పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : శివుం డనుగ్రహించుట

  •  
  •  
  •  

4-146-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మత నది గాక తావకాంశంబు లైన
క్తి శివరూపములఁ గ్రీడ లుపు దూర్ణ
నాభి గతి విశ్వ జనన వినాశ వృద్ధి
హేతుభూతుండ వగుచుందు వీశ! రుద్ర!

టీకా:

సమతన్ = చక్కగా; అది = అంతే; కాక = కాకుండగ; తావక = నీ యొక్క; అంశంబులు = అంశలు; ఐన = అయిన; శక్తి = శక్తి; శివ = శివ; రూపములన్ = రూపములతో; క్రీడన్ = ఆటలాగ; సలుపు = చేసెడి; తూర్ణనాభి = సాలీడు; గతిన్ = వలె; విశ్వ = జగము యొక్క; జనన = సృష్టి; వినాశ = లయ; వృద్ధిన్ = పోషణలకు; హేతుభూతుండవు = కారణమాత్రుడవు; అగుచున్ = అవుతూ; ఉందువు = ఉంటావు; ఈశ = శివుడ; రుద్ర = శివుడ.

భావము:

ఓ ఈశ్వరా! రుద్రా! నీవు నీ సమాంశాలైన శివ శక్తి స్వరూపాలతో క్రీడిస్తావు. సాలెపురుగు వలె విశ్వసృష్టికీ, వృద్ధికీ వినాశానికీ నీవే హేతువు అవుతుంటావు.