పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిలుని జన్మంబు

  •  
  •  
  •  

3-840-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నుచరితులార! మీరలు
కృకృత్యులు విష్ణుపూజఁ గేవలభక్తిన్
తి నిష్కపటులరై చే
సితిరి తదర్చన ఫలంబు సేకుఱె మీకున్.

టీకా:

నుత = స్తుతింపబడిన; చరితులార = నడవడిక కలవారులార; మీరలున్ = మీరు; కృతకృత్యులు = సార్థకజన్మలు; విష్ణు = హరి యొక్క; పూజన్ = పూజలను; కేవల = స్వచ్ఛమైన, ఇతరములేని; భక్తిన్ = అర్చించుటలు; మతిన్ = మనసులలో; నిష్కపటులు = కపటముల లేనివారు; ఐ = అయ్యి; చేసితిరి = చేసారు; తత్ = ఆ; అర్చన = పూజల; ఫలంబున్ = ఫలితము; చేకూఱెన్ = సమకూరినది; మీకున్ = మీకు.

భావము:

“ధన్యచరితులైన ఓ దంపతులారా! మీరు కృతార్థులు. నిజమైన భక్తితో, నిష్కపటమైన మనస్సుతో విష్ణుదేవుని సేవించారు. మీ పూజకు తగిన ఫలం మీకు లభించింది.