పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : శివుం డనుగ్రహించుట

  •  
  •  
  •  

4-147.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డఁగి జనముల మంగళర్ము లయిన
వారి ముక్తి, నమంగళాచారు లయిన
వారి నరకంబు, నొందింతు భూరిమహిమ
క్తజనపోష! రాజితణివిభూష!

టీకా:

అనఘ = పుణ్యుడ; లోకంబుల = లోకములు; అందున్ = లో; వర్ణ = వర్ణ ధర్మములకు {వర్ణధర్మములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర అనెడి చతుర్వర్ణముల ధర్మములు}; ఆశ్రమ = ఆశ్రమ ధర్మములకు {ఆశ్రమధర్మములు - 1బ్రహ్మచర్య 2గార్హస్త్య 3వానప్రస్థ 4సన్యాస అనెడి చతురాశ్రమముల ధర్మములు}; సేతువులు = చెరువు కట్టలా కాపాడునవి; అనగన్ = అని; ప్రఖ్యాతిని = ప్రసిద్ధిని; ఒంది = పొంది; బలసి = వృద్ధిపొంది; మహా = గొప్ప; జన = వారిచే; పరిగృహీతంబులు = స్వీకరింపబడినవి; ఐ = అయ్యి; అఖిల = సమస్తమైన; ధర్మ = ధర్మములు; అర్థ = సంపదలను; దాయకంబులు = ఇచ్చునవి; ఐన = అయిన; వేదంబులను = వేదములను; మఱి = ఇంకా; వృద్ధిన్ = అభివృద్ధిని; ఒందించుట = పొందించుట; కొఱకున్ = కోసము; ఐ = అయ్యి; నీవ = నీవే; దక్షుని = దక్షుని; నిమిత్తమాత్రునిన్ = కారణమగుట మాత్రమైన వానిగా; చేసి = నియమించి; ఆ = ఆ; ముఖమున్ = పేరుతో; కావించితివి = చేసితివి; అటుగాన = అందుచేత; శుభమూర్తివి = శుభమేస్వరూపము; ఐన = అయిన; నీవు = నీవు; కడగి = పూని.
జనముల = జనులలో; మంగళ = శుభకరమైన; కర్ములు = పనులుచేసెడివారు; అయిన = అయినట్టి; వారిన్ = వారికి; ముక్తిన్ = ముక్తిని; అమంగళ = అశుభములను; ఆచారులకు = చేయువారు; అయిన = అయినట్టి; వారిన్ = వారికి; నరకంబున్ = నరకమును; ఒందింతు = పొందింతువు; భూరి = అత్యధికమైన; మహిమన్ = మహిమతో; భక్తజనపోష = శివ {భక్తజనపోషుడు - భక్తులయినవారిని కాపాడువాడ, శివుడు}; రాజితఫణివిభూష = శివ {రాజితఫణివిభూషణుడ - విరాజిల్లుతున్న నాగేశ్వరునితో చక్కగ అలంకరింపబడినవాడు, శివుడు}.

భావము:

ఓ భక్తజన పోషణా! పన్నగ భూషణా! లోకాలలో వర్ణాశ్రమాచారాలను వేదాలు నిర్ణయిస్తాయి. గొప్పవారు వేదాలను గౌరవిస్తారు. వేదాలు సర్వ ధర్మార్థాలను ప్రసాదిస్తాయి. ఆ వేదాలను వృద్ధి చేయటం కోసం నీవు దక్షుణ్ణి నిమిత్తమాత్రునిగా చేసి ఆ యజ్ఞం చేయించావు. నీవు మంగళ స్వరూపుడవు. నీవు నీ మహిమచేత శుభకర్మలు చేసేవారికి ముక్తిని, అశుభకర్మలు చేసేవారికి నరకాన్ని కలిగిస్తావు.