి కూడ సందుదొరకదు. (త్రివిక్రమావతారం ఎత్తి పెరిగా కదా అని) నా ఎదురుగా పెచ్చుమీరడమూ అలవికాదు. (పరశురామావాతారంలో రాజులను చంపేసా అనుకోకు) నన్ను దాటి రాజుని హింసించడ మన్నది సాధ్యం కాదు. (రామావతారంలో అడవులకు పోయా కదా అని) అవసరమైతే అరణ్యంల్లో దాక్కుంటా అనుకోకు, గాలించి మరీ పట్టుకుంటా. (బలరామావతారం ఎత్తిన) ప్రబలమైన ఆకారం కలవాడను నేనే అని విఱ్ఱవీగడానికీ వీలుండదు. (బుద్ధావతారం ఎత్తిన వాడిని) పుడమిలో నేనే ప్రబుద్ధుణ్ణి అని బెదిరించి తరిమేద్దాం అనీ (కల్కి అవతారం ఎత్తుతా కదా అని) కపటంతో జయించేస్తా అని గర్వించటమూ వీలుకాదు సుమా. నాతో యుద్ధం చేయడం నీ తరంగాదులే, పో కృష్ణా! పారిపో.

up-arrow (10) 7-243-క.

చిక్కఁడు వ్రతములఁ గ్రతువులఁ
జిక్కఁడు దానముల శౌచశీలతపములం
జిక్కఁడు యుక్తిని భక్తిని
జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ!
భావము:- భగవంతుడు గాఢ మైన భక్తికి వశమై నట్లు; నోములు, యగాలు, దానాలు, శుచిత్వాలు, మంచి నడవడికలు, తపస్సులు, యుక్తులు లాంటివి వాటికి వేటికీ వశము కాడు. భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందడానికి సాధనం. భక్తి వినా వేరు మార్గం లేనే లేదు.
దిగజారిపోవడమే లేనట్టి ఉన్నతతమ శాశ్వత స్థితిలో ఉండే భగవంతుడు ఇంకే మార్గంలో పట్టుకుందా మన్నా, బిగించే కొద్దీ వేళ్ళ మధ్యనుండి జారిపోయే నీళ్ళలా జారి పోతుంటాడు. భక్తికి అయితేనే భద్రంగా చిక్కుతాడు.
ఈ పద్యం ఎంతో గొప్పది అని చెప్పవచ్చు. భాగవత తత్వార్థాన్ని చిన్న చిన్న పదాల్లో సిద్దాంతీకరించి భక్తాగ్రేసరు డైన రాక్షసబాలుని నోట ఈ పద్యం రూపంలో ఇలా పలికించాడు పోతన గారు. ప్రహ్లాదుడు సహాధ్యాయులు అయిన రాక్షసబాలురకు తన ప్రపత్తిమార్గ మైన నారదోపదిష్ట భాగవతతత్వాన్ని తెలిపి విష్ణుభక్తి విలక్షణత వివరించాడు.

up-arrow (11) 2-156-క.

చిత్రముగ భరత లక్ష్మణ
త్రుఘ్నుల కర్థి నగ్రన్ముం డగుచున్
ధాత్రిన్ రాముఁడు వెలసెఁ బ
విత్రుఁడు దుష్కృత లతా లవిత్రుం డగుచున్.
భావము:- ఆ శ్రీరామచంద్రునిగా అవతరించాడు. భరత లక్ష్మణ శత్రుఘ్నులకు అన్నగా జన్మించాడు. భూలోకంలో పరమ పవిత్రుడుగా, పాపాలనే కలుపు లతలను కోసివేసే కొడవలి వంటి వాడుగా ప్రసిద్ధికెక్కాడు.

up-arrow (12) 10.1-419-క.

చుంచొదువుఁ బాలు ద్రావు ము
దంచితముగ ననుఁడుఁ బాలు ద్రావి జననితోఁ
జుం చొదువ దనుచు లీలా
చుంచుం డై యతఁడు చుంచుఁ జూపె నరేంద్రా!
భావము:- ఓ రాజా పరీక్షిత్తు! “చక్కగా పాలు తాగు జట్టు బాగా పెరుగుతుం" దని చెప్పి పాలు తాగించింది తల్లి యశోదాదేవి. పాలు తాగి చేతితో జుట్టు తడువుకుంటు “జుట్టు పెరగలేదేం టమ్మా" యని అడిగాడు లీలలు చూపుటందు ఆసక్తిగల ఆ బాలకృష్ణమూర్తి.

up-arrow (13) 8-593-మ.

నియంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
ర్మణంబైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో;
రుఁడైనన్, హరియైన, నీరజభవుం భ్యాగతుండైన నౌఁ;
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా; ధీవర్య! వే యేటికిన్?
భావము:- మిగతావి అన్నీ అనవసరమయ్య! నే బంధింప బడటం కాని, నాకు దుర్మరణం కలగటం కాని, నాకు నరకం దాపురించటం కాని, నా కులమే నాశనం కావటం కాని, భూమండలం బద్ధలవటం కాని, నిజంగానే వస్తే రానియ్యి; జరుగుతే జరుగనీ; ఏమైనా సరే నేను మాత్రం అబద్ధమాడ లేను. దానం పట్టడానికి వచ్చిన వాడు సాక్షాత్తు ఆ పరమ శివుడే అయినా, ఆ విష్ణుమూర్తే అయినా, ఆ బ్రహ్మదేవుడే అయినా సరే నా నాలుకకి ఆడిన మాట తప్పటం రాదు. పరమ విజ్ఞాన స్వరూప శుక్రాచార్య! నా నిర్ణయం వినవయ్య!

up-arrow (14) 8-644-ఆ.

నిరయమునకుఁ బ్రాప్త నిగ్రహంబునకును
దవిహీనతకును బంధనమున
ర్థ భంగమునకు ఖిల దుఃఖమునకు
వెఱవ దేవ! బొంక వెఱచినట్లు.
భావము:- భగవాన్! నరకానికి పోడం కన్నా, శిక్షింపపడటం కన్నా, ఉన్నతమైన పదవి పోడం కన్నా, బంధింపబడటం కన్నా, సర్వ సంపదలు నశించటం కన్నా, కష్టాలు అన్నీ రాడం కన్నా కూడ అసత్యం చెప్పడానికే ఎక్కువ భయపడతాను సుమా.

up-arrow (15) 10.1-408-శా.

నీ ద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్
నీ పేరం బనిచేయు హస్తయుగముల్ నీ మూర్తిపైఁ జూపులున్
నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపైఁ జిత్తముల్
నీ పై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణా!
భావము:- ఓ కమలపత్రాల వంటి కన్నులున్న కన్నయ్యా! నీ స్తుతి చేసే పద్యాలను విడువక వింటూ ఉండే చెవులను, నిన్ను విడువక స్తోత్రం చేస్తు ఉండే వాక్కులను మాకు అనుగ్రహించు. ఏ పని చేస్తున్నా నీ పేరనే నీ పనిగానే చేసే చేతలను, ఎప్పుడు విడువక నిన్నే చూసే చూపులను మాకు అనుగ్రహించు. నీ పాదపద్మాలను విడువక నమస్కరించే శిరస్సులను, నీమీద ఏకాగ్రమైన భక్తి కలిగి ఉండే మనస్సును, నిరంతరం నీ ధ్యానం పైనే నిలిచి ఉండే బుద్ధిని మాకు దయతో ప్రసాదించు, పరమేశ్వరా!
బాలకృష్ణుడు తన నడుముకు కట్టిన ఱోలు ఈడ్చుకుంటూ రెండు మద్దిచెట్లను కూల్చాడు. వాటినుండి విముక్తులైన గుహ్యకులు కపటబాలుని స్తుతించి మాకు నీ యందు ప్రపత్తిని అనుగ్రహించమని ఇలా వేడుకున్నారు. ఇది భాగవతుల ధర్మాలని నిర్వచించే ఒక పరమాద్భుతమైన పద్యం. అందుకే ఒక శార్దూలాన్ని వదలి, ప్రాసాక్షార నియమాన్ని యతి స్థానాలైన మొదటి, పదమూడవ స్థానాలకు కూడా ప్రసరింపజేసి పంచదార పలుకులకు ప్రత్యేక జిలుగులు అద్దారు పోతనామాత్యులు.

up-arrow (16) 8-19-క.

నీరాట వనాటములకుఁ
బోరాటం బెట్లు కలిగెఁ? బురుషోత్తముచే
నారాట మెట్లు మానెను
ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్.
భావము:- నీటిలో బతుకుతుంది మొసలి. అడవిలో తిరుగుతుంది ఏనుగు. వాటిలో అది భద్రగజం. అయితే ఆ రెంటికి అసలు పోరాటం ఎందుకు జరిగింది ఎలా జరిగింది. అలా జరిగిన ఆ పోరాటంలో పురుషోత్తముడైన శ్రీహరి ఆ గజేంద్రుడి ఆరాటాన్ని ఎలా పోగొట్టి కాపాడాడు.
భాగవతం బహుళార్థ సాధక గ్రంధం. అందులో పంచరత్న ఘట్టాలలో ఒకటైన గజేంద్రమోక్షంలోనే ఎత్తుగడ పద్యం ఇది. చక్కటి ఏకేశ్వరోపాసనతో కూడుకున్న ఘట్టమిది. మంచి ప్రశ్న వేస్తే మంచి సమాధానం వస్తుంది. ఇంత మంచి ప్రశ్న పరీక్షిత్తు వేసాడు కనుకనే శుకుని నుండి గజేంద్రమోక్షం అనే సుధ జాలువారింది. ఇక్కడ పోతనగారి చమత్కారం ఎంతగానో ప్రకాశించింది. ఇందులో త్రిప్రాసం ఉంది “నీరాట, పోరాట, నారాట, ఘోరాట" అని. భాషకి అలంకారాలు అధ్భుతమైన సౌందర్యాన్ని చేకూరుస్తాయి. రెండు లేక అంత కంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు మరల మరల వస్తూ అర్థ భేదం కలిగి ఉంటే అది యమకాలంకారం. ఛేకాను ప్రాసంలో పదాల మధ్య ఎడం ఉండాలి. యమకంలో ఎడం ఉడటం లేకపోడం అనే భేదం లేదు. ఇక్కడ పోతనగారు ప్రయోగించిన యమకం అనే అలంకారం అమిత అందాన్ని ఇచ్చింది. యమకానికి చక్కటి ఉదాహరణ ఇదే అని చెప్పవచ్చు. ఏనుగులు భద్రం, మందం, మృగం అని మూడు రకాలు. వాటిలో భద్రగజం దైవకార్యాదులలో వాడతారు. అట్టి భద్రగజాల కోటికి రాజుట మన కథానాయకుడు గజేంద్రుడు. అఖిలలోకేశ్వరుడు, దయాసాగరుడు ఐన శ్రీహరి మొసలి నోటికి చిక్కిన ఒక గజరాజుని ప్రాణభయంనుండి కాపాడి రక్షించాడు. ఈ అధ్భుత ఘట్టంలోని “ఎవ్వనిచే జనించు. . ." మున్నగు పద్యాలన్నీ అమృతగుళికలే కదా.
రహస్యార్థం: నీరు అనగా చిత్స్వరూపి, బుద్ధి. (ప్రమాణం చిత్స్వరూపం, సర్వ వ్యాపకుడు అయిన విష్ణువే ద్రవ (జల) రూపం అయి నిస్సంశయంగా గంగారూపం పొందుతున్నాడు. అట్టి బుద్ధి రూపమే సంకల్ప రూపం పొందుతుంది. సంకల్పం మనస్సు ఒకటే. అది నీరాటము. సంకల్పం నుండి పుట్టేది కామము. వనమునకు వ్యుత్పత్తి “వన్యతే సేవ్యతే ఇతి వనం" అనగా జీవులచే సేవింపబడునది వనం. అలా కామం వనాటం. అంటే ఆత్మ యొక్క కళ అనే ప్రతిబింబం జీవుడు కదా. ఆ నీరాటమునకు మరియు వనాటం అయిన కామమునకు సంసారం అనే ఘోర అడవిలో కలహం ఎలా కలిగింది? అని ప్రశ్న. పురుషోత్తముడు అయిన విష్ణువు ఆ పోరు అనే భవదుఃఖాన్ని ఎలా తొలగించాడు? అని ప్రశ్న.

up-arrow (17) 4-94-ఉ.

"నీగళాపరాధి యగు నీకుఁ దనూభవ నౌట చాలదా?
చాలుఁ గుమర్త్య! నీదు తనుజాత ననన్ మది సిగ్గు పుట్టెడి
న్నే ధరన్ మహాత్ములకు నెగ్గొనరించెడి వారి జన్మముల్
గాలుపనే? తలంప జనకా! కుటిలాత్మక! యెన్ని చూడఁగన్.
భావము:- "తండ్రీ! లోకకల్యాణంకోసం కాలకూటవిషం తాగి కంఠం నల్లగా చేసుకున్న సర్వలోక శుభంకరుడు కదయ్యా పరమ శివుడు. ఆయన యెడ క్షమింపరాని అపరాధం చేసావు. నా దురదృష్టం కొద్దీ అలాంటి నీకు పుత్రికగా పుట్టాను నీచమానవ! ఇక చాల్లే! నీ కుమార్తె నని తల్చుకుంటేనే సిగ్గు వేస్తోంది. లోకంలో గౌరవనీయులకు కీడు తలపెట్టే నీలాంటి వాళ్ళ పుట్టుకలు ఎందుకయ్యా? కాల్చడానికా? పూడ్చడానికా?

up-arrow (18) 10.1-1241-క.

"నీలోన లేని చోద్యము
లే లోకములందుఁ జెప్ప రీశ్వర! నీటన్
నేలన్ నింగిని దిక్కుల;
నీలో చోద్యంబు లెల్ల నెగడు మహాత్మా!"
భావము:- “స్వామీ నీలో లేని వింతలు ఏ లోకాలలోనైనా ఉంటాయని పెద్దలు చెప్పలేదు. ఇక నీటిలో, నేలలో, నింగిలో ఉంటాయా? మహాత్మా! సర్వదిక్కులలోని విచిత్రాలన్నీ నీలోనే ఉన్నాయి కదా."

up-arrow (19) 9-618-క.

నీ వారము ప్రజలేమును
నీవారము పూజగొనుము నిలువుము నీవున్
నీవారును మా యింటను
నీవారాన్నంబుగొనుఁడు నేఁడు నరేంద్రా! "
భావము:- ఓ రాజా! పౌరులు, మా ఆశ్రమవాసులం అందరం నీ వాళ్ళమే నయ్యా! ఇవాళ్టికి ఇక్కడ ఆగి మా పూజలు అందుకో. మా యింట్లో నివ్వరి అన్నంతో ఆతిథ్యాన్ని స్వీకరించు.
. – అని శకుంతల తమ కణ్వాశ్రమానికి వచ్చిన దుష్యంతునితో పలికింది. నీవార అంటు ప్రతి పాదం మొదట చమత్కారంగా వాడిన విధం పద్యానికి వన్నెతెచ్చింది. ఒకటి కంటె ఎక్కువ అక్షరాలు అర్థ భేదంతో ఒకటి కంటె ఎక్కువ మారులు ప్రయోగిస్తే అది యమకాలంకారం అంటారు. నాలుగు పాదాలలో నీవాళ్ళం, ఈరోజు, నీపరిజనులు, చక్కటిభోజనం అనే నాలుగు అర్థ భేద ప్రయోగాలతో ఇక్కడ యమకం చక్కగా పండింది."

up-arrow (20) 3-840-క.

"నుచరితులార! మీరలు
కృకృత్యులు విష్ణుపూజఁ గేవలభక్తిన్
తి నిష్కపటులరై చే
సితిరి తదర్చన ఫలంబు సేకుఱె మీకున్.
భావము:- “ధన్యచరితులైన ఓ దంపతులారా! మీరు కృతార్థులు. నిజమైన భక్తితో, నిష్కపటమైన మనస్సుతో విష్ణుదేవుని సేవించారు. మీ పూజకు తగిన ఫలం మీకు లభించింది.

up-arrow (21) 2-175-క.

నూన గరళస్తని యగు
పూనఁ బురిటింటిలోనఁ బొత్తుల శిశువై
చేనముల హరియించి ప
రేనగరమునకు ననిచెఁ గృష్ణుఁడు పెలుచన్.
భావము:- శ్రీకృష్ణుడు పురుటింటిలో చంటిబిడ్డగా పొత్తిళ్ళలో ఉన్న సమయ మది. పాలిళ్ళలో ప్రత్యేక విషం కలిగిన పూతన అనే రాక్షసి పాలివ్వటానికి వచ్చింది. ఆ శైశవ కృష్ణుడు ఆమె ప్రాణాలను తాగేసి యమలోకానికి పంపేసాడు.

up-arrow (22) 10.1-105-క.

పంజముఖి నీ ళ్ళాడఁను
సంటపడ ఖలులమానసంబుల నెల్లన్
సంటము దోఁచె; మెల్లన
సంటములు లేమి తోఁచె త్పురుషులకున్.
భావము:- పద్మం వంటి ముఖం గల దేవకి కృష్ణుని కనుటకు ప్రసవవేదనలు పడుతుంటే దుష్టుల మనస్సులలో ఏదో తెలియని ఆవేదన కలిగింది. మంచివారికి కష్టాలు నెమ్మదిగా తొలగిపోతున్న సూచనలు కనిపించాయి.

up-arrow (23) 1-272-మత్త.

పంబాణుని నీఱు సేసిన ర్గునిం దన విల్లు వ
ర్జించి మూర్ఛిలఁ జేయఁ జాలు విశేష హాస విలోక నో
దంచి దాకృతులయ్యుఁ గాంతలు దంభచేష్టల మాధవుం
సంలింపఁగ జేయ నేమియుఁ జాలరైరి బుధోత్తమా!
భావము:- ఓ సుధీసత్తమా! మన్మథుని మూడోకంటి మంటతో నుసి చేసిన మహాశ్వరుని సైతం విల్లు పడేసి మూర్ఛపోయేలా చేసే చిరునవ్వులు, వాల్చూపులు, మనోహర మైన దేహాలు కల వాళ్ళు అయి కూడ ఆ కాంతలు తమ శృంగార చేష్టలతో మాధవుని మనస్సు చలింప చేయ లేకపోయారు.

up-arrow (24) 10.1-308-క.

డఁతీ! నీ బిడ్డడు మా
వలలో నున్న మంచి కాఁగిన పా లా
డుచులకుఁ బోసి చిక్కిన
వలఁ బో నడిచె నాజ్ఞ లదో లేదో?
భావము:- ఓ యశోదమ్మా! నువ్వు గొప్ప పడచుదానివే కాని, నీ పిల్లాడు చూడు; మా కుండలలో చక్కగా కాగిన పాలు ఉంటే, ఆ పాలను తోటిపిల్లలకు పోసేశాడు, ఆ పైన మిగిలిన కడవలను పగలగొట్టేశాడు. మీ వాడికి భయభక్తులు చెప్తున్నారో, లేదో మరి.