పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-46-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని చని తొంటి మత్స్యకురుజాంగలభూము లతిక్రమించి చ
య్య యమునానదిం గదిసి చ్చట భాగవతున్ సరోజలో
దృఢభక్తు సద్గుణవిశారదు శాంతుని దేవమంత్రి శి
ష్యుని మహితప్రసిద్ధుఁ బరిశోషితదోషుఁ బ్రబుద్ధు నుద్ధవున్.

టీకా:

చనిచని = వెళ్ళివెళ్ళి; తొంటి = మునుపటి; మత్స్య = మత్స్య; కురు = కురుదేశపు; జాంగల = మెరక; భూములన్ = ప్రదేశములన్; అతిక్రమించి = దాటి; చయ్యన = వేగముగ; యమునా = యమున అను; నదిన్ = నదిని; కదిసి = సమీపించి; అచ్చటన్ = అక్కడ; భాగవతున్ = భాగవత ధర్మానుయాయిని; సరోజలోచన = కృష్ణుని {సరోజలోచనుడు - సరస్ నందు పుట్టిన (పద్మము)ల వంటి కన్నులున్నవాడు, కృష్ణుడు}; దృఢ = గాఢమైన; భక్తున్ = భక్తుని; సద్గుణ = మంచిగుణములలో; విశారదు = బహునేర్పరిని; శాంతుని = ప్రశాంతముగ నుండువానిని; దేవమంత్రి = బృహస్పతి {దేవమంత్రి - దేవతలకు మంత్రి, బృహస్పతి}; శిష్యుని = శిష్యుని; మహిత = మిక్కిలి; ప్రసిద్ధున్ = పేరుపొందినవానిని; పరిశోషిత = శుష్కింపబడిన; దోషున్ = దోషములు కల వానిని; ప్రబుద్ధున్ = మేల్కాంచిన బుద్ధి కలవానిని; ఉద్ధవున్ = ఉద్ధవుని.

భావము:

అలాగ వెళ్ళివెళ్ళి మత్స్య, కురు, జాంగల భూములను అతిక్రమించి అనంతరం యమునా నదిని సమీపించాడు. ఆ నదీతీరంలో పరమభాగవతుడు, శ్రీకృష్ణుని మీద అఖండమైన భక్తిగలవాడు. ఉత్తమగుణ సంపన్నుడు, శాంతుడు, రాజనీతిలో బృహస్పతి శిష్యుడు, మిక్కిలి యశస్సు కలవాడూ, దోషశూన్యుడు, మహాజ్ఞాని అయిన ఉద్ధవుణ్ణి దర్శించాడు.