పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : బ్రహ్మదేవుని శివ స్తుతి (ఆరోగ్య ప్రదం)

  1
గములకు నెల్ల యోనిబీజంబు లైన
క్తి శివకారణుండవై గతి నిర్వి
కార బ్రహ్మంబ వగు నిన్నుఁ డఁగి విశ్వ
నాథుఁ గా నెఱిఁగెద నా మమున నభవ!

  2
మత నది గాక తావకాంశంబు లైన
క్తి శివరూపములఁ గ్రీడ లుపు దూర్ణ
నాభి గతి విశ్వ జనన వినాశ వృద్ధి
హేతుభూతుండ వగుచుందు వీశ! రుద్ర!

  3
నఘ! లోకంబుల యందు వర్ణాశ్రమ-
సేతువు లనఁగఁ బ్రఖ్యాతి నొంది
లసి మహాజన రిగృహీతంబులై-
ఖిల ధర్మార్థదాకము లైన
వేదంబులను మఱి వృద్ధి నొందించుట-
కొఱకునై నీవ దక్షుని నిమిత్త
మాత్రునిఁ జేసి యమ్మఖముఁ గావించితి-
టుగాన శుభమూర్తివైన నీవు

  4
డఁగి జనముల మంగళర్ము లయిన
వారి ముక్తి, నమంగళాచారు లయిన
వారి నరకంబు, నొందింతు భూరిమహిమ
క్తజనపోష! రాజితణివిభూష!

  5
అట్లగుటం దత్కర్మంబు లొకానొకనికి విపర్యాసంబు నొందుటకుఁ గారణం బెయ్యదియో? భవదీయ రోషంబు హేతువని తలంచితినేనిఁ ద్వదీయ పాదారవింద నిహిత చిత్తులై సమస్తభూతంబుల యందు నినుం గనుంగొనుచు భూతంబుల నాత్మయందు వేఱుగాఁ జూడక వర్తించు మహాత్ముల యందు నజ్ఞులైనవారి యందుఁబోలె రోషంబు దఱచు వొరయ దఁట; నీకుఁ గ్రోధంబు గలదే?"యని.

  6
ఇతి బమ్మెఱ పోతనామాత్య కృత శ్రీమత్తెలుగు భాగవత చతుర్థ స్కంధ అంతర్గత బ్రహ్మదేవుని శివ స్తుతి (ఆరోగ్య ప్రదం)