పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలిని బంధించుట

  •  
  •  
  •  

8-644-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిరయమునకుఁ బ్రాప్త నిగ్రహంబునకును
దవిహీనతకును బంధనమున
ర్థ భంగమునకు ఖిల దుఃఖమునకు
వెఱవ దేవ! బొంక వెఱచినట్లు.

టీకా:

నిరయమున్ = నరకమున; కునున్ = కు; ప్రాప్త = కలిగిన; నిగ్రహంబున్ = చెఱపట్టబడుటకు; కునున్ = కు; పద = పదవి; విహీనత = పోవుట; కునున్ = కు; బంధనమున్ = బంధింపబడుట; కున్ = కు; అర్థ = సంపదల; భంగమున్ = నశించినందుల; కునున్ = కు; అఖిల = సమస్తమైన; దుఃఖమున్ = దుఃఖముల; కున్ = కు; వెఱవన్ = బెదరను; దేవ = భగవంతుడా; బొంక = అబద్ధమాడుటకు; వెఱచిన్ = బెదరెడి; అట్లు = విధముగా.

భావము:

భగవాన్! నరకానికి పోడం కన్నా, శిక్షింపపడటం కన్నా, ఉన్నతమైన పదవి పోడం కన్నా, బంధింపబడటం కన్నా, సర్వ సంపదలు నశించటం కన్నా, కష్టాలు అన్నీ రావడం కన్నా కూడ అసత్యం చెప్పడానికే ఎక్కువ భయపడతాను సుమా.