పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : కథా ప్రారంభము

 •  
 •  
 •  

1-34-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

విశ్వ జన్మస్థితివిలయంబు లెవ్వని-
లన నేర్పడు, ననుర్తనమున
వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుఁడై-
తాన రాజగుచుఁ జిత్తమునఁ జేసి
వేదంబు లజునకు విదితముల్ గావించె-
నెవ్వఁడు, బుధులు మోహింతురెవ్వ
నికి, నెండమావుల నీటఁ గాచాదుల-
న్యోన్యబుద్ధి దా డరునట్లు

1-34.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము
భంగిఁ దోఁచు, స్వప్రభానిరస్త
కుహకుఁ డెవ్వఁ, డతనిఁ గోరి చింతించెద,
నఘు సత్యుఁ బరుని నుదినంబు.

టీకా:

విశ్వ = విశ్వముల యొక్క; జన్మ = పుట్టుక; స్థితి = పాలించుటలు; విలయంబులు = నాశనములు; ఎవ్వాని = ఎవ్వని; వలనన్ = వలననైతో; ఏర్పడున్ = ఏర్పడుతాయో; అనువర్తనమున = అనుకూలంగా వర్తించుటలోను; వ్యావర్తనమున = వ్యతిరేకముగా వర్తించుటలోను; కార్యములు = వ్వవహారములు; అందున్ = లోను; అభిజ్ఞుఁడు = బాగా తెలిసినవాడు; ఐ = అయ్యి; తాన = తనే; రాజు = పరిపాలించేవాడు; అగుచు = అయ్యి; చిత్తమున = మనసున; చేసి = సంకల్పించినంత మాత్రమున; వేదంబులు = వేదములు; అజునకు = పుట్టుక లేనివాడైన బ్రహ్మకు {అజుడు - ఎవరిగర్భంలోను పుట్టుక లేనివాడు}; విదితములు = తెలియునట్లు; కావించెన్ = చేసినది; ఎవ్వఁడు = ఎవరో; బుధులు = జ్ఞానులు; మోహింతురు = మోహిస్తారో; ఎవ్వనికి = ఎవరినినో; ఎండమావుల = ఎండమావులలోని; నీటన్ = నీరు; కాచన్ = గాజు; ఆదులన్ = మొదలగు వానిలో వలె; అన్యోన్య = ఒకదానిలోనింకోటి; బుద్ధి = ఉండినట్లు అనిపించుచు; తాన్ = అదే; అడరునట్లు = ప్రకాశించినట్లు;
త్రిగుణసృష్టి = త్రిగుణాత్మక సృష్టి; ఎందున్ = ఎందులోనైతే; దీపించి = కనిపించుతూ; సత్యము = నిజము; భంగిన్ = వలె; తోఁచున్ = అనిపించునో; స్వ = తన; ప్రభా = ప్రభావముచే; నిరస్త = తొలగింపడిన; కుహకుఁడు = మాయ కలవాడు; ఎవ్వఁడు = ఎవ్వడో; అతనిన్ = అతనిని; కోరి = కోరి; చింతించెదన్ = ప్రార్థింతును; అనఘున్ = పాప మంటని వానిని; సత్యున్ = సత్యమైన వానిని; పరునిన్ = అందఱికి పై నున్నవానిని; అనుదినంబు = ప్రతిరోజు.

భావము:

ఎవనివల్ల ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలు ఏర్పడుతుంటాయో; ఎవడు సర్వతోముఖమైన కార్యనిర్వహణలో సమర్థుడో; ఎవడు సమస్తానికి రాజై విరాజిల్లుతుంటాడో; ఎవడు సంకల్పమాత్రం చేతనే బ్రహ్మదేవునికి వేదాలన్నీ తేటతెల్లం చేసాడో; ఎవని మాయకు పండితులు సైతం లోబడిపోతారో; ఎవనియందు సత్త్వరజస్తమో గుణాత్మకమైన ఈ సృష్టి అంతా ఎండమావుల్లో, నీళ్లలో, గాజు వస్తువుల్లో లాగ అసత్యమై కూడ సత్యంగా ప్రతిభాసిస్తూ ఉంటుందో; ఎవడు తనతేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో ఆ పాపరహితుడు, సత్యస్వరూపుడు అయిన ఆ పరాత్పరుని ప్రతినిత్యమూ స్తుతి చేస్తున్నాను.

1-35-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు "సత్యంపరంధీమహి"యను గాయత్రీ ప్రారంభమున గాయత్రీ నామబ్రహ్మ స్వరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మవిస్తరంబును వృత్రాసుర వధంబును నెందుఁ జెప్పంబడు నదియ భాగవతం బని పలుకుటం జేసి, యీ పురాణంబు శ్రీమహాభాగవతం బన నొప్పుచుండు.
భాగవతము - గాయత్రి
గాయత్రి - పట్టిక
గాయత్రి - యంత్రము

టీకా:

ఇట్లు = ఈవిధంగా; సత్యంపరంధీమహి = సత్యంపరంధీమహి {సత్యంపరంధీమహి - జ్ఞాని సత్యమే ఉత్కృష్ట మైనది}; అను = అని పలికే; గాయత్రీ = గాయత్రీ మంత్రము యొక్క {గాయత్రి - 1) పాఠ్యంతరాలు గాయత్త్రీ, గాయత్రీమంత్రము; ద్విజులు సంధ్యోపాసనా సమయమున జపించు ఒకానొక మంత్రము; దీనికి ఋషి విశ్వామిత్రుడు, దేవత సవిత; దీనికి 3 పాదములును పాదమునకు 8 అక్షరములును ఉండును, ,వ్యు. (అ) త్త్రైజ - పాలనే - గాయతం త్రాయతే - గాయత్+త్త్రై+క, కృప్ర., తనను జపించు వానిని కాపాడునది, (శబ్దరత్నాకరము) (ఆ) గాయతాం త్రాయతే యస్మా ర్గాయత్రీ తేనకధ్యతే (ఆంధ్రవాచస్పతముు) 2) దేవతా విశేషము,}; ప్రారంభమున = మూలములో; గాయత్రీ = గాయత్రి అను; నామ = పేరుగల; బ్రహ్మ = సర్వాంతర్యామి యొక్క; స్వరూపంబు = స్వరూపము; ఐ = అయి; మత్స్యపురాణంబు = శ్రీ మత్స్య మహాపురాణము; లోనన్ = లోనున్న; గాయత్రిని = గాయత్రిని; అధికరించి = అధిగమించి; ధర్మ = ధర్మముయొక్క; విస్తరంబును = విస్తారమైన వివరణను; వృత్రా = వృతుడు అను; అసుర = అసురుని; వధంబును = సంహారమును; ఎందున్ = ఎందులోనైతే; చెప్పంబడున్ = చెప్పబడుతుందో; అదియ = అదే; భాగవతంబు = భాగవతము; అని = అని; పలుకుటన్ = పలుకుటను; చేసి = చేసి; ఈ = ఈ; పురాణంబు = పురాణము; శ్రీ = శ్రీ; మహా = గొప్ప; భాగవతంబు = భాగవతము; అనన్ = అనుటకు; ఒప్పుచు = తగి; ఉండున్ = ఉండును.

భావము:

"సత్యం పరం ధీమహి” పరమమైన సత్యమునే ధ్యానము చేసెదము అనే గాయత్రీ మహామంత్రంతో ఆరంభించటం వల్ల గాయత్రి పరదేవతాస్వరూప మైనది. గాయత్రిని అతిశయింపజేస్తూ, ధర్మ ప్రస్తారాన్నీ, వృత్రాసుర సంహారాన్నీ అభివర్ణించే గ్రంథాన్ని భాగవతం అంటారు అని మత్స్యపురాణంలో చెప్పి ఉండటంవల్ల ఈ మహా గ్రంథం శ్రీ మహాభాగవతం అని ప్రసిద్ధి గాంచింది.
గమనిక :~ గాయత్రీనామబ్రహ్మ అని ప్రయోగించడంతో, భాగవతగ్రంథరూప పరబ్రహ్మ అని చెప్పబడే శ్రీమద్భాగవత పురాణానికిని, గాయత్రికిని అబేధం సూచింపబడుతోంది

1-36-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

శ్రీమంతమై, మునిశ్రేష్ఠకృతంబైన-
భాగవతంబు సద్భక్తితోడ
వినఁ గోరువారల విమలచిత్తంబులఁ-
జెచ్చెర నీశుండు చిక్కుఁ గాక
యితరశాస్త్రంబుల నీశుండు చిక్కునే,-
మంచివారలకు నిర్మత్సరులకుఁ
పట నిర్ముక్తులై కాంక్ష సేయకయును-
గిలి యుండుట మహాత్త్వబుద్ధిఁ,

1-36.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రఁగ నాధ్యాత్మికాది తాత్రయంబు
డఁచి, పరమార్థభూతమై, ధిక సుఖద
మై, సమస్తంబుఁ గాకయు, య్యు నుండు
స్తు వెఱుఁగంగఁ దగు భాగతమునంద.

టీకా:

శ్రీమంతము = శుభంకరము; ఐ = అయిన ; ముని = మునులలో; శ్రేష్ఠ = శ్రేష్ఠునిచే - వ్యాసునిచేత; కృతంబు = రచింపబడినది; ఐన = అయినట్టి; భాగవతంబు = భాగవతము; సద్భక్తి = మంచిభక్తి; తోడన్ = తో; వినన్ = వినుటను; కోరువారల = కోరేవారి; విమల = నిర్మలమైన; చిత్తంబులన్ = మనస్సులలో; చెచ్చెరన్ = తొందరగా; ఈశుండు = జీవులలోనున్న ఈశ్వరుడు; చిక్కున్ = దొరకును; కాక = అంతేకాని, తప్పించి; ఇతర = ఇతర; శాస్త్రంబులన్ = శాస్త్రములకు; ఈశుండు = ఈశ్వరుడు; చిక్కునే = దొరుకుతాడా; మంచివారల = మంచి వాళ్ళ; కున్ = కును; నిర్మత్సరులు = మాత్త్సర్యం లేని వాళ్ళ; కున్ = కును; కపట = మాయ నుంచి; నిర్ముక్తులై = విడిపింప బడ్డవారై; ఐ = అయ్యి; కాంక్ష = కోరుట; సేయకయును = చేయకుండక; తగిలి = తగిలి (భక్తికి); ఉండుటన్ = ఉండటమును; మహాతత్త్వ = మహత్త్వమైన అంతర్యామి యందు; బుద్ధిన్ = ధ్యాస; పరఁగ = ప్రవర్తిల్లగ; ఆధ్యాత్మిక = ఆధ్యాత్మికము; ఆది = మొదలైన; తాపత్రయంబున్ = మూడు రకాలైన తాపములను {తాపత్రయంబు - (ఆధ్యాత్మిక, ఆధిభౌతిక , ఆధిదైవిక)}; అడఁచి = అణచి;
పరమార్థ = మోక్షము యొక్క; భూతము = రూపము; ఐ = అయ్యి; అధిక = మిక్కిలి; సుఖదము = సుఖప్రదము; ఐ = అయ్యి; సమస్తంబున్ = సర్వమును; కాకయు = కాకుండాను; అయ్యున్ = అయ్యికూడా; ఉండు = ఉండే టటువంటి; వస్తువు = వస్తువు; ఎఱుఁగంగన్ = తెలిసికొనుటకు; తగు = వీలున్నది; భాగవతమున్ = భాగవతము; అందున్ = లోమాత్రమే.

భావము:

శ్రీమంతమైనది, వేదవ్యాస మహామునిచే విరచితము ఐన ఈ భాగవత మహాపురాణాన్ని అచంచల భక్తితో ఆకర్ణించగోరే భక్తుల అంతరంగాలలోనే భగవంతుడు నిరంతరం నివసిస్తాడు. అంతే తప్ప ఇతర గ్రంథాల వల్ల ఈశ్వరుడు చిక్కడు. సజ్జనులు మాత్సర్యరహితులు మహాతత్వబుద్ధి కలిగి కపటమార్గాన పోకుండ, ఎటువంటి కాంక్షా లేకుండ, భాగవత శ్రవణమందే ఆసక్తులై ఉంటారు. ఇందువల్ల తాపత్రయం అంటే ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికము అనే త్రివిధ తాపాలూ నశించి వారికి తత్త్వజిజ్ఞాస కలుగుతుంది. ఈ భాగవతంలో మాత్రమే పరమార్థభూతము, పరమానంద దాయకము, వ్యక్తావ్యక్తము అయిన పరబ్రహ్మ స్వరూపం అభివ్యక్త మవుతుంది.

1-37-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వేదకల్పవృక్షవిగళితమై, శుక
ముఖసుధాద్రవమున మొనసి యున్న,
భాగవతపురాణలరసాస్వాదన
దవిఁ గనుఁడు రసికభావవిదులు.

టీకా:

వేద = వేదము అను; కల్పవృక్ష = కల్పవృక్షము నుండి; విగళితము = జారినది; ఐ = అయి; శుక = శుకబ్రహ్మ, చిలుక; ముఖ = ముఖము అను, ముక్కు తగిలిన; సుధాద్రవమున = అమృతముతో, మంచి రసముతో; మొనసి = నిండినదై, రుచి కలదియై; ఉన్న = ఉన్నటువంటి; భాగవత = భాగవతము అని పేరు గల; పురాణ = పురాణము యొక్క, పురాణము అను; ఫల = ఫలితము యొక్క, పండు యొక్క; రస = భావమును, రసమును; ఆస్వాదన = ఆస్వాదించు; పదవిన్ = ఉన్నతమైన స్థితిని, మార్గాన్ని; కనుఁడు = కనుగొనుడు, చూడండి; రసిక = రసికత్వ, రుచి యొక్క; భావ = భావవివరాలు, ప్రత్యేకత; విదులు = బాగా తెలిసిన వారు.

భావము:

భాగవత మనే ఈ మహాఫలం వేద మనే కల్పవృక్షం నుండి బాగా పండి రాలింది. శుకముఖ సుధాద్రవంతో అతిశయించి ఉంది. భావజ్ఞులు రసజ్ఞులు ఐన భక్తవరేణ్యులారా! రండి ఈ ఫలరసాన్ని ఆస్వాదించి ధన్యులు కండి.