పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : గుహ్యకుల కృష్ణ స్తుతి (మంగళ కరము)

  1
"బాలుఁడవె నీవు? పరుఁడ వ
నాలంబుఁడ వధికయోగి వాద్యుడవు తను
స్థూలాకృతి యగు విశ్వము
నీ లీలారూప మండ్రు నిపుణులు కృష్ణా!

  2
ల్లభూతంబుల కింద్రియాహంకృతి-
ప్రాణంబులకు నధితివి నీవ;
ప్రకృతియుఁ బ్రకృతిసంవమహత్తును నీవ-
వీని కన్నిటికిని విభుఁడ వీవ;
ప్రాకృతగుణవికాములఁ బొందక పూర్వ-
సిద్దుఁడ వగు నిన్నుఁ జింత జేయ
గుణయుతుం డోపునే? గుణహీన! నీ యంద-
ల గుణంబుల నీవ ప్పఁబడుదు;

  3
మొదల నెవ్వని యవతారములు శరీరు
లందు సరిదొడ్డు లేని వీర్యముల దనువు
డర జన్మించి వారల యందుఁ జిక్క;
ట్టి పరమేశ! మ్రొక్కెద య్య! నీకు.

  4
భునములు చేయఁ గావఁగ
తీర్ణుఁడ వైతి కాదె ఖిలేశ్వర! యో
గిరేణ్య! విశ్వమంగళ!
విసన్నుత! వాసుదేవ! ల్యాణనిధీ!

  5
స్వివాక్యంబులు ప్ప వయ్యెన్;
నెపంబునం గంటిమి నిన్నుఁ జూడన్
పంబు లొప్పెన్; మముఁ దావకీయ
ప్రన్నులం జేయుము క్తమిత్రా!

  6
నీ ద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్
నీ పేరం బనిచేయు హస్తయుగముల్ నీ మూర్తిపైఁ జూపులున్
నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపైఁ జిత్తముల్
నీ పై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణా!"

  7
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత దశమస్కంధ పూర్వభాగ అంతర్గత గుహ్యకుల కృష్ణ స్తుతి (మంగళ కరము)